For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జస్ట్ ఓకే...(కమల్ హాసన్ "చీకటి రాజ్యం రివ్యూ")

  By Bojja Kumar
  |

  Rating:
  2.5/5

  హైదరాబాద్: క‌మ‌ల్‌హాస‌న్ దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత తెలుగులో తెర‌కెక్కించిన సినిమా చీక‌టి రాజ్యం. తూంగావ‌నం పేరుతో త‌మిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తెలుగులో కాస్త ఆలస్యంగా ఈ రోజు విడుదలైంది. కమల్ హాసన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫసీర్ గా నటించాడు. సినిమాకు సంబంధించిన పూర్తి విశేషాలు రివ్యూలో చూద్దాం...

  క‌థ‌ విషయానికొస్తే...దివాక‌ర్ (క‌మ‌ల్‌హాస‌న్‌) నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో పోలీస్ ఆఫీస‌ర్‌. ఓ డ్రగ్ ఆపరేషన్లో మణి (యుగి సేతు)తో కలిసి భారీ ఎత్తున కొకైన బ్యాగ్స్ పట్టుకుంటాడు దివాకర్. అవి విఠల్ రావు(ప్రకాష్ రాజ్)కు చెందినవి. దీంతో విఠల్ రావు దివాకర్ కుమారుడు వాసు(అమన్ అబ్దుల్లా)ను కిడ్నాప్ చేసాడు. తన కొకైన్ ఇస్తేనే పిల్లాడిని వ‌దులుతాన‌ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. త‌న కొడుకును వారి నుంచి కాపాడుకోవ‌డానికి దివాకర్ ఏం చేసాడు అనేది సినిమా.

  పెర్మఫార్మెన్స్ పరంగా చూస్తే... పోలీస్ ఆఫీసర్ పాత్రకు కమల్ హాసన్ పర్ ఫెక్టుగా సూటయ్యాడు. ఇందులో ఆయన లుక్ కూడా బావుంది. త్రిష నార్కాటిక్ ఆఫీస‌ర్‌గా మంచి పాత్ర‌లో క‌నిపించింది. చూడ్డానికి కూడా గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది. విలన్ పాత్రలో ప్ర‌కాష్ రాజ్ తన సహజమైన నటనను ప్రదర్శించాడు‌, సంప‌త్‌, కిశోర్‌తో పాటు అంద‌రూ బాగానటించారు. లిప్ లాక్ సీన్ల కోసమే మధుశాలినిని తీసుకున్నట్లుంది. ఇతర నటీనటులు వారి వారి పాత్ర మేరకు రాణించారు.

  Cheekati Rajyam Movie Review

  కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్, ప్రకాష్ రాజ్, మధు శాలిని లిప్ లాక్ సీన్లు, త్రిష ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. నెమ్మదిగా సాగే కథనం, సెకండాఫ్ సాగదీసినట్లు ఉండటం, స్టోరీలైన్ పెద్దగా ఆకట్టుకోక పోవడం, ఎడిటింగ్ తదితర అంశాలు మైసన్.

  ప్రేక్ష‌కుడికి పెద్ద‌గా ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు సినిమాలో కనిపించవు. ఎంటర్టెనింగ్ అంశాలు కూడా ఏమీ లేవు. త‌ల్లీ, కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్ కూడా సరిగా చూపలేదు. స్టంట్స్ కూడా చెప్పుకోద‌గ్గ‌వి ఏమీ కాదు. సినిమాను సింపుల్‌గా తీసేశారు.

  ఇక టెక్నికల్ అంశాల పరంగా చూస్తే.... కమల్ హాసన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ విషయంలో ఆయన పనితనం బావుంది. మామూలుగా అయితే ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు ఉంటే మరింత ఆసక్తికరంగా సాగేది. కానీ దర్శకుడు ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త షార్ప్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.

  చాలా కాలం తర్వాత కమల్ హాసన్ తెలుగులో చేస్తున్నసినిమా కావడం, సినిమా విడుదలు ముందే వదిలిన ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటం, మ‌ధుశాలిని లిప్‌లాక్‌, త్రిష గ్లామ‌ర్‌, ప్ర‌కాష్‌రాజ్ తోడ‌వ‌డం వంటివ‌న్నీ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచాయి.

  Cheekati Rajyam Movie Review

  జస్ట్ ‘ఎ' సెంటర్లలో మాత్రమే సినిమా ఆడుతుంది. మాస్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే అంశాలు లేక పోవడంతో బి, సి సెంటర్లలో కష్టమే. ఓవరాల్ గా సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయినా జస్ట్ ఓకే అనే విధంగా ఉంది.

  సంస్థ‌: రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్‌
  న‌టీన‌టులు: క‌మ‌ల్ హాస‌న్‌, ప్ర‌కాష్ రాజ్‌, త్రిష‌, కిశోర్‌, సంప‌త్‌, యుహి సేతు, మ‌ధు శాలిని, ఆశా శ‌ర‌త్‌, సోమ‌సుంద‌రం, అబ్బూరి ర‌వి, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, ఉమా రియాజ్ ఖాన్‌, ఛామ్స్, జ‌గ‌న్‌, అమ్మ‌న్ త‌దితరులు
  కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: గౌత‌మి
  ఆర్ట్: ప‌్రేమ్ న‌వాస్‌
  స్టంట్స్: గిల్స్ కాన్స‌యిల్‌, టి.ర‌మేష్‌,
  సౌండ్ డిజైన‌ర్: కునాల్ రాజ‌న్‌
  డైలాగ్స్: అబ్బూరి ర‌వి,
  లైన్ ప్రొడ్యూస‌ర్‌: సితార సురేష్ బాలాజి
  ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: సురేష్ బాలాజీ, జార్జి పియ‌స్‌
  ఎడిట‌ర్‌: షాన్ మొహ‌మ్మ‌ద్‌
  స్క్రీన్ ప్లే: క‌మ‌ల్ హాస‌న్‌
  మ్యూజిక్‌: జిబ్రాన్‌
  ఫోటోగ్ర‌ఫీ: సాను జాన్ వ‌ర్గీస్‌
  స‌హ నిర్మాత‌: గోకులం గోపాల‌న్‌
  నిర్మాతలు: ఎస్‌.చంద్ర‌హాస‌న్‌, క‌మ‌ల్‌హాస‌న్‌
  ద‌ర్శ‌క‌త్వం: రాజేష్‌.ఎం.సెల్వ‌

  English summary
  Kamal Haasan-Trisha Krishnan's Cheekati Rajyam, directed by the actor's long time associate, Rajesh Selvan. Cheekati Rajyam is an OK entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X