twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Avengers: Endgame Movie Review || అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ రివ్యూ || Filmibeat Telugu

    Rating:
    3.5/5
    Star Cast: రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రుఫాలో, క్రిస్ హెమ్స్‌వర్త్, స్కార్లెట్ జాన్సన్
    Director: ఆంథోని రుసో, జో రుసో

    మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన చిత్రాలు ప్రపంచ సినీ అభిమానులను గొప్ప అనుభూతికి గురిచేశాయి. ఆ క్రమంలోనే మళ్లీ అవెంజర్స్: ఎండ్‌గేమ్ మరోసారి మార్వెల్‌ అభిమానుల్లో జోష్ పెంచడానికి ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం, రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిట్టచివరి, 22వ మార్వెల్ మూవీ... అవెంజర్స్: ఎండ్ గేమ్ అభిమానులకు ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ ఏమిటో తెలుసుకోవాల్సిందే.

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ స్టోరి

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ స్టోరి

    విశ్వాన్ని సర్వనాశనం చేసి తన ఆధీనంలో ఉండే కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు థానోస్ (జోష్ బ్రోలిన్) ప్రయత్నాలు చేస్తుంటాడు. థానోస్‌ను ఎదుర్కొనేందుకు చేసిన పోరాటంలో కొంత మంది (సర్వైవర్స్) బతికి బయటపడుతారు. అలా బయటపడిన ఐరన్ మ్యాన్ (రాబర్ట్ డౌనీ), కెప్టెన్ అమెరికా (క్రిస్ ఇవాన్స్), హల్క్ (మార్క్ రుఫాలో), థోర్ (క్రిస్ హెమ్స్‌వర్త్), కెప్టెన్ మార్వెల్ (బ్రి లార్సన్), నెబ్యులా (కరెన్ గిలాన్) లాంటి వారు మిగితా అవెంజర్స్‌ను కూడగడుతారు. థానోస్‌ను ఎదురించాలంటే అతడిని శక్తిని హరించే ఆరు రత్నాలు సంపాదించాలని ప్లాన్ వేస్తారు.

    అవెంజర్స్: ఎండ్‌గేమ్‌లో మలుపులు

    అవెంజర్స్: ఎండ్‌గేమ్‌లో మలుపులు

    సర్వైవర్స్ మిగితా అవెంజర్స్‌ను ఎలా కూడగట్టారు? రత్నాలను సంపాదించడానికి ఏమి చేశారు. థానోస్‌ను ఎదురించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు. చివరకు రత్నాలు అవెంజర్స్ చేతికి చిక్కాయా? థానోస్‌‌ను ఎలా అంతమొందించారు అనే ప్రశ్నలకు సమాధానమే అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా కథ.

    తొలిభాగం కాస్త నెమ్మదిగా..

    తొలిభాగం కాస్త నెమ్మదిగా..

    తొలి భాగంలో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, కెప్టెన్ మార్వెల్, నెబ్యులా లాంటి పాత్రలను, మిగితా అవెంజర్స్ పాత్రలను పరిచయం చేయడం కోసం ఎక్కువ సమయాన్ని తీసుకొన్నారనిపిస్తుంది. అలాగే కథ పూర్తిగా నెమ్మదించడం, డైలాగ్ పార్ట్ ఎక్కువగా ఉండటం కొంత అసహనానికి గురిచేస్తుంది. తొలిభాగం ముగింపులో థానోస్ ఫాత్ర ఎంటర్ అవ్వడంతో కథ కొంత వేగం పుంజుకొంటుంది.

    సెకండాఫ్‌లో పుంజుకొన్న జోష్

    సెకండాఫ్‌లో పుంజుకొన్న జోష్

    ఇక రెండో భాగంలో టైమ్ మిషన్ ఎపిసోడ్స్ ఆకట్టుకొనేలా చిత్రీకరించారు. అందుకోసం ఉపయోగించిన గ్రాఫిక్స్ తెరమీద మ్యాజిక్‌గా అనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి థానోస్ విజృంభణ పెరిగిపోవడంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. థానోస్‌కు వ్యతిరేకంగా ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, కెప్టెన్ మార్వెల్, నెబ్యులా పోరాటాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇక చివర్లో అవెంజర్స్ మధ్య చోటుచేసుకొనే సన్నివేశాలు చాలా భావోద్వేగానికి గురిచేస్తాయి. చక్కటి ఎమోషనల్ నోట్‌తో చిట్టచివరి మార్వెల్ సినిమాను ముగించడం జరుగుతుంది.

    దర్శకత్వం, స్క్రీన్ ప్లే గురించి

    దర్శకత్వం, స్క్రీన్ ప్లే గురించి

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రానికి ఆంథోని రుసో, జో రుసో దర్శకులు. క్రిస్టఫర్ మార్కస్, స్టెఫాన్ మెక్‌ఫీలీ అందించిన స్క్రీన్ ప్లేను దర్శకులు చక్కగా హ్యాండిల్ చేశారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు జరిగే కథ, సన్నివేశాలు సినిమాకు హైలెట్‌ అనిచెప్పవచ్చు. సినిమాను భావోద్వేగంగా మార్చడానికి రాసుకొన్న సన్నివేశాలు మూవీకి బలంగా మారాయి. మార్వెల్ సీక్వెల్స్‌లో ఎండ్ గేమ్‌ను అద్బుతంగా మలచడానికి శాయశక్తులా ప్రయత్నించారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    నటీనటులు ప్రతిభ

    నటీనటులు ప్రతిభ

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమాకు ఐరన్ మ్యాన్, కెప్టెన్ మార్వెల్, హల్క్, థోర్ పాత్రలు వెన్నుముకగా నిలిచాయి. హల్క్, థోర్ పాత్రలు హస్యాన్ని పండిస్తే.. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, మార్వెల్ పాత్రలను సినిమాను ఎమోషనల్‌గా మార్చాయి. నెబ్యూలా పాత్ర కూడా సెంటిమెంట్‌ను పండించింది. ప్రతీ అవెంజర్‌ పాత్ర సినిమాకు కీలకంగా కావడంతో అన్ని రోల్స్ కూడా ఆకట్టుకొనేలా ఉంటాయి. ప్రతీ క్యారెక్టర్ సినిమాను గొప్పగా మలిచేందుకు తమ ప్రతిభను తెరపైన చూపించారు.

    సినిమాటోగ్రఫి, మ్యూజిక్ గురించి

    సినిమాటోగ్రఫి, మ్యూజిక్ గురించి

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ అత్యంత ప్రధానంగా మారాయి. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడానికి యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలుగులో థానోస్ పాత్రకు రానా చెప్పించిన డబ్బింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ. థానోస్ పాత్రను సజీవంగా కనిపించేలా రానా డబ్బింగ్ ప్రాణం పోసిందని చెప్పవచ్చు. అక్కకడక్కడా కొన్ని డైలాగ్స్ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. పక్కా ట్రాన్సెలెటెడ్ వర్డ్స్ కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. సినిమా ఫ్లోకు బ్రేక్ వేసేలా ఉంటాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా మారింది.

    చివరగా

    చివరగా

    అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాను ప్రపంచ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలపడానికి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రెండో భాగంలో యాక్షన్ సీన్లు, ఉపయోగించిన టెక్నాలజీ మరో లెవెల్ అని చెప్పవచ్చు. గతంలో వచ్చిన మార్వెల్ సినిమాలు చూడని వారికి అవెంజర్స్: ఎండ్‌గేమ్ కొంత గందరగళంగా అనిపిస్తుంది. పాత్రల తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ.. అవెంజర్స్: ఎండ్‌గేమ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే చిత్రమని గ్యారెంటీగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి.

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రుఫాలో, క్రిస్ హెమ్స్‌వర్త్, స్కార్లెట్ జాన్సన్, పాల్ రుడ్, బ్రీ లార్సన్, జోష్ బ్రోలిన్ తదితరులు
    దర్శకత్వం: ఆంథోని రుసో, జో రుసో
    నిర్మాత: కెవిన్ ఫీజ్
    మ్యూజిక్: అలన్ సిల్వెస్త్రీ
    సినిమాటోగ్రఫి: ట్రెంట్ ఒపాలోచ్
    ఎడిటింగ్: జెఫరీ ఫోర్డ్
    బ్యానర్: మార్వెల్ స్టూడియో
    రిలీజ్ డేట్: 2019-04-22

    English summary
    Avengers: Endgame releases in Hindi, Tamil and Telugu, besides English. According to trade website Box Office India, Avengers: Endgame sold 500,000 tickets in a matter of hours, beating last year’s biggest Hindi opener Thugs of Hindostan that had sold 200,000 tickets. This movie released on April 26th. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X