For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆకట్టుకోలేదు...(బూచమ్మ బూచోడు రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  1.5/5
  హైదరాబాద్: ఈ మధ్య టాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాల జోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన ‘కాంచన' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అదే విధంగా గత సంవత్సరం వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్' కూడా మంచి హిట్టయింది. ఇటీవల వచ్చిన వచ్చిన ‘గీతాంజలి' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది.

  తాజాగా హారర్ అండ్ కామెడీ కథాంశంతో ‘బూచోడు బూచమ్మ' అనే మరో సినిమా థియేటర్లోకి వచ్చింది. శివాజీ, కైనాజ్ మోతీవాలా ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా మొత్తం హైదరాబాద్ శివారులో ఉండే ఫాం హౌస్‌లో నడుస్తుంది. సినిమాలో కామెడీ మసాలా వేసేందుకు బ్రహ్మానందం, తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్రలతో నటింప జేసారు.

  బ్యానర్‌: స్నేహ మీడియా అండ్‌ హేజస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

  సంగీతం: శేఖర్‌ చంద్ర

  కూర్పు: ప్రవీణ్‌ పూడి

  ఛాయాగ్రహణం: విజయ్‌ మిశ్రా

  నిర్మాతలు: రమేష్‌ అన్నంరెడ్డి, ప్రసాద్‌ రెడ్డి

  దర్శకత్వం: రేవన్‌ యాదు

  Boochamma Boochodu - Movie Review

  కథలోకి వెళితే...

  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్(శివాజీ) కొత్తగా ఫాం హౌస్ కొనుక్కుని తన భార్య శ్రావణి(కైనాజ్ మోతీవాలా)తో కలిసి హాపీగా గడిపేందుకు అక్కడికి వెళతాడు. అక్కడ సంతోషంగా గడుపుతున్న వీరికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో రాత్రి పూట వింత శబ్దాలు వస్తూ వారిని భయానికి గురి చేస్తూ ఉంటాయి. ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునే వీరు తమకు తెలియకుండానే రాత్రి పూట ఒకరినొకరు కొట్టుకుంటారు. కట్ చేస్తే ఇంట్లో ప్రభాకర్, శానోరిటా అనే రెండు దయ్యాలు ఉన్నట్లు వారికి తెలిసి పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దయ్యాలను బయటకు పంపడం ఎవరి వల్లా కాదు. చివరకు ఆ ఇంట్లో నుండి వారు బయటకు వెళ్లాలని ట్రై చేసినా ఆ దయ్యాలు వారిని వెళ్లనివ్వవు. ఆగస్టు 15న జరిగే ఓ సంఘటన స్టోరీలో కీలకంగా మారుతుంది. మరి ఆగస్టు 15న ఏం జరిగింది. ఆ దయ్యాల నుండి కార్తీక్, శ్రావణి ఎలా తప్పించుకున్నారు? అనేది తర్వాతి స్టోరీ.

  విశ్లేషణ

  శివాజీ, కైనాజ్ మోతీవాలా పెర్పార్మెన్స్ ఫర్వాలేదు. రొమాంటిక్ సీన్లలో కాస్త ఓకే అనిపించినా, హారర్ సీన్లలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. గ్లామర్ పరంగా కైనాజ్ మోతీవాలకు మంచి మార్కులే పడ్డాయి. బ్రహ్మానందం ఉన్నా...ఆయన్ను సరిగ్గా వాడుకోలేక పోవడంతో కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. జబర్దస్త్ టీం కామెడీ కాస్త నవ్విస్తుంది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలే ఏమీ లేవు.

  గుణశేఖర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన రేవన్ యాదులో అనుభవలేని కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమా కాన్సెప్టు బానే ఉన్నా.....దాన్ని పర్‌పెక్టుగా పండించడంలో విఫలం అయ్యాడు. హారర్ సన్నివేశాలు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యాడు. కథనం కూడా ఆకట్టుకునే విధంగా లేదు.

  సాంకేతిక అంశాల పరంగా చూస్తే...శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. వినయ్ మిశ్రా సినిమాటోగ్రఫీ అంత బ్యాడ్ కాకపోయినా హారర్ కథాంశానికి తగిన విధంగా లేదని చెప్పొచ్చు. ఇతర సాంకేతిక విభాగాలు కూడా సరైన పనితీరు కనబర్చలేదు.

  ఓవరాల్‌గా......‘బూచమ్మ బూచోడు' సినిమా ప్రేక్షకులు ఆకట్టుకోవడంలో విఫలం అయిందని చెప్పక తప్పదు.

  English summary
  Gunasekhar's assistant director Revan Yadu is now turning independent director with the movie Boochamma Boochodu starring Sivaji and Kainaz Motivala in the leads. Its promos have garnered lot of curiosity for the film, which has been produced by Annamreddy Ramesh and Prasad Reddy under Sneha Media and Hezen Entertainment. The movie has hit the marquee across the globe today (September 5).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X