Just In
- 13 min ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 51 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దొంగరాముడు అండ్ పార్టీ
చిత్రం: దొంగరాముడు అండ్ పార్టీ
నటీనటులు: శ్రీకాంత్, లయ, కొండవలస లక్ష్మణరావు,
కృష్ణభగవాన్, జయప్రకాష్ రెడ్డి, తనికెళ్ళ, భువనేశ్వరి
సంగీతం: చక్రి
నిర్మాత: ఎం.ఎల్.కుమార్ చౌదరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ
ప్రముఖ దర్శకుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ఎన్నో లోపాలతో, తన శైలికి భిన్నంగా 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రాన్ని రూపొందించి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత రూపొందించిన దొంగరాముడు అండ్ పార్టీ చిత్రం పూర్తిగా వంశీమార్క్ చిత్రం. ఆయన ట్రేడ్ మార్క్ అయిన తొలి హాఫ్ కామెడీ, క్లైమాక్స్ లో సెంటిమెంట్, ఒక పాత్రతో తికమకగా మాట్లాడించడం, గోదావరి అందాలు..అన్నీ కలగలిసిన చిత్రం ఇది. అయితే, ఈ సినిమాలో ఆద్యంతం ఆకట్టుకునేది ఫోటోగ్రఫీ అనే చెప్పాలి.
గోదావరి పరిసర ప్రాంతాలను సినిమాటోగ్రఫర్ లోకి చిత్రీకరించిన తీరే ఆకట్టుకుంటుంది. మిగతా అంతా పాత వంశీ చిత్రాల్లాగా అన్పించినా, పెద్దగా నవ్వించదు. కృష్ణభగవాన్ పదాలను తికమకగా మాట్లాడడం, కొండవలస దాన్ని సవరించడం..సినిమా ఆసాంతం..కొనసాగుతూ..అదే కామెడీ అనుకోవడం దర్శకుడికి బాగుంటుందేమో గానీ ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్ లోనే మొహం మొత్తుతుంది. లయ అందంగా ఉంది. శ్రీకాంత్ నటన సాధారణమే.
కథ పరంగా..శ్రీకాంత్, కృష్ణభగవన్, కొండవలస లక్ష్మణరావు, భువనేశ్వరి దొంగరాముడు అండ్ పార్టీ. వీరంతా కలిసి దొంగతనాలు చేస్తుంటారు. జర్నలిస్ట్ లయ గోదావరి నదీ తీర ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలోని విశేషాల గురించి రాస్తుంటుంది. శ్రీకాంత్ కు లయ విచిత్రంగా పరిచయమవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. అయితే, హైదరాబాద్ లో ఎస్.ఐ.దుర్గాప్రసాద్ (తనికెళ్ళ) వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో..లయ రీసెర్చ్ చేసిన ఊరుకు పారిపోతారు.
ఆ ఊరిలో ఓ ధనవంతుడుకు అంతులేని ఆస్తి ఉంటుంది. ఆయన వారసుడి కోసం ఆ ఊరి వైద్యుడు సోమయాజులు (జయప్రకాష్ రెడ్డి) వేచి చూస్తుంటాడు. శ్రీకాంత్ ఆ ఆస్తి కోసం...తనే ఆ ధనవంతుడు మనవడినని చెపుతాడు. మరోవైపు లయ, తనికెళ్ళ వీరి ప్రయత్నాలు ప్లాఫ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. క్లైమాక్స్ లో ఈ దొంగరాముడు అండ్ పార్టీ మంచి వారిగా మారి ఊరి ప్రజల మొప్పు పొందుతారు.
పాటలు బాగున్నాయి. కానీ చక్రి రీరికార్డింగ్ పనితనం ఇప్పటికీ ఇంప్రూవ్ చేసుకోవకపోవడం బాధాకరం. సంభాషణలు కొన్ని సార్లు అలరించినా...ఈ సినిమాలో చాలా సీన్స్ టీవీ సీరియల్స్ మాదిరిగా పొంతన లేకుండా, భారంగా కదులుతుంటాయి. అదీ పెద్ద న్యూసెన్స్. వంశీ కెమెరా వ్యూ మీద పెట్టిన దృష్టి కామెడీ డైలాగ్ ల మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది.