For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఓ దేవదా...

  By Staff
  |

  Devadasu
  -జోశ్యుల సూర్యప్రకాష్‌
  సినిమా: దేవదాసు‌
  విడుదల తేదీ: 11-01-2006‌
  నటీనటులు: రామ్‌, ఇలియానా, సాహెజీ షిండే, వేణుమాధవ్‌,‌
  ఎం. ఎస్‌. నారాయణ, రమాప్రభ, శ్రియ, తదితరులు‌
  మాటలు: చింతపల్లి రమణ‌
  పాటలు: చంద్రబోస్‌‌
  ఫోటోగ్రఫీ: భరణి కెదరన్‌‌
  సంగీతం: చక్రి‌
  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: వై.వి.యస్‌. చౌదరి‌
  సమర్పణ: యలమంచిలి గీత‌

  యువతరంలో ప్రేమకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అలనాటి అద్భుతం దేవదాసు చిత్రం టైటిల్‌ను మాత్రమే తీసుకొని అల్లిన పాటల పందిరి ఈ సరికొత్త దేవదాసు చిత్రం. శరత్‌ దేవదాసు పార్వతిని దక్కించుకోలేని నిస్సహాయతలో ప్రాణత్యాగం దాకా తెచ్చుకుంటే ఈ ఆధునిక దేవదాసు పోరాడి మరీ ప్రేమలో విజయం సాధిస్తాడు. పాత దేవదాసులో ఉన్న ఫీల్‌ ఈ చిత్రంలో కనబడకపోయినా ఎత్తులు పైయెత్తులు, పాటలు, ఫైట్స్‌తో కథనం కడ వరకు పరుగెత్తుతుంది. పాటలు ప్రేక్షకులకు నచ్చితే కొత్త దేవదాసు ఓ మాదిరి విజయం సాధించవచ్చు.‌

  ఫస్టాఫ్‌ ఇండియాలోనూ, సెకండాఫ్‌ అమెరికాలోనూ సాగే చిత్రం, వాయిస్‌ ఓవర్‌ పరిచయంతో మొదలవుతుంది. అమెరికా వెళ్లి అక్కడ సెనెటర్‌గా ఎదిగి, సెటిల్‌ అయిన ప్రవాస భారతీయుడు లక్ష్మీనారాయణ (సాహిజీ షిండే), అతని ఏకైక గారాల పట్టి భానుమతి ( ఇలియానా). సంగీతంపై మక్కువతో (అక్కడ నేర్పేవాళ్లు లేక) తన బామ్మతో (రమాప్రభతో) సహా ఇండియా వచ్చి లయోలా కాలేజీలో చేరుతుంది. అక్కడే వేరే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న దేవదాసు (రామ్‌) అనే అనాథ కళ్లలో పడుతుంది. తాను ప్రేమలో పడ్డానని తెలియగానే ఆమెను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. మరో పక్క ఆమెను పొందాలనే ప్రయత్నం చేస్తున్న బాబీ అనే మరో విద్యార్థి చేష్టలతో ఆమె దేవదాసుకు దగ్గరవుతుంది. ఇండియాలో ఉన్న 20 రోజుల్లో ప్రేమలో పీకలోతు మునుగుతుంది. ఈ విషయం గమనించిన ఆమె తండ్రి హఠాత్తుగా అమెరికా ప్రయాణం పెడతాడు. పనిలో పనిగా దేవదాసుకు అమెరికా వచ్చి తన కూతురును తీసుకెళ్లుమని చాలెంజి విసురుతాడు. జేబులో రూపాయి కూడా లేని దేవదాసు ఎలా అమెరికా వెళ్లి ఆమెను గెలుచుకున్నాడనేది మిగతా కథ.‌

  నిజానికి ఇది లోకేషన్‌ మార్చిన పాత (పేదబ్బాయి, డబ్బున్న అమ్మాయి) ప్రేమ కథ. ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా వెళ్లడం 'ఒకరికొకరు' నాటి సంగతే గానీ అక్కడ ఎదురయ్యే సంఘటనలు కొత్తగా ఉంటాయి. ఇంటర్వెల్‌ వరకు పాటలతో నడిచిన కథనం సెకండాఫ్‌లో ఫైట్స్‌ను జోడీగా చేసుకుంటుంది. టైటిల్‌ చూసి సాఫీగా ఫీల్‌తో నడిచే ప్రేమకథ అని అనుకుని వెళ్లినవారికి ఇది కొంచెం కొరుకుడు పడని విషయమే. పాత దేవదాసును మనసనులో పెట్టుకుని వెళ్తే మరీ కష్టం.‌

  స్క్రీన్‌ప్లే క్లాసిక్‌ నెరేషన్‌లో చాలా చక్కగా వెళ్లినా అక్కడక్కడ దర్శకుడు నటించి మరీ హీరోకు సాయం చేయడం కథను పాసివ్‌గా మార్చింది. శ్రియ పాత్రను ఐటమ్‌ సాంగ్‌కే కాకుండా అమెరికా వెళ్లడానికి ప్లాంటింగ్‌గా వెళ్లడం బాగుంది. కొత్త హీరో పవన్‌ కళ్యాణ్‌ను అనుకరించినా ఎనర్జీగా నటించడం విశేషం. హీరోయిన్‌ అందాలను ఆరబోసింది. ఇది కొంత కుర్రకారుకు ఊరట. అది దర్శకుడి ప్రతిభే. చక్రి సంగీతం పాశ్చాత్య బాణీలను పదే పదే వల్లించినా 'మాయదారి బుల్లోడు మనసే లాగేసిండు' రీమిక్స్‌ పాటతో కథనానికి ఊపునిచ్చాడు. కొత్త మల్లీశ్వరి చిత్రంలో ఉన్న కుక్క సన్నివేశం ఈ సినిమాలో రిపీట్‌ కావడంతో వేణుమాధవ్‌ కామెడీ పెద్దగా పేలలేదు. కానీ కుక్క నటనను మెచ్చుకోకుండా ఉండలేం. బంగారు రాజుగా ఎం.యస్‌. నారాయణ పంచ్‌లు బాగా పేలాయి. ఇదే నిజమైన ఇండియా అంటూ హీరోయిన్‌ హీరో చూపే విజ్యువల్స్‌ బాగున్నాయి. అలాగే హీరోయిన్‌ గదిలో హీరో పడుకున్నప్పుడు ఆమెకు వచ్చిన ఫోన్‌ కాల్‌ను హీరో రిసీవ్‌ చేసుకుని మిస్‌ బిహేవ్‌ చేయడం హీరో పాత్ర ఉదాత్తతను దెబ్బ తీసింది. కాలేజీ సన్నివేశాలు కథకు సంబంధం లేకుండా సాగడం కథా లోపమే. మొదట్లో హీరోయిన్‌ శంఖం నుంచి వచ్చే శబ్దం సన్నివేశం చాలా బాగుంది. అది దర్శకుడి ప్రతిభకు మచ్చుతునక.‌

  ఏది ఏమైనా ఇలియానా చూపే అందాలు, మంచి విజ్యువల్స్‌తో కూడిన పాటలు ఈ సినిమాను నిలబెట్టవచ్చు. మిగతా సంక్రాంతి సినిమాలను బట్టి దీని విజయం స్థాయి ఆధారపడి వుంటుంది.‌

  గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more