twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Peddanna movie Review.. రొటీన్, రెగ్యులర్, కొత్తదనం లేని మాస్ ఎంటర్‌టైనర్

    |

    Rating:
    2.5/5

    కబాలి, కాలా, దర్బార్ చిత్రాల తర్వాత భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న తన అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచడానికి రజనీకాంత్ తాజాగా పెద్దన్న (అన్నాతే తమిళంలో) చిత్రం ముందుకొచ్చారు. అయితే రజనీకాంత్ సినిమా అంటే అట్టహాసంగా, దేశవ్యాప్తంగా ఓ హంగామా ఉంటుంది. గత చిత్రాలకు భిన్నంగా రజనీకాంత్ నటించిన సినిమా థియేటర్లలో వస్తున్న సమయంలో ఎలాంటి బజ్ లేకుండా సాదాసీదా రిలీజైంది. అయితే పెద్దన్న చిత్రం తన అభిమానులను సంతృప్తి పరిచిందా? రజనీకాంత్ పెద్దన్నతో భారీ విజయాన్ని చేజిక్కించుకొన్నారా అనే విషయం తెలుసుకొనే ముందు కథ, కథనాలు ఓసారి పరిశీలిద్దాం..

    పెద్దన్న కథ ఏమిటంటే..

    పెద్దన్న కథ ఏమిటంటే..

    రాజోలు గ్రామంలో అన్యాయాలు, అక్రమాలకు ఎదురు నిలిచే పెద్దన్న (రజినీకాంత్) నీతి, నిజాయితీ, న్యాయానికి ప్రతీక నిలుస్తాడు. తన గ్రామ ప్రజలకు అండగా ఉంటే పెద్దన్నకు తన ప్రాణం కంటే మిన్నగా చూసుకొనే చెల్లెలు కనక మహాలక్ష్మి (కీర్తి సురేష్) ఉంటుంది. తన చెల్లెలు కంటతడి చూస్తే ఎంతకైనా తెగించే పెద్దన్నకు కనక మహాలక్ష్మీ పెద్ద షాక్ ఇస్తుంది. పెళ్లికి కొద్ది గంటల ముందు ప్రియుడితో కలకత్తాకు పారిపోవడంతో పెద్దన్న దిగ్బ్రాంతికి గురవుతాడు. కలకత్తాకు వెళ్లిన కనకం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది.

    చెల్లెలి కోసం పోరాటం

    చెల్లెలి కోసం పోరాటం

    తనను ప్రాణంగా ప్రేమించే పెద్దన్న నిర్ణయాన్ని కనక మహాలక్ష్మీ ఎందుకు వ్యతిరేకించింది? ఇంటి నుంచి పారిపోయిన కనక మహాలక్ష్మీ భర్త ఎందుకు జైలుకు వెళ్లాడు? కష్టాల్లో ఉన్న తన చెల్లెలికి పెద్దన్న ఎలా అండగా నిలిచాడు. పెద్దన్న జీవితంలో లాయర్ (నయనతార) ఎలా భాగమైంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ పాత్రలు ఏమిటి? తన చెల్లెల్ని కష్టాల నుంచి ఎలా గట్టెక్కించాడు అనే ప్రశ్నలకు సమాధానమే పెద్దన్న సినిమా కథ.

    పెద్దన్న ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    పెద్దన్న ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    పెద్దన్న చిత్రం పక్కగా రజినీకాంత్‌కు ఇమేజ్‌కు, క్రేజ్‌కు సరితూగే విధంగా రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కించారు. తొలి భాగం విషయానికి వస్తే.. అభిమానులకు ఫుల్ మీల్స్ మాదిరిగా స్టయిల్స్, పాటలు, రజనీ మార్క్ డైలాగులతో సాగిపోతుంది. చెల్లెలి కోసం పెళ్లి చూపులు తతంగంలో కుష్బూ, మీనా పాత్రలతో అలా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. మీనా, కుష్బూలకు పాత్రలను బలంగా డిజైన్ చేయలేకపోవడం వల్ల వారి నామమాత్రంగానే కాకుండా ఎక్స్‌ట్రా ఆర్టిస్టుల సీన్లలో కనిపిస్తారు. ఇక నయనతారతో సున్నితమైన రొమాన్స్, లవ్ ట్రాక్ కాలక్షేపంగా కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్‌తో ఫైట్ సీన్ చాలా భావోద్వేగంగా ఉంటుంది. తొలి భాగానికి ఆ ఎమోషనల్ సీన్ హైలెట్ అనిపిస్తుంది. అయితే కథలో బలమైన ఎమోషన్స్ పలికించడానికి అవకాశం ఉన్న ఆ కోణంలో కసరత్తు జరగలేదనే అభిప్రాయం కలుగుతుంది. చెల్లెలు పెళ్లికి ముందు ఇంటి నుంచి పారిపోవడమనే ట్విస్టు గురించి పెద్దగా థ్రిల్ అయ్యేంతగా లేకపోవడం మరింత చప్పగా సాగుతుంది. కోల్‌కతా పబ్ ఫైట్ రజనీ మార్కును మరోసారి గుర్తు చేస్తుంది. ఒక చిన్న బిల్డప్ షాట్‌తో సాదాసీదా ఇంటర్వెల్ బ్యాంగ్‌ వేసి ఫస్టాఫ్ భారంగా ముగించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.

    పెద్దన్న సెకండాఫ్ ఇలా..

    పెద్దన్న సెకండాఫ్ ఇలా..

    ఇక సెకండాఫ్‌లో కథను పెద్దగా ఊహించుకోకుండానే చెల్లెలి సెంటిమెంట్‌ను సాగదీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తారు. పక్కా రొటీన్ సీన్లు, , ఎన్నో సినిమాల్లో చూసిన చెల్లెలి సెంటిమెంట్ ఎపిసోడ్స్‌ కనిపిస్తాయి. సినిమా ముగుస్తుందని భావించే క్రమంలో విలన్‌గా అభిమన్యు, అతడి అన్న పాత్రలో జగపతి బాబు క్యారెక్టర్లు ఎంట్రీ ఇవ్వడంతో కథను మరింత సాగతీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా రొటీన్ ఫైట్లు, స్క్రీన్ ప్లేతో ముగింపు పలికి సినిమాకు శుభం కార్డు పడేయడం కనిపిస్తుంది. ఎలాంటి కొత్తదనం, సరికొత్తగా రజినీని చూడాలనుకొనే వారికి మాత్రం తీవ్రమైన నిరాశే మిగులుతుంది.

    దర్శకుడు శివ అత్యంత పేలవంగా

    దర్శకుడు శివ అత్యంత పేలవంగా


    దర్శకుడు శివ రాసుకొన్న కథ, కథనాలు అత్యంత పేలవంగా ఉన్నాయి. జనరేషన్ మారుతున్న పాతకాలం నాటి కథను, అతుకుల బొంతగా మార్చేసి పెద్దన్నగా చూపించే ప్రయత్నం చేశారు. 80 నాటి స్క్రీన్ ప్లే, సన్నివేశాలతో పరమ బోరుగా సినిమాను తెరకెక్కించారు. క్యారెక్టర్లపరంగా కూడా ఎక్కడ కొత్తదనం కనిపించదు. శివ ప్రతిభ చాలా నాసిరకంగా, రెగ్యులర్, రొటీన్‌గా ఉందని చెప్పవచ్చు

    రజనీకాంత్ రొటీన్ స్టైల్స్‌తో

    రజనీకాంత్ రొటీన్ స్టైల్స్‌తో

    గత పదేళ్లలో చూసిన రజనీస్టైల్స్ అన్నింటిని మరోసారి పెద్దన్న సినిమాలో చూడటానికి అవకాశం ఏర్పడింది. రజనీ ఫెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆయన సూపర్ స్టార్ ఇమేజ్‌ను అలానే కొనసాగించేలా డిజైన్ చేసిన పాత్రలో ఒదిగిపోయాడు. ఎలాంటి వైవిధ్యం లేని రోల్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. రొటీన్‌గా పాటలు, ఫైట్స్, డైలాగ్స్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

    నయనతార, కీర్తీ సురేష్ పాత్రల గురించి

    నయనతార, కీర్తీ సురేష్ పాత్రల గురించి


    కనక మహాలక్ష్మీగా కీర్తీ సురేష్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడమే కాకుండా వందశాతం న్యాయం చేశారు. భారమైన పాత్రను తన అభినయంతో నిలబెట్టారని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కీర్తీ సురేష్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించారని చెప్పవచ్చు. ఇక నయనతార విషయానికి వస్తే కథతోపాటు ట్రావెల్ అయ్యే పాత్ర. రజనీకాంత్‌కు రోల్‌కు సపోర్టివ్‌గా అలా సాగిపోతుంది. కథకు బలం చేకూర్చే రోల్ లభించకపోవడంతో పెద్దగా ఆమె ఏమీ చేయలేకపోయింది. కుష్బూ, మీనాది కూడా అదే పరిస్థితి. రజనీ సినిమాలో కనిపించాలనే ఒక్క కారణమే వాళ్లు నటించడానికి కారణమైందా అనే అనుమానం కలుగుతుంది.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే..

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే..

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. వెట్రీ సినిమాటోగ్రఫి బాగుంది. కోల్‌కతాలో ఎమోషనల్ సీన్లను, యాక్షన్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. డి ఇమామ్ మ్యూజిక్ రొటిన్‌గా ఉంది. రజనీ అభిమానులకు కిక్కు ఎక్కించే విధంగా లేకపోవడం నిరాశ కలిగించే అంశం. రెబెన్ ఎడిటింగ్‌ బాగాలేదు. సినిమా నిడివి కూడా అవసరమైన దాని కంటే ఎక్కువగానే ఉంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్ వరకు సీన్లు సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి.

    Recommended Video

    Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
    ఫైనల్‌గా ఇలా..

    ఫైనల్‌గా ఇలా..

    రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు చెల్లిలి సెంటిమెంట్‌ను జోడించి రూపొందించిన చిత్రం పెద్దన్న. అయితే సరిగా పండని పాత్రలు, పేలవమైన కథ, కథనాలు సినిమాను మరింత నాసిరకంగా మార్చాయి. సరైన విలనిజం లేకపోవడం, ఒక్కో స్టేజ్‌లో ప్రకాశ్ రాజ్‌ను, అభిమన్యు సింగ్, జగపతి బాబు విలన్లుగా చూపించిన విధానం ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఓవరాల్‌గా సినిమా యావరేజ్‌గా కూడా మారలేకపోయింది. అభిమానులకు మాత్రం నచ్చే విధంగా ఈ సినిమా రూపొందింది. ఎలాంటి అంచనాలు లేకుండా కాలక్షేపం కోసం ఈ సినిమాను చూడమని రికమెండ్ చేయవచ్చు.

    ట్యాగ్ లైన్: పేరుకే పెద్దన్న

    English summary
    Annaatthe (Peddana) is action drama film written and directed by Siva and produced by Kalanithi Maran under the banner of Sun Pictures. The film stars Rajinikanth, Meena, Khushbu, Nayanthara and Keerthy Suresh. While Jagapathi Babu, Prakash Raj, Vela Ramamoorthy, and Soori play prominent supporting roles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X