twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాక్షసే.. ('అందాల రాక్షసి' రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: వారాహి చలనచిత్రం
    నటీనటులు: నవీన్‌ చంద్ర, రాహుల్‌, లావణ్య, ప్రగతి, సీవీఎల్‌ తదితరులు
    సంగీతం: రధన్‌
    నిర్మాతలు: సాయి కొర్రపాటి, ఎస్‌.ఎస్‌.రాజమౌళి
    ఛాయాగ్రహణం: జి.మురళి
    దర్శకత్వం: హను రాఘవపూడి
    విడుదల: శుక్రవారం.

    మణిరత్నం సినిమాలలో బెస్ట్ సీస్స్ తీసుకుని కలిపి చేసి ఓ కొత్త కథ చేస్తే...ఎలా ఉంటుంది...ఐడియా బావుంది కదా...కానీ అవన్నీ నైంటిస్ లో వచ్చిన కథలు కదా అంటారా.. అయితే కథను వైంటీస్ లోనే జరిగేలా పెడదాం అని ఫిక్సై చేసినట్లున్న చిత్రం 'అందాల రాక్షసి'. కొత్తగా పరిచయమైన దర్శకుడు కథను మణిరత్నం ధోరణిలోనే మంచి విజువల్స్ తో నడిపారు కానీ కథను మాత్రం.. ఆయన సినిమాల్లో చూపే కరెంట్ ఎఫైర్స్ కు ముడిపెట్టకుండా మరీ సెవంటీస్ కాలంనాటి సెంటిమెంట్ తో పడకొట్టాలని చూసాడు. అయితే ప్రస్తుతం టీవీ సీరియల్స్ ఆ పని విజయవంతగా చేస్తున్నాయి కాబట్టి... ఈ ప్రయత్నం నిరర్దకమే అనిపిస్తుంది. దాంతో టైటిల్ కి తగినట్లు సినిమా పైకి అందంగా(పోస్టర్స్,ప్రోమోలు)ఉన్నా..ప్రేక్షకుల పాలిట రాక్షసి అయ్యింది.

    బోర్న్ రిచ్ అయిన గౌతమ్‌ (రాహుల్‌)ఓ రోజు అనుకోకుండా ఓ అమ్మాయి మిథున (లావణ్య)ని చూసి ఆమే తన అందాల రాక్షసి అని ఫిక్సై ప్రేమలో పడిపోతాడు. అయితే ఆమె సూర్య (నవీన్‌)అనే మిడిల్ క్లాస్ కళాకారుడితో తో ప్రేమలో మునిగితేలుతూంటుంది. కానీ సూర్య అప్పటికే ఓ యాక్సిడెంట్ లో ఆమెకు దూరమౌతాడు. ఆ జ్ఢాపకాల విషాదంలో ఉన్న ఆమెకు తన ప్రేమతో కొత్త జీవితాన్ని ఇచ్చి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు గౌతమ్. అంతా సవ్యంగా జరుగుతోంది ఆమె కూడా గతం మర్చిపోయి..గౌతమ్ ని యాక్సెప్టు చేస్తోంది అనుకునే సమయానికి సూర్య బ్రతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు గౌతమ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు..మిధున పరిస్దితి ఏమిటనేది మిగతా కథ.

    అప్పట్లో వచ్చిన ప్రేమ ప్రయాణం (శ్రీకాంత్), కుంకుమ(శివబాలాజీ) చిత్రాలను గుర్తు చేసే ఈ చిత్రం మణిరత్నం గీతాంజలి, మౌనరాగం ప్రేరణతో చేసిన ప్రోమోలు ఎఫెక్టుతో ఓపినింగ్స్ ను బాగా రాబట్టింది. అప్పటివరకూ దర్శకుడు విజయం సాధించాడు. అయితే ఎంతో నమ్మకం పెట్టుకుని ధియోటర్ కు వచ్చిన ఆ ప్రేక్షకుల నమ్మకాన్నే నిలబెట్టుకోలేకపోయాడు. దర్శకుడు కథ గురించి రిలీజ్ కు ముందు చెప్తూ.. సూర్యుడు, చంద్రుడు, భూమి... వీటిని ముగ్గురు వ్యక్తులకు ముడిపెడుతూ రాసుకొన్న ప్రేమకథ ఇది అన్నారు. అయితే అది తెరపై ఎక్కడా కనపడదు. ముగ్గురు పాత్రల మధ్యన జరిగే సంఘర్షణ ఎక్కడా ఉండదు. హీరోలిద్దరి పాత్రలను ,ఎస్టాబ్లిష్ చేయటానికే స్క్రీన్ సమయం(పస్టాప్ లో గౌతమ్ ప్రేమ, సెకండాఫ్ లో సూర్య ప్రేమ) సరిపోయింది.

    కథ సమస్య (తన ప్రేమించే అమ్మాయి మాజీ లవర్ బ్రతికే ఉన్నాడనే విషయం మొదటి హీరోకి తెలియటం)లోకి ప్రవేశించేసరికే ప్రీ క్లైమాక్స్ చేరుకుంది. దాంతో సినిమాకు ఓ డైమన్షన్ అంటూ లేకుండాపోయింది. క్లైమాక్స్ లో ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవటం మరీ తమిళ అతి అనిపిస్తుంది తప్ప ఎమోషనల్ గా కట్టిపారేయదు. కథలో విలన్ లేడు కానీ..విలన్ పాత్రను పోషించే విధి కూడా బలహీనంగానే ఉంది. ఇలా స్కీన్ ప్లే లోపంతో ఈ సినిమా ప్రేక్షకుడికి సహన పరీక్ష పెట్టడంతో సక్సెస్ అయ్యింది. ఫస్టాఫ్ ఎలా ఉన్నా సెకండాఫ్ లవ్ స్టోరీ బాగుంది అనుకునేలోగా. .దారుణమైన తమిళ అతి క్లైమాక్స్ తో ఆ ఇంప్రెషన్ లేకుండా చేసారు.

    ఇక డైరక్షన్ విషయానికి వస్తే విజువల్స్ ని, సింబాలిజంలను చూపెట్టడంలో దర్శకుడు పూర్తిగా దృష్టి పెట్టాడు. దానికి కెమెరామెన్ కూడా బాగా సహకరించి మంచి విజువల్స్ ని ఇచ్చాడు. అయితే కేవలం విజువల్స్ మీదే సినిమా ఆడదు కదా. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సూర్య పాత్ర ప్రేమ కథను బాగా చిత్రీకరించాడు. ఎడిటింగ్ సినిమాకు తగ్గట్లే ఉంది. చాలా సీన్స్ మెల్లిగా నడుస్తూంటాయి. ఎంత ఫీల్ కోసమైనా ఈ రోజుల్లో వాటిని భరించటం కష్టమనిపిస్తుంది. అలాగే డైలాగులు ఎందుకు అంతలా హీరోయిన్ (గీతాంజలిలో హీరోయిన్ లేచిపోదామా అని అరిచి చెప్పినట్లుగా) అరిచి చెప్తుందో అర్దం కాదు. సినిమాలో ఇదో పెద్ద డిస్ట్రబెన్స్. పాటల్లో ఇప్పటికే పాపులరైన రెండు ట్యూన్స్ బాగున్నాయి. నటీనటుల్లో హీరోయిన్ గా చేసిన లావణ్యకే ఎక్కువ మార్కులు పడతాయి. అలాగే సూర్య గా చేసిన నవీన్ కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు హీరోలు మంచి ఈజ్ తో నటించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ వద్ద బాటిల్స్ తో హీరోయిన్ ఫేస్ చేయటం హైలెట్.

    ఫైనల్ గా ప్రేక్షకుల్ని ఇరవై ఏళ్ల కిందటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాం... అని దర్సకుడే స్వయంగా చెప్పినట్లు.. సినిమా ఓ ఇరవై ఏళ్ల క్రిందటి వచ్చి ఉంటే హిట్టై ఉండేది. క్లైమాక్స్ ని మార్చి రీషూట్ చేస్తే కొంతలో కొంత ఓకే నిలబడే అవకాశం ఉంది. మనలో ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని నియంత్రించి ఎక్కడ కామా పెట్టాలో,ఎ క్కడ పుల్ స్టాప్ పెట్టాలో స్పష్టత లేకపోతే ఇలాంటి సినిమాలే వస్తాయని మరో ప్రూవ్ చేస్తుంది.

    English summary
    Andala Rakshasi is a triangle love story released today with negative talk. It's a film which is set in the 90′s back drop and shot very aesthetically. Hanu Raghavapudi is the director of the movie and this is his debut film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X