twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫన్‌ లేని ధనలక్ష్మీ!

    By Staff
    |

    Dhana Lakshmi I Love You
    -జలపతి
    చిత్రం: ధనలక్ష్మీ..ఐలవ్వ్యూ
    నటీనటులు: నరేష్‌, ఆదిత్య, అల్లరి నరేష్‌, అంకిత, తనికెళ్ళ భరణి
    సంగీతం: చక్రి
    నిర్మాత : సత్యనారయణ
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శివనాగేశ్వరరావు

    శివనాగేశ్వరరావు కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్నవాడు. కానీ ఈ మధ్య ఆయన 'ఫామ్‌'లో లేడు. మలయాళ రీమేక్‌ చిత్రంతో మళ్ళీ ఫామ్‌ లోకి రావాలన్న ప్రయత్నం ఫలించలేదు. ప్రియదర్శన్‌ రూపొందించిన ఓ మలయాళ కామెడీ చిత్రాన్ని ధనలక్ష్మీ ..ఐ లవ్వ్యూగా తెలుగులో రీమేక్‌ చేశారు. అదే సినిమా ఆధారంగా హిందీలో రీమేక్‌ చేసిన హేరాపెరీ చాలా చక్కగా ఉంటే..ఈ చిత్రం బోర్‌ కొట్టిస్తుంది. ఆ హిందీ చిత్రంలో పరేష్‌ రావల్‌ అత్యద్భుతమైన నటన ప్రాణం. కానీ ఈ చిత్రంలో ఆ పాత్ర పోషించిన నరేష్‌ నటనాప్రదర్శనలో అంత 'దమ్ము' లేదు. నరేష్‌ తన గెటప్‌, డైలాగ్‌ డెలవరీలో వైవిధ్యం ప్రకటించినా....అతని నటనకు మాటల రచయిత చేయూతనందివ్వలేదు. ఈ చిత్రంలో ప్రధాన లోపం స్క్రీన్‌ ప్లేలో పట్టులేకపోవడం.

    దర్శకుడికి కథనాన్ని ఎలా నడిపించాలో అర్థం కాక, 'డ్రీం సాంగ్స్‌' పెట్టి(ఈ చిత్రంలో అన్నీ డ్రీం సాంగ్సే) సినిమాను ముందుకు సాగదీయాలని చూశాడు. కానీ మరీ బోర్‌ గా తయారైంది. అయితే, అల్లరి నరేష్‌, ఆదిత్యల నటన వల్ల మాత్రమే సినిమా చూడగలం. చీర కట్టుకొని కళ్ళద్దాలతో అంకిత చూడచక్కగా ఉంది. పాటల్లోనే మినీ స్కర్ట్స్‌ వేసుకొని అందాన్ని చెడగొట్టుకొంది. చక్రి సంగీతం బాగుంది. కానీ చక్రికి రీరికార్డింగ్‌ అంటే ఏమిటో తెలిస్తే బాగుండు.

    తన తండ్రి మరణంతో ఉద్యోగం తనకే వస్తుందని ఆదిత్య ఆశపడుతాడు. కానీ ఆ బ్యాంకు వాళ్ళు వేరే వ్యక్తికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. సో..ఆదిత్య పోరాటం జరుపుతూ..తాత్కలికంగా షెల్టర్‌ కోసం నరేష్‌ ఇంటికి వస్తాడు. ఆ ఇంటిలో ఆల్రెడీ అల్లరి నరేష్‌ చిల్లర పనులు చేస్తూ అద్దెకు ఉంటాడు. ఆదిత్యా ఉద్యోగాన్ని చేజిక్కించుకొన్న వ్యక్తి - అంకిత. ఆమెకు బోల్డన్ని తెలుగు సినిమా కష్టాలు. ఆమె కష్టాలకు కరిగిపోయి చివరికి ఆదిత్యా రాజీపడుతాడు. అయితే, డబ్బుల కోసం వీళ్ళంతా నానా ఇబ్బంది పడుతుండగా అనుకోకుండా ధనలక్ష్మి ఫోన్‌ తో వస్తుంది. ఆ ఫోన్‌ రిసీవ్‌ చేసుకొన్న వాళ్ళు చివరికి ఏమి చేస్తారనేది అతి పెద్ద సెకాండ్‌ హాఫ్‌ కమ్‌ క్లైమాక్స్‌.

    పాటల చిత్రీకరణలో శివనాగేశ్వరరావు వెరీ ఫూర్‌ అని ఈ చిత్రం ద్వార తెలుస్తుంది. ప్రసాద్‌ ఫోటోగ్రఫీ బాగుంది. మంచి కామెడీ సరుకు ఉన్నా, శివనాగేశ్వరరావు దాన్ని సరిగ్గా మలుచుకోలేకపోయాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X