For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పొగరు’ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: ధృవసర్జా, రష్మిక మందాన్న తదితరులు
  Director: నందన్‌కిషోర్

  కన్నడ చిత్రాలకు ఇప్పుడు తెలుగు నాట మంచి డిమాండ్ ఏర్పడింది. కేజీయఫ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత కన్నడ నాట తెరకెక్కిస్తున్న చిత్రాలన్నీ కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. అలా ఆ క్రమంలోనే పొగరు అనే సినిమా కూడా నేడు ప్రేక్షకులను పలకరించింది. ధృవ సర్జా, రష్మిక మందాన్న నటించిన ఈ మూవీపై కరాబు అనే పాటే అంచనాలను పెంచేసింది. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

   కథ..

  కథ..

  శివ (ధృవ సర్జా) ఓ ఆశ్రమంలో పెరుగుతాడు. తల్లి ఉన్నా కూడా అనాథలా పెరుగుతాడు. కాలనీ వాసుల ప్రేమతో పెరిగిన శివ వారికి అండగా నిలుచుంటాడు. తల్లిని ద్వేషిస్తూ దూరంగానే ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ప్రేమ అంటే దూరంగా ఉంటాడు శివ. అలాంటి శివ ప్రేమలో పడతాడు. ఆపదలో ఉన్న ఆ కాలనీ కోసం శివ ఎదురునిలబడతాడు.

  కథలో ట్విస్టులు..

  కథలో ట్విస్టులు..

  శివ తన తల్లిని ఎందుకు ద్వేషిస్తాడు? తల్లి ఉన్నా కూడా దూరంగా ఎందుకు పెరుగుతాడు? ప్రేమంటే శివకు ఎందుకు నచ్చదు? శివ తల్లి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటుంది? రష్మికతో తొలిచూపులోనే ప్రేమలో పడే శివ ఆ ప్రేమను నిలబెట్టుకున్నాడా? ఆ కాలనీకి వచ్చిన ఆపదలేమీటి? చివరకు శివ కథ ఎలాంటి మలుపుతిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే పొగరు.

  ఫస్టాఫ్‌ అనాలిసిస్..

  ఫస్టాఫ్‌ అనాలిసిస్..

  పొగరు సాంగ్, ట్రైలర్, ధృవ సర్జా గెటప్ ఇవన్నీ చూశాక ఇది పక్కా మాస్ సినిమా అని అందరికీ అర్థమవుతంది. ప్రథమార్థం మొత్తం శివగా మాస్ క్యారెక్టర్‌లో ధృవ సర్జా ఇరగదీస్తాడు. ఆయన ఎంట్రీ, తన గ్యాంగ్‌తో అల్లరి పనులు.. రష్మిక మందాన్నతో ప్రేమలో పడటం వంటి రొటీన్ సీన్లతో కథనం ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌లో అసలు విషయం శివకు అర్థమవుతుంది. ఇన్నాళ్లు తల్లిని దూరం పెట్టడంపై ఉన్న నిజమేంటో తెలియడంతో ప్రథమార్థం ముగుస్తుంది.

  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  ప్రథమార్థంలో ఫుల్లు మాస్ పాత్రలో అదరగొట్టేసిన ధృవ సర్జా.. సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్‌గా కనిపిస్తాడు. ద్వితీయార్థం మొత్తం తల్లి, చెల్లి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. విలన్ సంపత్ ఆట కట్టించడం, రష్మిక ప్రేమను పొందడం ఇలా తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు చూసిన ఎన్నో కథల్లానే అనిపిస్తుంది.

  నటీనటులు..

  నటీనటులు..

  పొగరు సినిమా మొత్తం ధృవ్ సర్జానే కనిపిస్తాడు. వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్సులు ఇలా అన్నింట్లోనూ ధృవ్ సర్జా దుమ్ములేపేశాడు. కామెడీ, ఎమోషనల్ ఇలా అన్ని విధాలుగానూ హీరో మెప్పిస్తాడు. అయితే రష్మికకు మాత్రం తన స్థాయికి తగ్గ పాత్ర పడలేదనే చెప్పాలి. ఇక తల్లి పాత్రలో పవిత్రా లోకేష్ సరిగ్గా సరిపోయింది. సంపత్ తన విలనిజాన్ని మరోసారిచూపించాడు. ఇక మిగిలిన పాత్రల్లో అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  పొగరు వంటి మాస్ మసాలా కథను తెలుగు తెరకు, ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఇదే ఫార్మాట్ ఇది వరకెన్నో చిత్రాలు చూసిన ఫీలింగే కనిపిస్తుంది. అయితే ధృవ్ సర్జా మాత్రం ఇందులో కొత్తగా కనిపిస్తాడు. హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించడం, మాస్‌కు నచ్చే ఎలివేషన్స్ ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ప్రథమార్థంలో ఉన్న జోరును, ఊపును అలా కంటిన్యూ చేయలేకపోయాడు. మొత్తానికి పొగరును మాస్‌కు నచ్చేలా తెరకెక్కించడంతో సక్సెస్ అయ్యాడు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  పొగరు విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ న్యాయం చేశాడు. చందన్ శెట్టి అందించిన పాటలు, కొట్టిన నేపథ్య సంగీతం బాగానే ఉంది. డైలాగ్స్ మోతమోగించేలా ఉన్నాయి. విజయ్ మిల్టన్ కెమెరాపనితనం కూడా తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు అన్నీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టే ఉంది.

  బలం, బలహీనతలు..

  బలం, బలహీనతలు..

  ప్లస్ పాయింట్స్..

  ధృవ్ సర్జా
  మాస్‌కు నచ్చే అంశాలు

  మైనస్ పాయింట్స్..
  కథలో కొత్తదనం లోపించడం
  ద్వితీయార్థం

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  చివరగా పొగరు సినిమా మాత్రం మాస్‌కు ఎక్కేలానే ఉందని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్‌లొ పొగరుకు మంచి వసూళ్లు వచ్చేలానే కనిపిస్తోంది. అయితే మాస్ ప్రేక్షకుల ఆదరణను బట్టే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కమర్షియల్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

  నటీనటులు :

  నటీనటులు :

  ధృవసర్జా, రష్మిక మందాన్న తదితరులు
  దర్శకత్వం : నందన్‌కిషోర్
  నిర్మాత : ప్రతాప్‌రాజు(తెలుగు)
  మ్యూజిక్ : చందన్‌శెట్టి
  సినిమాటోగ్రఫి : విజయ్ మిల్టన్

  English summary
  Dhruva sarja pogaru review and rating..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X