For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  3.0/5

  " నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఏడ్చే రోజు వస్తుంది" అంటూ చిరంజీవి తన రియల్ లైఫ్ టచ్ డైలాగ్స్ తో...వెండితెరపైకి దూసుకువచ్చేసారు. దాదాపు తొమిదిన్నర సంవత్సరాల తర్వాత చిరంజీవి తిరిగి మేకప్ వేసుకుని మెగాస్టార్ గా మరోసారి విశ్వరూపం చూపించేయటానికి విచ్చేసారు. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ తన అభిమానులకు ఆనందం కలిగించేలా సామాజిక సందేశంతో కూడిన మాస్ మసాలా కథని తీసుకుని కుమ్ముడు అంటూ రిలీజ్ కు ముందే ట్రైలర్స్,సాంగ్స్ తో కుమ్మేసి హైప్ క్రియేట్ చేసేసారు.

  తమిళ చిత్రం 'కత్తి'కి రీమేక్‌గా మన ముందుకొచ్చినా...రామ్‌చరణ్‌ నిర్మాతగా అందిస్తోన్న తొలి సినిమా కావటం, వినాయిక్, చిరు కాంబో రిపీట్ చేయటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. చాలా కాలం తర్వాత వస్తున్న తమ అన్నయ్య చిరు చిత్రం కావటం మెగాభిమానులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు అయ్యింది.

  In Pics : ఖైదీ NO:150 ప్రీరిలీజ్ ఫంక్షన్

  కానీ అదే సమయంలో ఎంతో ఘనంగా సాగుతున్న చిరు రీ ఎంట్రీకి... రీమేకే ని ఎంచుకోవాలా అనే విమర్శలూ అంతటా వినపడ్డాయి. హీరో చిరంజీవి,దర్శకుడు వినాయిక్ తనదైన శైలిలో వాటిని తిప్పి కొట్టారు. అయితే నిజంగానే ఆయన రీమేక్ సినిమాతో రావటం... రీ ఎంట్రీకి ఫెరఫెక్ట్ ఏప్టా... ఏముంది ఈ సినిమాలో ఆయన్ని అంతగా ఆకర్షించిన అంశం, సినిమా కథ, హైలెట్స్ ఏమిటి, మైనస్ లు ఉన్నాయా, ముఖ్యంగా చిరంజీవిలో అప్పటి మెరుపు, ఊపు ఉన్నాయా ..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

  కత్తి శీను పారిపోయి..

  కోల్‌కతా సెంట్రల్‌జైల్‌లో ఉన్న కత్తి శీను(దొంగ పాత్రలో చిరంజీవి) అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కి వస్తాడు. (జైల్లో చిరంజీవి ఇంట్రడక్షన్ అదిరింది).అక్కడి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లిపోవాలని స్కెచ్ వేసుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో ... ల‌క్ష్మి (కాజల్)ని చూస్తాడు. లవ్ ఎట్ పస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోతాడు. తను ప్రేమించిన అమ్మాయి లక్ష్మి కోసం ఆగిపోతాడు.

  రెండో చిరు ఎంట్రీ

  తన దిల్‌కా దడ్కన్‌ కోసం విదేశం వెళ్లకుండా వెనక్కి వచ్చేసిన కత్తి శీను. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని హత్య చేయబోవడాన్ని చూస్తాడు. అప్పుడే అచ్చం తనలాగే ఉన్న వ్యక్తి శీను కంటపడతాడు. అతడే శంకర్‌ (చిరంజీవి ద్విపాత్రాభినయం). అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలాగే ఉన్న శంకర్‌ని పోలీసులు దొంగ అనుకునేలా చేసి, వాళ్లకు పట్టిస్తాడు కత్తిశీను.

  రైతు నాయకుడుతో

  శంకర్ ఎవరంటే.. ఓ సోషల్ యాక్టివిస్ట్. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు అని తెలుస్తుంది. మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు.

  విలన్ తో హీరో బేరం

  మరో ప్రక్క విలన్ ఎంట్రీ...ఓ ఎమ్ ఎన్ సి కంపెనీ ఓనర్ అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో కూల్ డ్రింక్స్ కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా భావించి.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి ఓకే అంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను.

  కత్తిలాంటి నిర్ణయం

  అయితే శంక‌ర్‌కు సన్మాన కార్యక్రమంతో.. అతడి ఎవరు ఏంటి అనే విషయాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా ఆలోచిస్తున్నాడు.. తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. విలన్ అగర్వాల్ కుట్ర,దాని వల్ల అన్నదాతలకు జరుగుతున్న నష్టం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు.

  ఆ క్రమంలో ..

  రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య యద్దంమొదలవుతుంది.

  లవ్ స్టోరీ ఏమైంది

  విలన్ అగర్వాల్ కార్పోరేట్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన స్కెచ్ ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల లవ్ స్టోరీ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.

  సామాజికం విత్ మాస్ మసాలా

  ఓ పక్క ప్రేమ, మరోపక్క చకచకా సాగే మాస్‌ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. చిరంజీవి ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటారు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే ‘రత్తాలూ...'. ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు కుర్రకారుని హుషారెక్కిస్తాయి. లుక్‌ పరంగా చిరంజీవి... ఒకప్పటిలానే కనిపించి ‘ఆహా పదేళ్ల తరవాత కూడా అదే ఫిజిక్‌తో కనిపిస్తున్నారే' అని ఆశ్చర్యపోయేలా చేస్తారు. డ్యాన్సుల పరంగానూ ఒకప్పటి స్పీడే ఇప్పుడూ కనిపిస్తుంది.

  ద్వితీయార్దమే కాస్తంత

  ఫస్టాఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయిన ఈ చిత్రం సెకండాఫ్ కు వచ్చేసరికి కాస్తంతం నెమ్మిదించిందనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ రొటీన్ గా ఉండి, లెంగ్తీగా ఉన్న ఫీల్ వచ్చింది. అఫ్ కోర్స్ నిజానికి సెంకడాఫ్ లోనే వాస్తవానికి కథలోకి వచ్చారు. కానీ సామాజిక సమస్య చుట్టూ అల్లిన కథనం కావటంతో కాస్త డ్రైగా నిపించింది. ఫస్టాఫ్ లాగే సెకండాఫ్ ఉంటే సినిమా భాక్స్ లు బ్రద్దలయ్యేవనటంలో సందేహం లేదు

  ఏం చేస్తున్నాం అనేది కాదు

  ఈ సినిమా గురించి మొదలైన రీమేక్ చర్చకు ఈ సినిమా కంక్లూజన్ ఇస్తుంది. రీమేక్ చేస్తున్నారా,స్ట్రైయిట్ కథ చేస్తున్నారా అనేది కాదు ఇక్కడ ప్రశ్న..చిరంజీవి నటించారా లేదా అన్నది. దాంతో అభిమానులంతా చాలా ఎక్సైట్ మెంట్ గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. చిరంజీవి ఒక్కరు చాలు ఈ సినిమా ఎలా ఉన్నా చూడటానికి , ఎందుకంటే ఇది ఆయన రీలాంచ్ చిత్రం.

  నేటివిటీతో..

  చిరంజీవి ఇంతకన్నా మంచి కమబ్యాక్ సినిమా ఉండబోదు అన్న రీతిలో తెరపై విజృంభించారు. సోషల్ మెసేజ్‌తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా వీవీ వినాయక్ ఖైదీ నంబర్ 150ని రూపొందించారు. ఒరిజనల్ తమిళ సినిమా కత్తిలో ఉన్న కీలక అంశాలను మిస్ అవ్వకుండా... వాటిని నేటివిటి అద్దుకుంటూ..మెగాభిమానులు మెచ్చుకునేలా..మరింత కామెడీని, మసాలాని అద్దే ప్రయత్నం చేసారు. కొన్ని చోట్లు అధి ఇబ్బంది పెట్టినా చాలా చోట్ల సినిమాకు ప్లస్ అయ్యింది.

  అది దర్శక,నిర్మాతల తప్పే

  సినిమాలో వీక్ గా ఉన్న ఎలిమెంట్ ఏమీటీ అంటే సాధారణ ప్రేక్షకుడు కూడా చెప్పగలిగేది కూడా ఒకటే..విలన్ ట్రాక్. మెగాస్టార్ స్దాయిని కూడా దాటిపోయిన ఇమేజ్ తో వెండితెరపై చిరంజీవి చెలరేగిపోతూంటే ఆ స్దాయికి తగ్గట్లుగా ఆయన్ను ఎదుర్కొని నిలిచే పాత్ర లేకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. కార్పోరేట్ విలన్ అని విలనిజం ఎక్కువ చూపకూడదనుకున్నారో ఏమీ కానీ ఆ పాత్ర తన స్దాయికి తగినట్లు లేదు. అది ఆ పాత్ర వేసిన ఆరిస్ట్ ప్లాబ్లం కాదు. చిరంజీవి స్దాయి విలన్ ని వెతకకపోవటం దర్శక,నిర్మాతల తప్పే అని చెప్పాలి.

  ఎందుకనో వదిలేసారు

  అలాగే విలన్ కు , హీరో కు మధ్య సరైన కాంప్లిక్ట్ సీన్స్ కనపడవు. నిజానికి ఈ చిత్రానికి మూలమైన కత్తిలోనూ ఈ సమస్య ఉంది. అదే సమస్యను ఇక్కడ పరిష్కరించి, ఆ కాంప్లిక్స్ ని బాగా పెంచి హైలెట్ చేస్తారనుకుంటే దానిపై రైటర్స్ ఎక్కువ దృష్టి పెట్టలేదు. సినిమాలో చేసిన మార్పులు అన్ని మాస్, కామెడీ ఎలిమెంట్స్ పట్ల పెట్టినవే కావటం చెప్పుకోదగ్గ అశం.

  సొల్యూషన్ ఏది

  సినిమాలో రైతుల సమస్యలను బాగానే ఎలివేట్ చేసారు. కానీ క్లైమా్స్ లో ఇచ్చిన పరిష్కారం మాత్రం ఆకట్టుకోదు. దాంతో సినిమా కొద్దిగా తేలిపోయినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ పూర్తిగా సీరియస్ గా నడుస్తూ క్లైమాక్స్ కు వచ్చేసరికి డౌన్ అవుతుంది.

  చిరు సూపర్ హిట్ గుర్తుకు

  మనకు ఈ సినిమా చూస్తూంటే గతంలో చిరంజీవి హీరోగా వచ్చి విజయవంతమైన రక్త సింధూరం చిత్రం గుర్తుకు రావటం ఖాయం. అందులోనూ చిరంజీవి ద్విపాత్రాభియనంతో కనిపిస్తారు. ఒక పాత్ర ఎంటర్టైన్మెంట్ తో నడిస్తే మరొకటి...సామాజిక అంశంతో లీడ్ చేస్తుంది. ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్ళటం కూడా ఆ సినిమాలో గమనించవచ్చు.

  చిరు స్టామినా ఇది

  ఈ సినిమా గురించి చెప్పాలంటే ...చిరు గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాని మనం కేవలం చిరు కోసమే చూస్తాం. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి చేసిన ఈ సినిమా ఏ విధంగా మనను ఆకట్టుకుంది..అదీ చిరు కమ్ బ్యాక్ ఏంగిల్ లో అనే విషయం మాత్రమే పరిశీలిస్తాం. ఆ మేరకు చిరంజీవి కేక పెట్టించారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకూ చిరంజీవి ఎక్కడా కొంచెం కూడా తగ్గలేదు. క్రేజీ డైలాగ్స్, స్టన్నింగ్ డాన్స్ మూవ్ మెంట్స్ తో దున్ని పారేసారు. మెగా ఫ్యాన్స్ ఇది పండగ ట్రీట్.

  హీరోయిన్ ఎలా..

  నిజానికి చిరంజీవి వయస్సు ఉన్న హీరోలకు హీరోయిన్స్ కొరత వస్తోంది. తమ వయస్సు కు దగ్గర వాళ్లను పెట్టుకుందామంటే ముసలివాళ్లలా కనపడతారు. పోనీ చిన్నవాళ్లను పెట్టుకుంటే కూతుళ్లు లాగ కనిపిస్తారు. దాంతో హీరోయిన్ విషయంలో ఎవరిని తీసుకోవాలని కన్ఫూజన్ నడుస్తుంది. అయితే కాజల్ ...ఫెరఫెక్ట్ గా చిరు కు మ్యాచ్ అయ్యింది . చిరు కుమారుడుతో చేసిన కాజల్ ఇలా..చిరుకి జోడిగా మెప్పించటం మామూలు విషయం కాదు.

  డవలప్ చేసారు

  మన తెలుగు ఆడియన్స్ టేస్ట్ వేరు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల విషయంలో వాళ్లు డిఫెరెంట్ గా ఉంటూ వస్తున్నారు. అది వినాయిక్ బాగా అబ్జర్వ్ చేసారు. అందుకే సినిమాలో ఒరిజనల్ కత్తి లో లేని కొత్త సీన్స్ కామెడీ యాంగిల్లో డవలప్ చేసి కలిపారు. అదే సినిమాకు ప్లస్ అయ్యింది. కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనం.

  దట్ క్రెడిట్ గోస్ టు

  ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడిగా వి.వి. వినాయక్‌ కే చెందుతుంది. చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. సాయి మాధవ్ బుర్రా ..రాసిన డైలాగులు..మాస్ కు కూడా నచ్చేటట్లు రాసారు. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదిరిపోయాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

  ఇది సినిమా మొత్తానికే..

  సినిమాలో హైలెట్స్ లో అమ్మడు సాంగ్ గురించి, విలేజర్స్ ని ఉద్దేశించి చిరంజీవి ఇచ్చే స్పీచ్ గురించి చెప్పుకోవాలి. ఈ రెండూ సినిమాను మాస్, సామాజిక యాంగిల్ రెండింటిలోనూ పూర్తి న్యాయం చేసాయి. ఇది ఫ్యాన్స్ కు పక్కా పైసా వసూల్ సినిమా. రెగ్యులర్ ఆడియన్స్ కు ఓ రొటీన్ కమర్షియల్ సినిమా అంతే.

  పాటలెలా ఉన్నాయంటే..

  సినిమా హైలెట్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ పాటలతో హోరెత్తిస్తున్నారు. ‘రత్తాలూ..' ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు ధియోటర్ ని దద్దరిల్లేలా చేస్తున్నాయి. ‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ' కుర్రకారుతో ఈలలేయిస్తోంది. చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్‌నీ బాగా చిత్రీకరించారు. ‘అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ' పాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరిసి మురిస్తాడు. సాంగ్ లొకేషన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు.

  సినిమాకు పనిచేసింది వీళ్లే..

  నటీనటులు: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌ లక్ష్మి, తరుణ్‌ అరోరా, బ్రహ్మనందం, సునీల్‌, అలీ వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు.
  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
  కాస్ట్యూమ్స్‌: కొణిదెల సుస్మిత
  ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు
  మాటలు: పరుచూరి బ్రదర్స్‌
  నిర్మాతలు: రామ్‌చరణ్‌
  దర్శకత్వం: వి.వి.వినాయక్‌
  విడుదల తేది: 11.01.2017

  ధియోటర్ల వద్ద ఉన్నక్యూలు,హంగామా చూస్తుంటేనే మనకు సినిమా రేంజి ఏంటి.. అందరూ ఎంతలా బాస్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్నారు అనేది అర్దం అవుతుంది. ఈ సినిమాని క్రిటిక్స్ రివ్యూ చూసి, రేటింగ్ ఎంతో గమనించి వెళ్లతారని నేను అనుకోను. చిరంజీవి తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత ఎలా చేసాడు, ఏం చేసాడు, ఎలా ఉన్నాడు..అనే విషయం తెలుసుకోవాటనికి సినీ ప్రేమికులు ఆసక్తి చూపితే...మెగాభిమానులుకు ఇది చిరంజీవి సినిమా అనే ఒక్క మాట చాలు... ధియోటర్ కు వెళ్లి చూడటానికి. ఈ నేపధ్యంలో ఈ క్రేజ్ ఏమేరకు క్యాష్ అవుతుందనే విషయం .....పైరసీ ప్రింట్ టోరెంట్స్ లో రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

  English summary
  With the highly anticipated and much talked about comeback of Megastar Chiranjeevi, Khaidi No 150 released today, the buzz surrounding the movie is huge. Directed by VV Vinayak, produced by Ram Charan under the banner of Konidela Production Company and features Kajal Aggarwal in the lead role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more