»   » భయపెట్టింది కానీ ... ('చిన్నారి' రివ్యూ)

భయపెట్టింది కానీ ... ('చిన్నారి' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

తెలుగులో హర్రర్ సినిమాలు బాగానే ఆడుతున్న మాట నిజమే. అంతమాత్రాన కంటెంట్ లేని హర్రర్ సినిమాలను విరగబడి చూసేటంత అయోమయ స్దితిలో అయితే జనం లేరు. ముఖ్యంగా హర్రర్ సినిమాల్లో కూడా నావెల్టీ, కుదిరితే కామెడీ అడుగుతున్నారు.

అలాంటి మిక్సింగ్ కు కాస్త స్టార్ వెహికల్ జోడించి ఇస్తే మహదానందంగా కళ్ళకు అద్దుకుంటారు. అవేమీ లేకుండా కేవలం భయపెడతాం..ధియోటరకు వచ్చేయండి అంటే అంత సీన్ లేదు అని తేల్చి చెప్పేస్తున్నారు.

ఈ నేపధ్యంలో . 'కన్నడ'లో 'మమ్మీ'గా రూపొందిన ఓ చిత్రం మన ముందుకు 'చిన్నారి' టైటిల్ తో వచ్చింది. మరి ఇందులో ఏమన్నా మనం భయపడే అంశాలు ఉన్నాయా..లేక జనాలు ధియోటర్ కు రాక డిస్ట్ర్రిబ్యూటర్స్ భయపడే పరిస్దితి ఉందా? భయపడితే ఏ స్దాయిలో ఎలా భయపెట్టారు? మన తెలుగు హర్రర్ ల కన్నా ఏమన్నా అడ్వాన్సెడ్ గా కథ.. కథనం ఉన్నాయా ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏంటి..వంటి విషయాల కోసం...రివ్యూలోకి వెళ్లాల్సిందే.

జన సంచారం లేని చోటే..

జన సంచారం లేని చోటే..

మొదట ఈ చిత్రం కథని పరిశీలస్తే...అన్ని దెయ్యం సినిమాల్లో లాగానే... జనసంచారం ఏ మాత్రం లేని ఓ తీర ప్రాంతం(గోవా)లో.. కొండల మధ్యన ఓ విలాసవంతమైన విల్లా. తన భర్త చివరి కోరిక మేరకు ఆ విల్లాలో నివాసం ఉండడానికి తన నాలుగేళ్ల కూతురు క్రియ (యువీన)తో అక్కడికి వస్తుంది ప్రియ (ప్రియాంక).

బొమ్మతో ప్రెండ్షిప్

బొమ్మతో ప్రెండ్షిప్

అలాగే దెయ్యం సినిమాలకు ఆలవాలమైన పెద్దగా లంకంత ఇంట్లో నలుగురే ఉంటూంటారు. నాలుగేళ్ల పిల్ల క్రియకు ఆడుకొనేందుకు అక్కడ ఎవరూ ఉండరు. దాంతో ఆ ఇంట్లోని స్టోర్‌ రూమ్‌లో ఉన్న ఓ బొమ్మతో స్నేహం చేస్తుంటుంది క్రియ.

బొమ్మలో దెయ్యం...

బొమ్మలో దెయ్యం...

స్టోర్‌ రూమ్‌ నుంచి ఆ బొమ్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పటి నుంచి ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. క్రియ కూడా.. బొమ్మని బొమ్మలా చూడదు. ఓ స్నేహితురాలిగా భావిస్తుంటుంది. ‘అమ్మ నేను దెయ్యాన్ని చూశాను' అని తల్లితో చెబుతుంటుంది.

క్రియతోనే ఫ్రెండ్షిప్..

క్రియతోనే ఫ్రెండ్షిప్..

ఆ బొమ్మలో ఓ ఆత్మ ఉంది. అది క్రియతో స్నేహం చేస్తూ.. ఇంట్లో వాళ్లని ఓ ఆట ఆడించేస్తుంటుంది. మరి ఆ ఆత్మ ఎవరిది? క్రియతోనే ఎందుకు స్నేహం చేస్తోంది? అనే విషయాల్ని తెరపై చూడాల్సిందే. ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా.

కొత్త తరహా కాదు

కొత్త తరహా కాదు

నిజానికి దర్శకుడు పాత కథని ఎంచుకున్నాడు. ఇలాంటి కథలు చాలా తెలుగులో చూసేసారు మనవాళ్లు. అయితే హారర్‌ చిత్రాల్లో కథతో పనేంటంటే చెప్పలేం. అదే దర్శకుడు భావించినట్లున్నాడు. కేవలం కొన్ని భయపెట్టే సన్నివేశాలు కొన్ని పోగుచేసుకున్నాడు. తన దగ్గర ఉన్న కథని, కొన్ని సీన్స్ తో ఆసక్తిగా చెప్పేందుకు ప్రయత్నించింది ‘చిన్నారి' డైరక్టర్.

అదే ప్లస్ పాయింట్

అదే ప్లస్ పాయింట్

ఈ చిత్రం కు ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే...కథని ప్రారంభించిన విధానం. సోది, నస లేకుండా నేరుగా పాయింట్‌లోకి వెళ్లిపోయాడు డైరక్టర్. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌ ని కరెక్ట్ టైమింగ్ చూసుకనే మొదలెట్టారు. మెల్లిమెల్లిగా హారర్‌ని డోసేజ్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాడు.

విశ్రాంతికి ముందు

విశ్రాంతికి ముందు

ఇంటర్వెల్ కు ముందు ఏకంగా పది నిమిషాల పెద్ద సీన్ ఉంది. డైరక్టర్ తన పనితనం అంతా అక్కడ చూపించాడు. ఆ సీన్ లో భయపెట్టాడు ఆ సీన్ స్పెషాలిటీ ఏమిటంటే.. దెయ్యాన్ని ఏమాత్రం చూపించకుండా...కేవలం తలుపు చప్పుళ్లతోనే.. ఏదో జరుగుతోందన్న భయం కల్పించాడు దర్శకుడు.

తేలిపోయింది

తేలిపోయింది

ఇంటర్వెల్ కు ముందు పది నిమిషాలూ ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాల్ని అమాంతం పెంచేసాయనంటంలో సందేహం లేదు.అలాగే కథ పై చాలా డౌట్స్ వచ్చేలా చేసి,ఇంట్రవెల్ లో ఆలోచనలో పడేసాయి. అయితే సెంకడాఫ్ మొదట్లోనే ప్రేక్షకులకు ఫస్టాఫ్ లో వచ్చిన డౌట్స్ కు చెప్పిన సమాధానాలు తేలిపోయినట్లుగా కనిపిస్తాయి.

విసుగెత్తించింది

విసుగెత్తించింది

సెకండాఫ్ అంతా క్రియ ఆడుకుంటున్న బొమ్మలోకి ఆత్మ ఎందుకు వచ్చింది? అనే పాయింట్‌ మీద సుదీర్గంగా సాగుతుంది. నిజానికి పెద్దగా కథ లేకపోవటంతో అది సాగిన ఫీలింగ్ వచ్చింది. కన్నడ వాళ్లకు అంత విసిదంగా చూడటం ఇష్టమేమో కానీ మనవాళ్లకు సింపుల్ అర్దమైన విషయాన్ని సమయం కోసం సాగతీస్తే భలే విసుగ్గా అనిపిస్తుంది. దాంతో ఆ ఎపిసోడ్ అంతా చిరాకు పట్టించింది. దీన్ని ట్రిమ్ చేస్తే బాగుండేది.

మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు

మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు

డైరక్టర్ తెలివైన వాడే. తను సాగతీసిన సన్నివేశాలకు తగినట్లుగా క్లైమాక్స్ లో భయపెట్టి , హర్రర్ అంటే ఇదీ అని చూపించాడు. కథ ని పూర్తిగా ట్రాక్ లోకి తీసుకువచ్చి ముగించాడు. దాంతో మనకు అప్పటిదాకా ఉన్న విసుగు మొత్తం పోతుంది. అయితే విసుగు సమయంలో జనం బయిటకు వెళ్లిపోతే చేసేదేమీ లేదు.

ఎవరెలా చేసారు

ఎవరెలా చేసారు

ఈ సినిమా అంతా రెండు పాత్రల చుట్టూనే సాగుతుంది. ముఖ్యంగా ప్రియాంక నటన ఆకట్టుకొంది. చిన్నారి క్రియగా నటించిన పాప.. ముద్దుముద్దుగా ఉంది. తన నటన కూడా అత్యంత సహజంగా అనిపించింది. మధుసూధన్‌ నటన బాగుంది. మిగిలిన వాళ్లంతా ఓకే.

అదే ప్రాణం

అదే ప్రాణం

ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపూ చాలా సార్లు భయపెట్టినా, ఉలిక్కిపడినా అంతా మ్యూజిక్ డైరక్టర్ ప్రతిభే. అలాగే డైరక్టర్ రొటీన్ గా కొన్ని సీన్స్ పేర్చుకు్నా భయపెట్టే టెక్నిక్‌ కూడా కాస్త కొత్తగా డిజైన్ చేసుకున్నాడు.

వీళ్లే టీమ్

వీళ్లే టీమ్

సినిమా పేరు: చిన్నారి
నటీనటులు: ప్రియాంక ఉపేంద్ర, యువీన పార్థవి, మధుసూధన్, ఐశ్వర్య, సందీప్, శ్రీధర్‌ తదితరులు
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌
ఛాయాగ్రహణం: హెచ్‌సి వేణు
నిర్మాత: కె.రవికుమార్‌
రచన - దర్శకత్వం: లోహిత్‌
విడుదల తేదీ: 16-12-2016

ఫైనల్ గా ఈ సినిమా సెకండాఫ్ లో కొన్ని సాగే సీన్స్ ట్రిమ్ చేసి, మరింత పబ్లిసిటీ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాసం ఉంది. హర్రర్ అభిమానులకు ఈ సినిమా అద్బుతం అని చెప్పలేం కానీ మంచి కాలక్షేపమే. ముఖ్యంగా సినిమాలో అనవసరమైన కామెడీ ట్రాక్ లు, ఐటం సాంగ్ లు వంటివి పెట్టకుండా డైరక్టర్ బ్రతికించాడు.

English summary
Young director Lohith H's debut film Chinnari (Kannada Mummy) made promises of good, old-fashioned horror. And what he has delivered with the film is just that. There is no unnecessary comedy, no extra frills, just frights and chills that keep the viewers glued with continuous twists in the plot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu