»   » వెండితెరపై అద్భుతం (బాహుబలి2 మూవీ రివ్యూ)

వెండితెరపై అద్భుతం (బాహుబలి2 మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
4.0/5

భారతీయ సినిమా చరిత్రలో గత ఐదేళ్ల కాలంలో బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా గురించి జరిగిన చర్చ మరే చిత్రంపైనా జరుగలేదు. తెలుగు సినిమాగా ప్రారంభమై అంచెలంచెలుగా అంచనాలను పెంచుతూ భారతీయ సినిమాగా మారింది. ఆ నేపథ్యంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ అనూహ్య విజయం సాధించింది. బాహుబలి1 చిత్రం మిగిల్చిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే పశ్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను వెంటాడింది. ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

బాహుబలి-1లో ఏం జరిగింది.... (Recap)


కథ సంక్షిప్తంగా..

కథ సంక్షిప్తంగా..

కాలకేయ దేశవాసులతో యుద్ధంతోపాటు అనేక విపత్కర పరిస్థితిలో ముందుండి నడిపించిన అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ను రాజమాత శివగామి దేవి (రమ్యక‌ష్ణ) మహిష్మతీ సామ్రాజ్యానికి పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించుకొంటుంది. పట్టాభిషేకానికి ముందు ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి దేశాటన చేయాలని బాహుబలిని రాజమాత కోరుతుంది. ఈ నేపథ్యంలో కట్టప్ప తోడుగా బాహుబలి దేశాటనకు బయలుదేరుతాడు. ఆ సమయంలో కుంతల దేశ యువరాణి అయిన దేవకన్య (అనుష్క)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తన ప్రేమను దేవసేనకు వ్యక్తం చేస్తాడు. ఇద్దరు ఒక్కటి కావాలని నిశ్చయించుకొని శివగామి వద్దకు వెళ్తారు. అయితే బాహుబలి, దేవసేనకు శివగామికి మధ్య విభేదాలు చోటుచేసుకుంటాయి. కొన్ని పరిస్థితుల మధ్య బాహుబలి దంపతులపై అంతఃపుర బహిష్కర వేటు పడుతుంది.


ఈ ప్రశ్నలకు సమాధానం..

ఈ ప్రశ్నలకు సమాధానం..

బహిష్కార వేటు పడిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్పి వచ్చింది. అసలు కట్టప్ప ఎందుకు అంత దారుణానికి ఒడిగట్టాడు? మహిష్మతి సామ్రాజ్యంలో అమరేంద్ర బాహుబలిని చంపించే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఆ హత్య వెనుక ఎవరున్నారు? బాహుబలి కుమారుడు మహేంద్ర బాహుబలి తన తల్లి దేవసేనను భళ్లాలదేవ నుంచి ఎలా కాపాడుకున్నాడు? అనే పశ్నలకు సమాధానమే బాహుబలి ది కన్‌క్లూజన్.


విశ్లేషణః

విశ్లేషణః

బాహుబలి ది బిగినింగ్ ముగిసిన చోటు నుంచి బాహుబలి2 ప్రారంభమవుతుంది. బాహుబలి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలికి కట్టప్ప చెప్పడం ప్రారంభిస్తాడు. బాహుబలి3 ఫస్టాఫ్‌లో మహేంద్ర బాహుబలికి సంబంధించిన బిల్డప్ షాట్స్ అద్బుతంగా ఉంటాయి. శివగామి పూజకు బయలుదేరిన సమయంలో ఎదురైన ఆటంకాలను అడ్డుకునేకుందుకు బాహుబలి ఇచ్చిన ఎంట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే రేంజ్‌లో రాజమౌళి చిత్రీకరించాడు. సాహోరే బాహుబలి పాటలో బాహుబలి శక్తి, సామర్థ్యాలను కళ్లకు గట్టినట్టు చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కుంతల దేశ యువరాణి బాహుబలిని ఎవరు నువ్వు అని నిలదీసినప్పుడు బాహుబలి గురించి కట్టప్ప చెప్పే ఇంట్రడక్షన్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది.


ఇంటర్వెల్ హైలెట్

ఇంటర్వెల్ హైలెట్

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. అమరేంద్ర బాహుబలి సైన్యాధిపతిగా బాధ్యతలు తీసుకొనే సన్నివేశాలు నభూతో నభవిష్యత్‌గా రాజమౌళి చిత్రీకరించాడు. సన్నివేశాలకు ధీటుగా కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అమోఘం అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ప్రేక్షకుడు ఎలా చెప్పాలో తెలియక మాటలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.


పండిన సెంటిమెంట్

పండిన సెంటిమెంట్

సెకండాఫ్‌లో బాహుబలిపై బిజ్జాలదేవ (నాజర్), భళ్లాల దేవ (రానా దగ్గుబాటి) దుష్ఠపన్నాగాలు, చెప్పుడు మాటలతో శివగామి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటి అంశాలను చక్కటి స్క్రీన్ ప్లే తో దర్శకుడు పరుగులు పెట్టించాడు. దేవసేన శ్రీమంతం సీన్ మరో కీలకమైన అంశం. పుట్టబోయే బిడ్డను తొలిసారి తాతయ్యగా నీవు తీసుకొంటావా అని కట్టప్పను దేవసేన అడగడం సెంటిమెంట్‌ బాగా పండించింది.


ఉద్వేగంగా సెకండాఫ్..

ఉద్వేగంగా సెకండాఫ్..

తాను చేసిన పాపాలను శివగామి తెలుసుకొని దేవసేన, బాహుబలి కుమారుడు (మహేంద్ర బాహుబలి)ని మహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించడం సినిమాకు మరో హైలెట్. తన తండ్రి, తల్లికి జరిగిన అన్యాయానికి భళ్లాల దేవపై మహేంద్ర బాహుబలి ప్రతీకారం తీర్చుకోవడం, వారి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. మొత్తంగా బాహుబలి2 కథ ప్రారంభమైన దగ్గరి నుంచి చివరి వరకు ప్రతీ సన్నివేశాన్ని ఆసక్తి కలిగించే విధంగా జక్కన చెక్కిన తీరు అభినందనీయం.


ప్రభాస్ వన్ మ్యాన్ షో..

ప్రభాస్ వన్ మ్యాన్ షో..

అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) గా రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్ నటించిన తీరు అమోఘం. తల్లి ప్రేమకు, ప్రియురాలు దేవసేనకు మధ్య నలిగిన బాహుబలి పాత్రను ప్రభాస్ అవలీలగా పోషించాడు. అద్భుతమైన భావాలను పలికించాడు. ఇక భళ్లాలదేవ కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవడం, కట్టప్పతో సన్నిహితంగా ఉండే సన్నివేశాలలో ప్రభాస్ పరిణితి చెందిన నటనను ప్రదర్శించాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో ప్రభాస్ తన రేంజ్ ఏంటో ప్రేక్షకులకు చూపించాడు. కుంతల దేశంలో శత్రువులతో యుద్ధ పోరాటాలు, భళ్లాలదేవ సైన్యంతో పోరాడే సన్నివేశాలలో ఫర్ఫెక్షన్ కనిపించాడు. టోటల్‌గా రాజమౌళి తర్వాత వన్ మ్యాన్ షో ప్రభాస్‌దే అని చెప్పవచ్చు.


జేజెమ్మను మించిన దేవసేన

జేజెమ్మను మించిన దేవసేన

దేవసేనగా అనుష్క ఇతర నటులకు దీటుగా నటించింది. శివగామిని ఎదురించే సన్నివేశాలలో ఫెర్ఫార్మెన్స్‌తో అనుష్క అదరగొట్టింది. కుంతల దేశ యువరాణిగా, బాహుబలి భార్య, భళ్లాల దేవ చెరలో బందీ అయిన ఖైదీగా డిఫరెంట్ వేరియేషన్స్ పలికించడంలో జేజెమ్మ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకొన్నది. క్లైమాక్స్‌లో యాగం చేసే సీన్, తర్వాత మహేంద్ర బాహుబలికి పట్టాభిషేకం సీన్లలో పాత్ర పరంగా హుందా తనాన్ని చూపించింది. భారమైన పాత్రలను పోషించడంలో తనకు తానే సాటి అని అనుష్క మరోసారి నిరూపించింది.


అహో భళ్లాలదేవ

అహో భళ్లాలదేవ

బాహుబలిలో మొత్తంలో భళ్లాలదేవ యాక్టింగ్ మరో హైలెట్. దుష్ఠబుద్ధి కలిగిన, అధికార దాహంతో చెలరేగే పాత్రలో రానా దగ్గుబాటి కనబరిచిన ప్రతిభ సింప్లీ సూపర్బ్. కీలక సన్నివేశాలలో గానీ, క్లైమాక్స్‌లో గానీ బాహుబలితో నువ్వా నేనా అనే విధంగా నటించాడు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన రానా తనలో అద్బుతమైన నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకొన్నాడు. పవర్ ఫుల్ విలనిజాన్ని పండించడానికి అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మంచి మార్కులు కొట్టేశాడు


రమ్యకృష్ణ టెర్రిఫిక్..

రమ్యకృష్ణ టెర్రిఫిక్..

ఇక శివగామి పాత్ర విషయానికి వస్తే రమ్యకృష్ణ టెర్రిఫిక్. కళ్లతో తెరమీద పలికించిన హావభావాలు మరొకరికి సాధ్యం కావు అనే రేంజ్‌లో ఉన్నాయి. శివగామి పాత్రలో మరెవరూ కనిపించినా రమ్యకృష్ణను తలదన్నే వారా అనే సందేహం తప్పకుండా కలుగుతుంది. హుందాతనం, రాజసం, రౌద్రం, ప్రేమ, వేదన, అహంకారం ఇలాంటి అంశాలు అన్ని కలిపిన శివగామి పాత్రను ఒంటిచెత్తో నిలబెట్టింది. అద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.


నాజర్ క్రూరంగా..

నాజర్ క్రూరంగా..

బాహుబలి2లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బిజ్జాలదేవ పాత్ర. ఈ పాత్రను నాజర్ ఎంతో ప్రభావవంతంగా పోషించాడు. ఈ పాత్రను పోషించడంలో ఏమాత్రం తడబడినా మిగితా పాత్రలు తేలిపోయే ప్రమాదం ఉండేది. కానీ సుదీర్ఘ అనుభవంతో నాజర్ బిజ్జాలదేవ పాత్రను లార్జర్ ద్యాన్ లైఫ్‌గా మార్చాడు. ఇలాంటి విలన్ పాత్రలు పోషించడం తనకు కొట్టిన పిండి అని చెప్పకనే చెప్పాడు.


వెన్నముకగా కట్టప్ప

వెన్నముకగా కట్టప్ప

ఈ సినిమాకు వెన్నముకగా మారిన కట్టప్ప పాత్ర. మహిష్మతీ సామ్రాజ్యంలో బానిసగా సత్యరాజ్ నటన ఫెంటాస్టిక్. తన పాత్రకు పెరిగిన ప్రజాదరణకు పదిరెట్ల ఫెర్ఫార్మెన్స్‌ను కనబరిచాడు. బాహుబలిని చంపాల్సిన సమయంలో కట్టప్ప పడిన మనోవేదన, ఆవేదన ప్రేక్షకుడిని కంటతడి పెట్టించకమానదు. ఓ రకమైన ఉద్వేగానికి గురిచేస్తుంది. మహేంద్ర బాహుబలిని రాజ సింహాసనంపై కూర్చోబెట్టడానికి అనుసరించిన ప్రయాణంలో సత్యరాజ్ నటన సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.


రాజమౌళి తపన..

రాజమౌళి తపన..

ఈ సినిమాకు కర్త, క్రియ, కర్మ దర్శకుడు రాజమౌళి. ప్రతీ సన్నివేశంలోనూ అతడి సృజనాత్మకత అనిర్వచనీయం. అతడి ఊహాశక్తి, ప్రతీ సన్నివేశంలోనూ వైవిధ్యం ఆయన తపనకు అద్దం పట్టింది. బాహుబలిని తెరకెక్కించడానికి, అందమైన దృశ్యకావ్యంగా మలచడానికి ఆయన పడిన శ్రమ ప్రతీ ఫ్రేంలో కనిపిస్తుంది. పాత్రలను మలిచిన తీరు, కథను సంపూర్ణంగా మలుచడంలో అనుసరించిన విధానం ఆకట్టుకొంటాయి. ఇక అనేక కోణాలు కథ, వైవిధ్యంతో కూడిన పాత్రలను మేలవించి కథనాన్ని నడిపించిన తీరు అమోఘం. బాహుబలిని ఓ తెలుగు సినిమాగా ప్రారంభించి గ్లోబల్ సినిమాగా మార్చిన నిజమైన బాహుబలి కేవలం రాజమౌళి మాత్రమే. మొత్తంగా చెప్పుకోవాల్సి వస్తే తెలుగు జాతి గర్వించేదగ్గ సినిమాను తీశాడని చెప్పవచ్చు.


కీరవాణి మ్యాజిక్..

కీరవాణి మ్యాజిక్..

కథ, కథనం, ఫొటోగ్రఫీ, ఫైట్స్, సౌండ్ తదితర అంశాలు ఒకెత్తు అయితే బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరో ఎత్తు. ప్రతీ సన్నివేశంలో ప్రేక్షకుడు లీనం కావడానికి, ఉద్వేగానికి గురి అయ్యే నేపథ్య సంగీతాన్ని ఇవ్వడంలో కీరవాణి సంగీత రుషిలా కనిపించాడు. నిరంతర తపస్సుగా భావించి ప్రభాస్ బిల్డప్ షాట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు, బాహుబలి హత్య ఇలాంటి కీలక సీన్లలో కీరవాణి అందించిన సన్నివేశం ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని కలిగించిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. పాటల్లో సాహో రే బాహుబలి, దండాలయ్యా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. మిగితా పాటలు ఒకేగా ఉన్నాయి.


సెంథిల్ పనితరు..

సెంథిల్ పనితరు..

ఈ సినిమాను ఆద్యంతం జనరంజకంగా, కంటికి ఇంపుగా తెరకెక్కించిన మహాయోగి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చెక్కిన అపురూపమైన శిల్పి ఆయన. పాటలైనా, ఫైట్స్ అయినా, సెంటిమెంట్ సీన్లయినా ఎక్కడ ఓ చిన్నపాటి తప్పు దొరకకుండా బాహుబలిని దృశ్యకావ్యంగా మలిచాడు.


చివరగా..

చివరగా..

ఎందరో సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో ప్రతిభావంతులు టీమ్ వర్క్‌గా చేసిన సినిమా బాహుబలి. ఈ చిత్రం భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించే సినిమా. కలెక్షన్ల రికార్డుల మోత మోగిస్తూ చరిత్ర సృష్టించే సినిమా. ఇలాంటి సినిమాలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కువగా మంచి అంశాలు ఉన్నప్పుడు కొన్ని లోపాలు మరుగునపడిపోతాయి. వాటిని ఎవరూ పట్టించుకొవాల్సిన అవసరం లేదు. అలా చేస్తే కోడిగుడ్డుకు ఈకలు పీకడం లాంటిదే అవుతుంది. మంచి భోజనం తినేటప్పుడు కరివే పాకుల్లాంటి అడ్డుతగులుతుంటాయి. వాటి వల్ల ఇబ్బంది కొద్ది క్షణాలే. కానీ మంచి భోజనం ఫీలింగ్ రుచి ఎక్కువ సేపు వెంటాడుతుంటుంది. అలాంటిదే అనుభూతే బాహుబలి సిరీస్. కన్నురెప్పలు మూసినా, తెరిసినా వెంటాడే సినిమా బాహుబలి.


నామమాత్రంగానే అవంతిక పాత్ర..

నామమాత్రంగానే అవంతిక పాత్ర..

బాహుబలి తొలిభాగంలో అవంతిక పాత్ర ప్రధాన్యం ఎక్కువే. అవంతిక పాత్ర ఆధారంగా కథ నడుస్తుంది. ఈ పాత్రలో తమన్నా భాటియా కనిపించింది. అయితే అవంతిక పాత్రకు బాహుబలి రెండో భాగంలో అంతగా పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే సీన్లు ఉంటాయి. కనిపించని సీన్లలో కూడా ఆమెను వెతుక్కొనే పరిస్థితే ప్రేక్షకుడి కనిపించింది. అలాంటి పాత్రలో తమన్నా తన నటను ప్రదర్శించడానికి అవకాశమే రాలేదు. బాహుబలి2లో అవంతిక పాత్ర కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది.


తెరవెనుక, తెరముందు

తెరవెనుక, తెరముందు

ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, రానా దగ్గుబాటి, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు
సంగీతంః కీరవాణి
కెమెరాః సెంథిల్ కుమార్
ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వర్ రావు.
నిర్మాతలుః శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
కథ, స్క్రీన్ ప్లేః ఎస్ఎస్ రాజమౌళి
రిలీజ్ః 28 ఏప్రిల్ 2017
నిడివిః 171 నిమిషాలు


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్ః
కథ, కథనం, డైరెక్షన్
సంగీతం
ఫొటోగ్రఫీ
ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ యాక్టింగ్
ఇంకా చాలా ఉన్నాయి.


మైనస్ పాయింట్స్


సాహోరే బాహుబలి, దండలయ్యా మినహాయించి మిగితా పాటలు
చిత్ర నిడివి కాస్తా ఎక్కువ కావడం
నేలా విడిచి సాము చేసినట్టు ఫైట్స్
(ఇవన్నీ చాలా చిన్న లోపాలే)English summary
Baahubali 2 is Visual treat made by director Rajamouli, Prabhas extraordinary performance definitely lives up to the expectations of the fans, and the movie will put Indian Cinema on global map. The stunts, the spectacle, and the performances are super. Visual effects, settings made movie grandier.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu