Baahubali: The Beginning Review: బాహుబలి: ది బిగినింగ్ రివ్యూ

నటీనటులు: ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
సినిమాటోగ్రఫి: సెంథిల్ కుమార్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: కీరవాణి
రిలీజ్ డేట్: 2015-07-10

శివుడు (ప్రభాస్) అటవీ ప్రాంతంలోని గిరిజన కుటుంబానికి చెందిన వాడు. ఆ ప్రాంతంలో గెరిల్లా యుద్దం చేసే అవంతిక (తమన్నా భాటియా)తో ప్రేమలో పడుతాడు. మహిష్మతి సామ్రాజ్యంలో బందీగా ఉన్న దేవసేన (అనుష్కశెట్టి)ని విడిపించేందుకు ఆ దేశాధిపతి భల్లాలదేవుడు (రానా దగ్గుబాటి)కి వ్యతిరేకంగా అవంతిక పోరాటం చేస్తుంటుంది. అయితే అవంతిక కోసం దేవసేన (అనుష్క శెట్టి)ను విడిపించే బాధ్యతను శివుడు భుజాన వేసుకొంటాడు. అయితే మహిష్మతి సామ్రాజ్యానికి వెళ్లిన శివుడిని చూసి ఆ ప్రాంతం వాళ్లు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) తమ కోసమే మరో రూపంలో వచ్చాడని అనుకొంటారు.

Baahubali  The Beginning Review

భల్లాల దేవుడికి వ్యతిరేకంగా అవంతిక ఎందుకు పోరాటం చేస్తుంది? మహిష్మతి సామ్రాజ్యంలో దేవసేనను భళ్లాల దేవుడు ఎందుకు బందీగా ఉంచాడు? భళ్లాల దేవుడిపై అవంతిక ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించింది? అసలు శివుడు ఎవరు? శివుడిని చూసి మహిష్మతి ప్రజలు దేవుడిగా ఎందుకు చూశారు? మహేంద్ర బాహుబలి అయిన శివుడు గిరిజన ప్రాంతంలో ఎందుకు పెరిగాడు? మహిష్మతి సామ్రాజ్యంలో అమరేంద్ర బాహుబలి ఎవరు? అతడిపై శివగామి, బిజ్జాల దేవుడు ఎందుకు కుట్ర చేశారు. అమరేంద్రకు నమ్మకస్తుడైన కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచి చంపాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బాహుబలి 1 సినిమా కథ.

శివగామి ఓ పిల్లాడిని తలపై మోస్తూ ఓ నదిని దాటే సన్నివేశంతో సినిమా ఆసక్తిగా పెరుగుతుంది. ఆ తర్వాత శివుడు ఎంట్రీ, శివలింగాన్ని మోసే టెర్రిఫిక్ అండ్ ఐకానిక్ సీన్‌తో ప్రభాస్ ఎలివేషన్ అదిరిపోయేలా ఉంటుంది. ఇక అవంతికతో ప్రేమ వ్యవహారం, అలాగే అవంతికి గెరిల్లా యుద్ధం లాంటి సన్నివేశాలు ఆసక్తికరంగా కొత్త అనుభూతిని పంచుతూ కథ సాఫీగా సాగిపోతుంది. అయితే కథను వివరించి చెప్పే క్రమంలో, అలాగే రెండో భాగం కోసం కథను దాచి పెట్టడం వల్ల నిడివి కాస్త సాగదీసినట్టు ఉండటం మైనస్‌గా అనిపిస్తుంది. అయితే కానీ కథ, కథనాలు కొత్తగా ఉండటం, ఈ జోనర్ నేటితరం ప్రేక్షకులకు కొత్తగా ఉండటం ఓ డిఫరెంట్ ఫీల్‌ను అందిస్తుంది. అలాగే క్లైమాక్స్‌లో తాను ప్రాణానికి ప్రాణంగా చూసుకొనే అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ క్లైమాక్స్‌గా నిలవడం తెలిసిందే. కట్టప్ప ఎందుకు చంపాడు అనే డైలాగ్స్ ప్రధాని మోదీతో సహా దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. రెండో భాగం గురించి ఎదురు చూసేలా చేయడం తెలిసిందే.

శివుడిగా, మహేంద్ర బాహుబలిగా, అమరేంద్ర బాహుబలిగా మూడు పాత్రల్లో ప్రభాస్ అద్బుతంగా నటించడమే కాకుండా వీర రసాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించాడు. ఇక రానా, ప్రభాస్ పోటీ పడి నటించాడు. శివగామిగా రమ్యకృష్ణ, బిజ్లాల దేవుడిగా నాజర్, కట్టప్పగా సత్యరాజ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక అవంతికగా గ్లామర్ మాత్రమే పంచకుండా యాక్షన్ సీన్లలో మెప్పించింది. ఇక దేవసేనగా ఈ సినిమా కథలో కీలకంగా నిలిచింది. ఇతర పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

అప్పటి వరకు హిట్ డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైన ఎస్ఎస్ రాజమౌళి.. పాన్ ఇండియా స్థాయిలో బాహుబలిని డిజైన్ చేసి సరికొత్త ప్రయోగానికి, కనివీని ఎరుగని టెక్నాలజీతో భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడి సృష్టించారు. మహిహ్మతి సామ్రాజ్యాన్ని సృష్టించి.. అందులో డిజైన్ చేసిన క్యారెక్టర్లు సాధారణ ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకొనేలా చేశాయి. ఈ సినిమా కథ, డైలాగ్స్ అన్నీ అద్బుతంగా ప్రేక్షకుల నోట మార్మోగాయి. సెంథిల్ సినిమాటోగ్రఫి, కోటగిరి ఎడిటింగ్, కీరవాణి బీజీఎం, పాటలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అదిరిపోయేలా అనుసరించడం శోభు, ప్రసాద్ కమిట్‌మెంట్‌ను తెలియజేసింది. ఈ సినిమా రిలీజై మిక్స్‌డ్ టాక్‌తో రికార్డు వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ రానున్న నేపథ్యంలో మరోసారి ఈ సినిమా గొప్పతనాన్ని గుర్తు చేసేందుకు ఈ రివ్యూను క్లుప్తంగా అందించే ప్రయత్నం ఫిల్మీబీట్ చేసింది.

More from Filmibeat

Read more about: prabhas ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X