For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చంద్రముఖి

  By Staff
  |

  Chandramukhi
  జోశ్యుల సూర్యప్రకాష్‌

  సినిమా: చంద్రముఖి

  విడుదల తేదీ: 14-4-2005

  నటీనటులు: రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార, ప్రభు,

  వినీత్‌, మాళవిక, నాజర్‌, సుధ, వడివేలు తదితరులు.

  సంగీతం: విద్యాసాగర్‌

  కెమెరా: శేఖర్‌ వి జోసెఫ్‌

  నిర్మాతలు: పి.కరుణాకర్‌ రెడ్డి, గవర పార్ధ సారధి

  దర్శకత్వం: పి.వాసు

  తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలేమీ లేకుండా జాగ్రత్తపడి తీసిన చిత్రం 'చంద్రముఖి'. తెలుగు ్రస్టెయిట్‌ సినిమాలు కథలు కరువై కుదేలవుతున్న దశలో ఈ సినిమాలో విచిత్రంగా కథ ఎక్కువై హీరోయిజం కరువైంది.

  కథ ప్రారంభమే కైలాష్‌ (ప్రభు) ఓ పురాతన రాజ భవంతిని భార్య గంగ( జ్యోతిక) సలహాపై కొంటాడు. ఆ పురాతన బిల్డింగుకో ఫ్లాష్‌బ్యాక్‌, గంగకో ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటాయి. ఈశ్వర్‌ (రజనీకాంత్‌) కైలాష్‌ ప్రాణమిత్రుడు. ఆ భవంతికున్న ఫ్లాష్‌బ్యాక్‌ చూస్తే .... 150 ఏళ్ళ క్రితం వెంకటాపురం జమీందారుది ఆ భవంతి. ఆయన చంద్రముఖి అనే నర్తకిని మోహించి ఎత్తుకొచ్చి తన భవంతిలో పెడతాడు. కానీ చంద్రముఖి ఒక నాట్యాచార్యుడిని అప్పటికే ప్రేమించి ఉంటుంది. అతడిని తీసుకొచ్చి తన భవంతి ఎదురుగా ఉంచి కలుస్తూ ఉంటుంది. ఒకరోజు రాజా వారికి ఆ విషయం తెలిసి నాట్యాచార్యుడిని ఆమె కళ్ళెదురుగా చంపి, ఇద్దరినీ కలిపి తగులబెడతాడు. చంద్రముఖి ఆత్మ ఎక్కడ పగబడుతుందోనని చితాభస్మాన్ని ఒక గదిలో పెట్టి బంధిస్తాడు. (ఎవరైనా ఏ ఊరి పొలిమేరలోనే బంధిస్తారు. ఇంట్లో ఆత్మల్ని ఎలా బంధిస్తారు?).

  తరాలు మారి ఆ రాజ సంస్ధానం కైలాష్‌ చేతికి వస్తుంది. గంగ (జ్యోతిక) ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమిటంటే చిన్నప్పుడే తలిదండ్రులు దారుణ పరిస్ధితుల్లో మరణించగా ఆమె మనసు గాయపడుతుంది. తర్వాత అమ్మమ్మ చెప్పే కథలు వింటూ ఆ పాత్రలను ఊహించుకుంటూ 'స్ప్లిట్‌ పర్సనాలిటీ' అలవరుచుకుంటుంది. అలా ఆమె పెరిగి పెద్దదై ఆ భవంతి గురించి విని చంద్రముఖి పాత్రతో ప్రభావితమవుతుంది. ఆమె చర్యలు ఎలా ఉంటాయి? ఆ విపత్తుల నుంచి సైక్రియాట్రిస్ట్‌ రజనీకాంత్‌ ఆమెను ఎలా రక్షిస్తాడనేది మిగితా కథ. నయనతార ఆ భవంతిలో పనిచేసే తోటమాలి కూతురు.

  గతంలో ఎన్నో ఎమోషనల్‌ డ్రామాలు పండించి సినీ విజయాలు సాధించిన దర్శకుడు పి.వాసు (చంటి, ఘరానా మొగుడు, అసెంబ్లీ రౌడీ కథల సృష్టికర్త) సన్నివేశాలను బాగానే రూపొందించినా స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, పాత కాలం టేకింగ్‌ సినిమాకు మైనస్‌ పాయింట్లు. ఇందులోని హీరో పాత్ర రజనీకాంత్‌ స్టైల్‌కి, నటనకు అవకాశమున్నది కాకపోయినా రజనీ బాగా నటించారు. ఆత్మను పాము రూపంలో చూపడం లాజిక్‌కు అందదు. క్లెయిమాక్స్‌ అర్ధ శతాబ్దం కింద టి సినిమాలను గుర్తుచేస్తుంది. ఎంతో ప్రచారం జరిగిన నయనతార పాత్రకు సినిమాలో విలువే లేదు. సినిమా ప్రారంభ దృశ్యాల్లో రజనీకాంత్‌ను చంపడానికి ప్రభు మేనత్త ఎందుకు ప్రయత్నిస్తుందో అర్ధం కాదు. మాళవిక పాత్రకు ముగింపు లేదు. సినిమా మొత్తంలోకి జ్యోతిక నటనే హైలైట్‌.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X