»   » సినిమాలో సినిమా చూపించాడు... (‘దర్శకుడు’ రివ్యూ)

సినిమాలో సినిమా చూపించాడు... (‘దర్శకుడు’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం 'కుమారి 21 ఎఫ్' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మించిన మరో ప్రేమకథా చిత్రం 'దర్శకుడు'.

ఈ సినిమాకు 'దర్శకుడు' అనే టైటిల్ పెట్టడంతోనే సుకుమార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రేమకు, వృత్తి పట్ల ఉన్న తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథే ఈ చిత్రం. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది సినిమా అసలు కథ. మరి సినిమా ఏ మేరకు ప్రేక్షకులకు ఎక్కుతుందో రివ్యూలో చూద్దాం.


సినిమా పిచ్చోడి కథ

సినిమా పిచ్చోడి కథ

కథ విషయానికొస్తే.... మహేష్(అశోక్)కు చిన్నతనం నుండి సినిమా అంటే పిచ్చి. ఆ మాత్రం పిచ్చి ఉంటేనే దర్శకుడు అవుతావు ప్రోసీడ్ అంటూ తండ్రి ప్రోత్సాహం కూడా తోడవటంతో అదే పాషన్‌తో పెరిగిన అశోక్ ప్రతి విషయాన్ని సినిమా కోణంలోనే ఆలోచిస్తాడు. తాను ఏ పని చేసినా సినిమా కోసమే. జీవితంలో జరిగే సంఘటనలు కూడా తన సినిమాకు ఉపయోగపడతాయా? అని ఆలోచించే టైపు.


దర్శకుడు ప్రేమలో పడితే...

దర్శకుడు ప్రేమలో పడితే...

సినిమా పట్ల తనకున్న పాషన్‌ ఏమిటో నిరూపించుకుని మొత్తానికి ఓ నిర్మాతను ఒప్పించి సినిమా అవకాశం దక్కించుకున్న మహేష్ అనుకోకుండా ట్రైన్ జర్నీలో పరిచయం అయిన నమ్రత(ఇషా)తో ప్రేమలో పడతాడు. తన జీవితంలో మొదటి ప్రిఫరెన్స్ సినిమా అయితే, సెకండ్ ప్రిఫరెన్స్ నమ్రత అనేంతగా ఆమెను ప్రేమిస్తాడు.


సినిమానా? ప్రియురాలా? తేల్చుకోలేక

సినిమానా? ప్రియురాలా? తేల్చుకోలేక

నమ్రతతో ప్రేమలో పడిన మహేష్‌కు ఒకానొక సందర్భంలో సినిమానా? ప్రియురాలా? అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రెండింటి మధ్య నలిగి పోయిన మహేష్ చివరకు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.


ఎవరు ఎలా చేశారు?

ఎవరు ఎలా చేశారు?

హీరోగా తొలి పరిచయం అయినప్పటికీ అశోక్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. లుక్స్ పరంగా కూడా ఫర్వాలేదు. హీరోయిన్ ఇషా అందంగా కనిపించడంతో పాటు నేచురల్‌గా నటించింది. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.


కాన్సెప్టు కొత్తగా ఉంది, కానీ...

కాన్సెప్టు కొత్తగా ఉంది, కానీ...

‘దర్శుకుడు' కాన్సెప్టు చాలా కొత్తగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం రాసుకున్న కాన్సెప్టును ఉన్నది ఉన్నట్లుగా దించేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేరకు ఎక్కింది, వాళ్లకు నచ్చిందా? లేదా? అనే కోణంలో ఆలోచిస్తే మాత్రం కాస్త తేడా కొట్టిందనే ఆలోచన కలుగుతుంది.


తేడా కొట్టింది అక్కడే

తేడా కొట్టింది అక్కడే

సినిమా కాన్సెప్టు కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. స్లో నేరేషన్, చాలా చోట్ల సీన్లు రిపీటైన ఫీలింగ్ రావడంతో కాస్త బోర్ అనిపిస్తుంది. సినిమాలో రెండు మూడు చోట్ల ట్విస్టులున్నా ప్రేక్షకులను అంత ఎగ్జైట్ చేయలేక పోయాయి.


అదే మిస్సయింది

అదే మిస్సయింది

సినిమాలో ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వడం కూడా మైనస్సే. ఎంటర్టెన్మెంట్ అంటే మధ్య మధ్యలో ప్రక్షకులను నవ్వించడానికి కామెడీ కావాలని ఇరికించడం అనే ఉద్దేశ్యం కాదు. ప్రేక్షకుడు బోర్ ఫీలవ్వకుండా, ప్రతి సీనూ ఎంజాయ్ చేసేలా, ఆస్వాదించేలా సినిమా రన్ చేయడమే. ఇది ఈ సినిమాలో మిస్సయిందనే చెప్పాలి.
ఏది బావుంది, ఏది బాగోలేదు

ఏది బావుంది, ఏది బాగోలేదు

సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే... హీరో అశోక్ సినిమాకు మైనస్ కాదు, అలా అని ప్లస్సూ కాదు. తన పాత్రకు న్యాయం చేశాడంతే. హీరోయిన్ ఈషా ప్లస్ ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రపీ ప్లస్, సాయి కార్తీక్ సంగీతం జస్ట్ ఓకే. డైలాగులు బావున్నాయి.


దర్శకుడు హరిప్రసాద్ జక్కా

దర్శకుడు హరిప్రసాద్ జక్కా

సినిమాలో చెప్పినట్లు డైరెక్షన్ అంటే 20 శాతం క్రియేటివిటీ, 80 శాతం మేనేజ్మెంట్. ఈ కోణంలో చూస్తే హరిప్రసాద్ జక్కాకు పాస్ మార్కులే వేయొచ్చు.


కొత్త దర్శకులను ఇన్ స్పైర్ చేసే పాయింట్స్

కొత్త దర్శకులను ఇన్ స్పైర్ చేసే పాయింట్స్

పై విషయాలు అన్నీ పక్కన పెడితే..... దర్శకులు కావాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. దర్శకుడు కావాలంటే ఎలాంటి తపన ఉండాలి అనేది బాగా చూపించారు. దర్శకుడు అనే వాడు పేరు కోసం కాదు, సినిమా కోసం పని చేయాలి అనే పాయింట్ సూపర్‌గా చెప్పారు. నిర్మాత వల్లనో, లేక మరెవరి వల్లనో సినిమా పాడయ్యే పరిస్థితి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కావద్దనే సీన్లో థియేటర్లో ప్రేక్షకుల నుండి కూడా క్లాప్స్, విజిల్స్ వచ్చాయి.


ఫైనల్‌ వర్డ్

ఫైనల్‌ వర్డ్

సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడికి ‘దర్శకుడు' నిజంగానే సినిమా చూపించాడు. అది ఎలాంటి సినిమానో పై పది పాయింట్లలో మీకు అర్థమైందని ఆశిస్తున్నాం!


English summary
Darshakudu movie review and rating. Darsakudu is a 2017 Indian Telugu film written and directed by Jakka Hari Prasad. Produced by BNCSP Vijaya Kumar, Thomas Reddy Aduri and Ravi Chandra Satti, it features Ashok Bandreddi, Noel Sean, Eesha Rebba and Pujita Ponnada in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu