»   » ‘ఛలో’ మూవీ రివ్యూ : ఫన్ ఉంది కానీ, అక్కడ కాస్త తేడా కొట్టింది...

‘ఛలో’ మూవీ రివ్యూ : ఫన్ ఉంది కానీ, అక్కడ కాస్త తేడా కొట్టింది...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
‘ఛలో’మూవీ రివ్యూ : కాస్త తేడా కొట్టింది...!

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాగ శౌర్య తొలి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. లుక్స్ పరంగా, నటన పరంగా అందరి మెప్పుపొందాడు. మంచికథలు ఎంచుకుంటూ ముందుకు సాగితే కుర్రాడు పైకొస్తాడు అనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ నాలుగేళ్లలో శౌర్య దాదాపు 10 సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే అందులో శౌర్యను స్టార్ హీరోగా నిలబెట్టే సినిమా ఒక్కటీ లేదు. మరి లోపం ఎక్కడ ఉంది? అంటే.... శౌర్య ఎంచుకునే కథలు, సినిమాల్లోనే అని చెప్పక తప్పదు. ఈ సారి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నా సరే ఎలాగైనా తన కెరీర్‌ను ఒక లెవల్‌కి తీసుకెళ్లే హిట్ కొట్టాలనే కసితో సొంత బేనర్లో తన తల్లిదండ్రులే నిర్మాతలుగా 'ఛలో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శౌర్య ఈ సినిమాతో అయినా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాడా? లేక ఇంకా ఇక్కడే ఉన్నాడా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ విషయానిస్తే...

కథ విషయానిస్తే...

హరి(నాగ శౌర్య)కు చిన్నప్పటి నుండి కొట్టడం లేదా కొట్టించుకోవడం అలవాటు. అందులోనే అతడికి ఆనందం ఉంటుంది. గొడవల్లో తలదూర్చడం అతడి హాబీ. కొడుకు ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్న తల్లి దండ్రులు (ప్రగతి-సీనియర్ నరేష్)...... రజనీకాంత్ సినిమాలోని ఓ సీన్‌కు చూసి ఇన్స్‌స్పైర్ అయి గొడవలు ఎక్కువగా ఉండే ఆంధ్ర-తమిళనాడు బార్డర్‌లోని ‘తిరుప్పురం' అనే ఊరికి పంపిస్తారు. ఆ ఊర్లో తెలుగు-తమిళ వర్గాలు రోజూ గొడవపడుతూ ఉంటారు. ఇక్కడ నిత్యం గొడవలు చూసైనా గొడవలపై విరక్తి చెంది కొడుకు మారుతాడు అనేది వారి ఆశ.

అసలు విషయం తెరపై చూడాల్సిందే

అసలు విషయం తెరపై చూడాల్సిందే

‘తిరుప్పురం' ఊర్లో అడుగు పెట్టగానే హరి తెలుగువాడని తెలిసి అతడిని చంపాలని ప్రయత్నిస్తారు తమిళ వర్గీయులు. వారి నుండి ఎలాగో తప్పించుకున్న హీరో..... తనకు తెలియకుండానే తమను శత్రువులుగా భావించే తమిళ వర్గానికి చెందిన అమ్మాయి కార్తీక(రష్మిక మండన్న)ను ప్రేమిస్తాడు. మరి తెలుగోళ్లంటే వారిని హీరో ఎలా కన్విన్స్ చేశాడు? ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉన్న ఆ ఊరి తెలుగు, తమిళ ప్రజలు చంపుకునేంత బద్దశత్రువులు కావడానికి కారణమేంటి? అనేది తెరపై చూడాల్సిందే.

నాగ శార్య పెర్ఫార్మెన్స్

నాగ శార్య పెర్ఫార్మెన్స్

నాగ శౌర్య పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే.... హరి పాత్రలో బాగా నటించాడు. లుక్స్ పరంగా కూడా బావున్నాడు. అయితే నాగ శౌర్య నటనలో నెక్ట్స్ లెవల్ మాత్రం కనిపించలేదు. ఎప్పటిలాగే రోటీన్‌గా చూసిన శౌర్యను చూసిన ఫీలింగే కనిపిస్తుంది.

రష్మిక మండన్న

రష్మిక మండన్న

ఈ చిత్రం ద్వారా కన్నడ నటి రష్మిక మండన్న హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది. కార్తీక పాత్రలో పాత్రలో సెట్టయింది. అయితే ఆమె అందం, పెర్పార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పలేం కానీ ఎబో యావరేజ్ అని చెప్పొచ్చు.

ఇతర పాత్రలు

ఇతర పాత్రలు

హీరో తల్లిదండ్రులుగా నటించిన సీనియర్ నరేష్, ప్రగతి తమ పాత్రల్లో ఇమిడిపోయారు. అచ్యుతకుమార్, మైమ్ గోపీ, ప్రవీణ్, జివి కుమార్, వైవా హర్ష, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి, రాకెట్ రాఘవ, రాజేంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సత్య, వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్

సత్య, వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్

సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత బాగా హైలెట్ అయింది సత్య, వెన్నెల కిషోర్. సినిమా తొలి భాగంలో సత్య తన కామెడీ టైమింగుతో మెప్పించాడు. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ తన రివేంజ్ క్యారెక్టరైజేషన్లో నవ్వించాడు. ఈ ఇద్దరూ సినిమాకు ప్లస్ అయ్యారు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే మహతి స్వర సాగర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బావుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. టెక్నికల్ అంశాల పరంగా పెద్దగా లోటేమీ కనిపించలేదు.

దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందించాడు. ఇది తొలి సినిమానే అయినప్పటికీ.... డైరెక్షన్ పరంగా బాగా హ్యాండిల్ చేశాడు. నటీనటుల నుండి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. డైలాగులు కూడా ఆకట్టునే విధంగా రాశాడు. అయితే సినిమాకు అతి ప్రధానమైన కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. స్టోరీని బలంగా బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పక తప్పదు.

ఫస్టాఫ్ ఎలా ఉంది

ఫస్టాఫ్ ఎలా ఉంది

సినిమా ఫస్టాఫ్ కాలేజీలో జరిగే చిన్న చిన్న ఫన్నీ గొడవలు, హీరోయిన్‌తో ప్రేమాయణంతో పన్ రైడ్‌లా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్ ఉత్కంఠ రేపే విధంగా అయితే లేదు.

సెకండాఫ్ మైనస్

సెకండాఫ్ మైనస్

సినిమా సెకండాఫ్ వచ్చేసరికి కథలో సీరియస్‌‌నెస్ నిండుకుని వేడెక్కుతుందని అంతా అనుకుంటారు. ప్రేక్షకుడు కూడా దాన్ని ఆస్వాదించాలనే మైండ్ సెట్‌కి వచ్చేస్తాడు. ఈ సమయంలో ప్రేక్షకుడు ఊహించినదానికంటే హైలెవల్‌లో కథ ఉంటే మరింత థ్రిల్ అవుతాడు. కానీ దర్శకుడు ఇక్కడ కథను చాలా లోలెవల్‌కి తీసుకెళ్లాడు. క్లైమాక్స్ వచ్చేసరికి స్టోరీ పూర్తిగా డీలా పడిపోయింది. ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యే ముగింపు ఇవ్వలేక పోయాడు.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

నాగ శౌర్య పెర్ఫార్మెన్స్
వెన్నెల కిషోర్, సత్య కామెడీ
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

కథలో బలం లేక పోవడం
లాజిక్ లేని, కన్వినస్‌గా లేని సీక్వెన్స్

చివరగా..

చివరగా..

‘ఛలో' రషెస్ చూసిన వారంతా నాగ శౌర్య గత సినిమాల్లా కాకుండా నెక్ట్స్ లెవల్లో కనిపిస్తాడని అంతా ఊహించారు. కానీ అలాంటిదేమీ జరుగలేదు. హీరోతో సమానంగా.....ఫస్టాఫ్ భారం కమెడియన్ సత్య, సెకండాఫ్ భారం వెన్నెల కిషోర్ తమ కామెడీతో మోసిన ఫీలింగ్ కలుగుతుంది. కంటెంట్ ప్రేక్షకుడికి ఎమెషనల్‌గా కనెక్ట్ కాలేదు. సినిమా ముగిసిన తర్వాత పూర్తి స్థాయి సంతృప్తితో ప్రేక్షకుడు బయటకు వస్తేనే సినిమా హిట్. కానీ ఈ సినిమా విషయంలో ఎంత మంది అలా ఫీలౌతారో? అనే అంశంపై విజయం ఆధారపడి ఉంటుంది.

నటీనటులు, తెర వెనక

నటీనటులు, తెర వెనక

తారాగణం: నాగ శౌర్య, రష్మిక మండన్న, అచ్యుత్ కుమార్, నరేష్, వైవా హర్ష, రఘు బాబు, ప్రగతి, ప్రవీణ్, సత్య, సుదర్శన్, రాజేంద్రన్ తదితరులు....
పాటలు - భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్
డ్యాన్స్ - రఘు, విజయ్
పి.ఆర్.ఓ - ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైన్స్ - అనిల్ భాను
ఫైట్స్ - వెంకట్
ఆర్ట్ - రామ్ అరసవిల్లి
లైన్ ప్రొడ్యూసర్ - బుజ్జి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు
సంగీతం- మహతి స్వర సాగర్
సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌,
నిర్మాత‌- ఉషా ముల్పూరి,
సమర్పణ - శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి,
ద‌ర్శ‌క‌త్వం- వెంకి కుడుముల‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018

English summary
Chalo movie Review. Naga Shaurya, Rashmika Mandanna starrer film revolves around a village divided into the Tamil and Telugu populace. Neither of the people cross paths with the others, but what happens when two people from these opposite ends fall in love?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu