twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూ(బూ)తు స్టఫ్ (బస్‌స్టాప్‌ రివ్యూ)

    By Srikanya
    |

    ----సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    2.0/5

    సంస్థ: శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ మరియు మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: ప్రిన్స్‌, దివ్య, ఖన్నా, రావు రమేష్‌, అభి, హాసిక, గోపాల్‌సాయి, డి.ఎం.కె, సాయికుమార్‌ పంపన, రావిపల్లి రాంబాబు తదితరులు.
    సంగీతం: జె.బి.
    ఛాయాగ్రహణం: జె.ప్రభాకరరెడ్డి.
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు,
    సహ నిర్మాత: బి. మహేంద్రబాబు.
    ఎడిటింగ్: ఎస్.బి. ఉద్ధవ్,
    కళ: గోవింద్,
    కొరియోగ్రఫీ: రఘు, సతీశ్,
    కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.
    నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, గణేష్‌బాబు
    విడుదల: ఆదివారం. ( నవంబర్ 11, 2012)

    'ఈ రోజుల్లో' వంటి యూ(బూ)త్ ఫుల్ ఎంటర్టైనర్ అందించిన మారుతి తదుపరి చిత్రం రిలీజ్ అవుతుందంటే ఏ విధమైన అంచనాలు,ఏ వర్గంలో ఉంటాయో తెలిసిందే. వారిని తృప్తి(ఇది బూతు పదం కాదు)పరచయానికి దర్శకుడు సాధ్యమైనంత ప్రయత్నం తనదైన శైలిలో మాటలతో చేసాడు. అయితే మరీ అడల్ట్ సినిమా అంటారనే అనుమానం వచ్చిందేమో కానీ, లోకరీతి అంటూ రాసిన రొటీన్ కథకి, రెగ్యులర్ సినీ నీతి సీన్స్ కలిపాడు. ఫస్టాఫ్ బూతు కామెడీతో కవ్వించి,సెకండాఫ్ సెంటిమెంట్ తో ముడి పెట్టి బ్యాలెన్స్ చేసాడు...నిర్మాతకు నాలుగు రూపాయలు తెప్పించే అవకాసం ఇచ్చాడు.

    ఓ వయస్సు వచ్చాక... ఎంతో ప్రేమతో చూసుకునే పేరెంట్స్ ని కాదని,తాము ప్రేమించి వారితో సెటిల్ అవ్వాలనుకునే యువతరం కథగా ఈ చిత్రం సాగుతుంది. బాల్య స్నేహితులైన శ్రీను (ప్రిన్స్‌), శైలు (దివ్య) కొంత కాలం గ్యాప్ తర్వాత కాలేజీలో కలుసుకుంటారు. స్నేహం కాస్తా ప్రేమగా రూపొందుతుంది. శైలుకి అమ్మానాన్నలంటే చాలా గౌరవం. అలాంటి ఆ అమ్మాయి శ్రీను కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పడం మొదలుపెడుతుంది. అది గమనించిన ఆమె తల్లి తండ్రులు కలవరపడతారు..కండీషన్స్ పెడతారు. అప్పుడు ఆమె ఏం నిర్ణయం తీసుకుంది అనేది మిగతా కథ. అలాగే సిమ్ కార్డులు మార్చినట్లు అమ్మాయిలను మార్చే కుర్రాడు, తమ లవర్ వేరే వారితో ప్రేమ కథ నడుపుతోందని తెలియక,తన ఇంట్లో దొంగతనాలు చేసి మరీ గిప్ట్ లు ఇచ్చే మరో కుర్రాడు వంటి మరో రెండు పాత్రల కథలు కూడా సిమిలర్ గా ఈ లవ్ స్టోరీ తో పాటు సాగుతూంటాయి.

    నాగేశ్వరరెడ్డి గర్ల్ ప్రెండ్ చిత్రాన్ని గుర్తు చేసే ఈ చిత్రంలో కథ గా చెప్పుకోవటానికి ఏమీ లేకపోయినా,కేవలం డైలాగులతో ముఖ్యంగా అండర్ కరెంట్ బూతుని నమ్మి ఈ చిత్రాన్ని దర్శకుడు తీసాడు. ఇక చిన్నప్పటి నుంచి కలసి తిరిగన బాల్య స్నేహితులు గురించి సాధారణంగా ఇళ్లళ్లో పెద్దవాళ్లకి తెలుస్తూంటుంది. అయితే ఇందులో హీరోయిన్ తల్లి తండ్రులకు, తమ కూతురుతో చిన్నప్పటి నుంచి కలిపి చదివి,తిరిగన స్నేహితుడు ఎవరో తెలియకపోవటం చిత్రం అనిపిస్తుంది. అందులోనూ ఆమె ప్రతీ విషయాన్ని నిశితంగా అబ్జర్వ్ చేసే పేరెంట్స్ గా వారు కనిపిస్తారు. ఆ విషయం ప్రక్కన పెడితే...ఈ రోజుల్లో చిత్రంలో నత్తి నత్తిగా మాట్లాడుతూ బూతుని సమర్ధవంతంగా పడించిన సాయికుమార్....ఈ చిత్రంలోనూ సెల్లు..సిమ్ము అంటూ బూతుని భారీ ఎత్తున కుమ్మరించే ప్రయత్నం చేసాడు. సెన్సార్ ఇలాంటివి బూతుగా పరిగిణంచలేదా.. లేక బాలీవుడ్ లో డర్టిపిక్చర్,డిల్లీ బెల్లీ వంటివి వస్తున్నాయని వాటిని ఆదర్శంగా తీసుకుని ఈ సినిమాని వదిలేసిందో అర్దం కాదు. అయితే ఉన్నతంలో అదృష్టం ఏమిటంటే.. ఈ చిత్రంలో విజువల్ బూతు కి ప్రయారిటీ ఇవ్వకపోవటం. నటీనటుల్లో..సాయికుమార్ మాత్రమే చెప్పకోతగిన రీతిలో చేసారు. డైలాగులు విభాగం గురించి మాట్లాడాలంటే దర్శకుడు మారుతిని మెచ్చుకోవాలి.. ఎక్కడ బూతుని ఇరిక్కిద్దామనే ఆయన తాపత్రయం ప్రతీ సీన్ లో కనపిస్తుంది. కెమెరా పరంగా 5డి లో మంచి క్వాలిటీనే ఇచ్చారు. పాటలు అయితే ఈ రోజుల్లో చిత్రంలో లాగ ప్రేక్షకులలో నానేలాగ లేవు. సోసోగా ఉన్నాయి.

    ఫైనల్ గా భూతద్దం పెట్టి చూడకుండానే ..బూతద్దం స్పురించే ఈ చిత్రం వివాదాల్లో ఇరుక్కుని మంచి కలెక్షన్స్ సంపాదించే అవకాసం కనిపిస్తోంది. సెకండాఫ్ కాస్త ట్రిమ్ చేస్తే అడల్ట్ కంటెట్ అయినా కంటిన్యూగా ఆనందించే అవకాసం కలుగుతుంది. లేదా సెంటిమెంట్ సీన్స్ అనే పంటిక్రింద రాళ్లు తగులుతాయి. ఏది ఆశించి వచ్చారో వారికి ఆ విధమైన ఆనదం పూర్తిగా కలిగించంటం బెస్ట్ కదా.

    English summary
    Director Maruthi who shot to fame with the successful youthful entertainer - Ee Rojullo is back. He has made another youthful romantic drama titled Bus Stop relesed today with average talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X