»   » పెయిన్ ('లయన్' రివ్యూ)

పెయిన్ ('లయన్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

అప్ప్టట్లో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు...ఇప్ప్టట్లో సింహా,లెజండ్ వచ్చిన తర్వాత బాలకృష్ణ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ పాత్రలను దాటగలిగేలా తీయగలిగితేనే చూసే వారికి ఆసక్తికరంగా ఉండి బాగుందనిపించి హిట్ కొట్టగలం. అలాగని అవే పాత్రలను రిపీట్ చేస్తే రొటీన్ అవుతుంది. అంతకు మించి పవర్ ఫుల్,ఎమోషన్ కలిగి ఉంటే విధంగా తీర్చిదిద్దాలి. అది నిజంగా పెద్ద సవాలే. ఆ సవాల్ ని కొత్త దర్శకుడు సత్యదేవ్...అందుకోలేకపోయారనిపించింది. ఆ ఇమేజ్ కు సరపడ కథ,కథనం చేయలేకపోయారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటే నాలుగు పంచ్ డైలాగులు, రెండు భారీ సీక్వెన్స్ల్ లు, మాస్ పాటలు అనుకున్నట్లు తీర్చిదిద్దారు. అంతేకాని బలమైన పాత్ర... దానిచుట్టూ అల్లే కుటుంబాలను కదిలించే కథ.. దాన్ని ఆసక్తికరంగా చెప్పే కథనం ఉండాలి అనే విషయం గమనించలేదు. ఎంత అభిమానులైనా రెండు గంటలకు పైగా కూర్చుని, డబ్బు ఖర్చు పెట్టి చూడాలి కదా... ఎందుకనో దర్శకుడు రొటిన్ పాయింట్ ని ఎన్నుకుని దాన్ని స్క్రీన్ ప్లే లోనూ తడబడి...చాలా నీరసంగా తెరకెక్కించాడు. అప్పటికీ ‘‘ కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనపడుతుంది, నేను కొడితే..హిస్టరీలో వినబడుతుంది '' అంటూ అక్కడక్కడా ట్రై చేసాడు. ఆ డైలాగులు కూడా చాలా చోట్ల...అరుపులు క్రిందే అనిపించాయి...సిబిఐ క్యారెక్టర్ తగ్గ ..మాడ్యులేషన్ పట్టించుకోలేదు. ముఖ్యంగా సినిమా చూస్తూంటే..గతంలో బాలయ్యే చేసిన విజియేంద్ర వర్మ సినిమానే గుర్తుకు రావటం దురదృష్టమే.


కథేమిటంటే....


ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు . ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.


గతంలో తమిళంలో...భరత్ హీరోగా వచ్చిన 555 చిత్రం ఎత్తుగడను గుర్తు చేసే ఈ చిత్రం ప్రారంభం ...ఎత్తుగడ దాకానే బాగుంటుంది. అయితే దాన్ని సాగతీయటంతో ఆ ఎత్తుగడ కూడా విసుగిస్తుంది. ముఖ్యంగా ఎక్కడో గంట తర్వాత ఇంటర్వెల్ కు వచ్చే ట్విస్ట్ కోసం ఫస్టాఫ్ మొత్తం ఏమీ జరగకుండా కథను, విలన్ ను దాచిపెట్టి...పదే పదే సీన్స్ రిపీట్ చేస్తూ పోతే ఏం జరుగుతుంది...చూసేవాడిలో సహనం నశిస్తుంది. అప్పుడు ఎంత మంచి స్టోరీ లైన్ అయినా విసుగొస్తుంది. అదే లయిన్ కి జరిగింది.


ఫస్టాఫ్ లో కథ చెప్పకుండా దాచి..... ఇంటర్వెల్ లో ట్విస్ట్ పేల్చారు. సెకండాఫ్ దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా.. ఇంటర్వెల్ లో వచ్చిన ఆ ట్విస్ట్ వెనక అసలు కథేంటి అనే ఫ్లాష్ బ్యాక్ చెప్పటమే సరిపోయింది. దాంతో ఇక హీరో చెయ్యటానికి ఏమీ మిగలలేదు...కేవలం ఫ్లాష్ బ్యాక్ చూడటానికే సినిమాకు వెళ్లం కదా...ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన విలన్స్ లేదా సమస్యకు ఏ విధంగా బుద్ది చెప్పటం లేదా పరిష్కారం చూపుతాడు అనేది ఆసక్తికరంగా ఉంటే చూడటానికి వెళ్తాం. అలాంటిది ఎందుకనో తనే స్క్రీన్ ప్లే సమకూర్చుకున్న దర్శకుడు ఈ బేసిక్ విషయం మర్చిపోయాడు. దాంతో తెరపై జరిగే దానిపై ఆసక్తిపోయింది. ఎంతసేపు...హీరో సమస్యలో పడటం..ఆ సమస్య లో ఇరుక్కుని భాధపడటం...దాని నుంచి బయిటపడలేకపోవటం ఇదే అంటే విసుగే కదా.


మిగతా రివ్యూ స్లైడ్ షోలో...


మళయాళం మూసలో

మళయాళం మూసలో


ముఖ్యమంత్రి మర్డర్... ఆ మిస్టరీని ఛేథిస్తూ...ఓ సీబిఐ ఆఫీసర్ కథ వంటివి మళయాళంలో సురేష్ గోపి చేసేవాడు. అయితే అక్కడ ఆడియన్స్ వేరు. కథను కథగా చెప్తే చాలు..ఇన్విస్టిగేషన్ ని హైలెట్ చేస్తే ఎంజాయ్ చేస్తారు. అదే మన దగ్గరకు వచ్చే సరికి...బాలకృష్ణ చేస్తే అందుకు సర్వ హంగులూ అవసరమే...అక్కడే డైలమోలో ఉండిపోయాడు డైరక్టర్ అనిపించింది.రొమాన్స్ కు నో ఛాన్స్

రొమాన్స్ కు నో ఛాన్స్


పేరుకు ఇద్దరు హీరోయిన్స్ ...త్రిష, రాధికా ఆప్టే. అయితే రొమాంటిక్ ఏంగిల్ మాత్రం కథలో కరువయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో అసలు లేదు..రాధికా ఆప్టే పాత్ర అయితే అలా వచ్చి వెళ్లిపోయేలా డిజైన్ చేసి,నిరాశపరిచారు.లూప్ హోల్స్

లూప్ హోల్స్


ఇలాంటి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తరహా కథ రాసుకునేటప్పుడు...లూప్ హోల్స్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దర్సకుడు ఆ విషయం మరిచి సినిమా లిబర్టీని చాలా చోట్ల తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్ మెంట్ కు కుటుంబం దగ్గర నుంచి ఫర్మిషన్ తీసుకోవటం...ఇంద్రజ పాత్ర ...లాంటివి లాజిక్ కు అందవు.మణిశర్మ...అక్కడ దాకా ప్లస్

మణిశర్మ...అక్కడ దాకా ప్లస్


మణిశర్మ పాటలు పెద్ద గొప్పగా లేవు...కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చారు. ఆయన సైడ్ నుంచి పూర్తి మార్కులు వేయించుకోలేకపోయారుకెమెరా,ఎడిటింగ్

కెమెరా,ఎడిటింగ్


కెమెరా వర్క్ అద్బుతం అని చెప్పలేం కానీ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగ పాటల్లో లొకేషన్స్ చాలా బాగ పట్టుకుంది. ఎడిటింగ్ ... మరీ లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. ఆ విషయంలో దర్శకుడు, ఎడిటర్ చూసుకోవాల్సింది.యాక్షన్ ఎపిసోడ్స్, నిర్మాణ విలువలు

యాక్షన్ ఎపిసోడ్స్, నిర్మాణ విలువలు


ఈ సినిమా హైలెట్ లలో యాక్షన్ ఎపిసోడ్స్ చెప్పుకోవాలి. రామ్-లక్ష్మణ్ అందించిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో హెలెట్. ముఖ్యంగా రంపచోడవరం లో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉండి విజిల్స్ వేయిస్తాయి. ఇక నిర్మాత సైతం ...బాగ ఖర్చు పెట్టారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.ప్రకాష్ రాజ్, పోసాని

ప్రకాష్ రాజ్, పోసాని


సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర మరింత పవర్ ఫుల్ గ చేసి ఉంటే బాగుండేది. హీరో అంతలా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెలరేగి పోతూ ఉంటే ...విలన్ పాత్ర అందుకు తగ్గట్లుగా లేదు. పోసాని ఉన్నది కాసేపయినా తన మ్యానరింస్ తో బాగానే నవ్వించారు.లవ్, కామెడీ

లవ్, కామెడీ


సీనిమాలో మైనస్ ట్రాక్ ఏమిటీ అంటే లవ్ ట్రాక్ అని చెప్పాలి. అలాగే కామెడీ కూడా బాగా వీక్ గా ఉంది. అలీతో చేసిన కామెడీ ఓకే అనిపించినా, ఎమ్.ఎస్ నారాయణ తో చేసిన కామెడీ విసుకు తెప్పించింది.హీరో, దర్సకుడు

హీరో, దర్సకుడు


హీరోగా బాలకృష్ణకు ఎప్పుడూ వంకపెట్టాల్సిందేమీ లేదు. దర్శకుడే ...సిబీఐ ఆఫీసర్ పాత్రకు కావాల్సినంత డెప్త్ తేలేకపోయారు. ఇక కొత్త దర్శకుడు పెద్ద హీరోతో లాంచ్ అవుతున్నప్పుడు..కాస్త ప్రస్తుతం ఏ సినిమా లు నడుస్తున్నాయి...స్క్రీన్ ప్లే పై మరింత వర్క్ చేయాల్సిన అవసరం గుర్తించాల్సింది. ఎందుకంటే ఎంతోకాలం కష్టపడితే కానీ పెద్ద హీరోతో సినిమా ఆఫర్ రాదు కదా.ఎవరెవరు

ఎవరెవరు


బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా
నటీనటులు: బాలకృష్ణ, త్రిష , రాధికాఆప్టే, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌,
ఎడిటర్: గౌతంరాజు
ఫైట్స్ :రామ్-లక్ష్మణ్
నిర్మాత: రుద్రపాటి రమణారావు
నిర్మాణ సారథ్యం: రుద్రపాటి ప్రేమలత
సమర్పణ: జివ్వాజి రామాంజనేయులు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సత్యదేవ్
విడుదల తేదీ: 14 మే, 2015.ఫైనల్ గా ...బాలకృష్ణ వీరాభిమానులకు నచ్చవచ్చేమో కానీ....సాధారణ సినీ అబిమానులకు కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమా అంటే ... డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే చాలు అనుకునే వారికి ఇది పండుగ లాంటి సినిమా.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


English summary
Lion released amidst huge expectations following the tremendous success of his previous film Legend. But it moves forward without many stumbling blocks though predictable, deja vu scenes . Nandamuri Balakrishna seen in two different roles in the movie, which has been directed by Satya Deva and produced by Rudrapati Ramana Rao under the banner SLV Cinema.
Please Wait while comments are loading...