For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బయిటకు ఛలో...(‘చమ్మక్ చల్లో’రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  1.5/5
  షో,మిస్సమ్మ వంటి కమర్షియల్ ప్రయోగ చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు నీలకంఠ నుంటి కొత్త చిత్రం వస్తోందంటే ఏదో విభిన్నత ఉండే ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. అయితే నమ్మకాలు వమ్మవతూండటం సినిమాల విషయంలో అతి సాధారణం. దానికితోడు అప్పుడెప్పుడో హిట్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ తో కొత్త తరహా ప్రేమ కథ చేస్తున్నానంటూ నేరేషన్ లో డ్రాగ్ చేసిన లవ్ స్టోరీ అందించాడు.

  ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న కిషోర్(అవసరాల శ్రీనివాసరావు) ఓ ఫ్రెష్ లవ్ సబ్జెక్టు కోసం వెతుకుతూంటాడు. ఆ క్రమంలో అతనికి ఫ్రొఫెసర్ అప్పారావు (షాయీజీ షిండే)తగులుతాడు. ఆయన తన స్టూడెంట్స్ నిజ జీవిత ప్రేమ కథ ఉందని చెప్పటం మొదలెడతాడు. ఆ కథే ..శ్యామ్(వరుణ్ సందేశ్), అన్షు(సంచిత పదుకోనె)లది. తన కాలేజీలో చదువుకుంటున్న వారి ప్రేమకు దారి తీసిన అంశాలు..అది ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లటం దాకా వివరిస్తాడు. ఈలోగా శ్యామ్...జీవితంలోకి ఊహించని విధంగా సునయిన(కేధరిన్)వచ్చిందని, అక్కడ నుంచి ఈ లవ్ పెయిర్ లో కాంప్లికేషన్స్ మొదలయ్యాయని చెప్తాడు. ఆ కథ విన్న దర్శకుడు కిషోర్ ఎలా రియాక్టు అయ్యాడు..శ్యామ్ ప్రేమ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చాడనేది మిగతా కథ.

  నిజానికి ఈ సబ్జెక్టు పూర్తిగా ట్రీట్ మెంట్ మీద ఆధారపడింది. నేటీ యువత యువకుల ఆలోచనలు,కన్ఫూజన్స్, ప్రేమలు చర్చిద్దామని దర్శకుడు ఈ చిత్ర కథ రాసుకున్నట్లు అర్దం అవుతుంది. అయితే నేరేషన్ లో కొత్తగా చెప్దామనుకుని రెగ్యులర్ ట్విస్ట్ లతోనే కథనం నడిపించటం..అదీ మరీ స్లోగా ఆర్ట్ సినిమా తరహాలో నడపటం సినిమాకు మైనస్ గా మారింది. ముఖ్యంగా యూత్ చాలా స్పీడుగా ఉంటున్నారు. వారి ఆలోచనల వేగాన్ని అందుకునేలా నేరేషన్ ఉంటే బాగుండేది. అయితే లవ్ స్టోరీలు స్లో నేరేషన్ లో చెప్తే ఆ ఫీల్ ఇంజెక్టు అవుతుందని ఈ జాతీయ దర్శకుడు భావించి ఇలాంటి చిత్రం అందించినట్లున్నారు. కథని మరింత షార్పు చేసుకుని, సీన్స్ లో వేగం పెంచితే ఖచ్చితంగా వర్కవుట్ అయ్యే సబ్జెక్టు ఇది. అప్పటికీ దర్శకుడు నీలకంఠ...కొత్త తరహాలో ప్రెజెంట్ చేయటానికి టైటిల్స్ దగ్గరనుంచి ప్రయత్నించారు. కానీ...కనికట్టు చేసి ఆకట్టుకోలేకపోయారు. అలాగే ప్రేమ కథలకు ప్లస్ కావాల్సిన సంగీతం ఈ చిత్రానికి మైనస్ గా మారింది. అలాగే కథను నడిపే శాయీజీ షిండే పాత్రకు లవ్ స్టోరీని నడిపేటంత మోటివ్ అస్సలు కనపడదు.

  మిగతా విశ్లేషణని స్లైడ్ షో లో చదవండి


  నీలకంఠ గత చిత్రాలలో ప్లస్ అయిన డైలాగులు ఈ చిత్రంలో మ్యాజిక్ చెయ్యలేకపోయాయి. సినిమాలో లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ సీన్స్ లో ఎమోషనల్ గ్రాఫ్ మిస్సైంది.


  నీలకంఠ గత చిత్రాలలో ప్లస్ అయిన డైలాగులు ఈ చిత్రంలో మ్యాజిక్ చెయ్యలేకపోయాయి. సినిమాలో లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ సీన్స్ లో ఎమోషనల్ గ్రాఫ్ మిస్సైంది.


  హీరోయిన్ సంచిత పదుకోనిలో యాక్టింగ్ స్కిల్స్ కనపడవు అలాగే గ్లామర్ మచ్చుకైనా కనపడదు.

  సినిమాలో నిజానికి పాత్ర చాలా తక్కువ ఉన్నా...సినిమాకు ప్లస్ గా మారిన ఎలిమెంట్ కేథరిన్. ఇప్పటికే అల్లు అర్జున్ సరసన బుక్కైన ఈమె చాలా హాట్ గా కనపించి ఉన్నంతసేపు ఎంగేజ్ చెయ్యగలిగింది.

  అష్టాచెమ్మతో పరిచయమైన అవసరాల శ్రీనివాస్ ట్యాలెంట్ సరిగ్గా ఎక్సప్లోర్ కావటంలేదనిపిస్తుంది. శాయిజీ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది లేదు. సేమ్ ఎక్సప్రెషన్స్..వెన్నెల కిషోరో కాస్త రిలీఫ్ గా ఉన్నంతలో నివ్వించాడు. చిన్మయి ఓకే. బ్రహ్మాజీతండ్రి పాత్రలకు మరీ యంగ్ గా ఉన్నాడు.

  టెక్నికల్ గా రామ్ నాధ్ కెమెరా వర్క్ చాలా యావరేజ్ గా ఉంది. నాగిరెడ్డి ఎడిటింగ్ వర్క్ చాలా కాలం క్రితం ఆగిపోయిన ఫీలింగ్ తెస్తుంది. చాలా చోట్ల ఇంకా ట్రిమ్ చేసి సినిమాని షార్ప్ చేయాలి.

  డైలాగ్స్ సోసో గా ఉన్నాయి. ‘చందమామతో కుందేల్లా ..' పాట త్పప కిరణ్ వారణాసి సంగీతంలో మెరుపులు లేవు. మిగతా విభాగాలు గురించి పెద్దగా మాట్లాడుకునేందుకు ఏమీ లేదు.

  సినిమా హైలెట్స్ లో ..కేధరిన్,చందమామతో సాంగ్ ఉంటే, డ్రాబాక్ లలో..స్లో నేషేషన్ తో కూడిన స్క్రీన్ ప్లే, వరుణ్ ఎక్సప్రెషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ నిలుస్తాయి.

  బ్యానర్ : శ్రీ శైలేంద్ర మూవీస్
  నటీనటులు: వరుణ్ సందేశ్ , సంచిత పదుకోనే, కేథరిన్ , అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, చిన్మయి, సురేఖావాణి తారాగణం
  పాటలు: అనంత శ్రీరామ్,
  ఛాయాగ్రహణం: రంగనాథ్ గోగినేని,
  సంగీతం: కిరణ్ వారణాసి
  కూర్పు: నాగిరెడ్డి,
  కళ: బాబ్జీ,
  కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ.
  సమర్పణ: డి.ఎస్. రావు
  నిర్మాత : మాస్టర్ బుజ్జిబాబు


  డిఫెరెంట్ ప్రేమ కథను తెరపై ఆవిష్కరిస్తానంటూ వచ్చిన ఈ చిత్రం రొటీన్ వరుణ్ సందేశ్ ప్లాప్ ల లిస్ట్ లో కలిసిపోయేటట్లు కనపడుతోంది. ఓపినింగ్స్ కూడా అంతంత మాత్రం తెచ్చుకున్న ఈ చిత్రం నీలకంఠ అభిమానులను కూడా నిరాసపరుస్తుంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  National Award winning director G Neelakanta Reddy's latest movie Chammak Challo starring Varun Sandesh, Sanchita Padukone and Catherine Tresa in leads, is a beautiful love story, but its dragging narration may kill your interest.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X