twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈశ్వరా! కొత్తదనం ఏదీ?

    By Staff
    |

    Eeshwar
    -జలపతి

    చిత్రం: ఈశ్వర్‌ నటీనటులు: ప్రభాస్‌, శ్రీదేవి, రేవతి, శివకృష్ణ, అశోక్‌ కుమార్‌
    కథ: ధీన్‌ రాజ్‌
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌
    సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
    నిర్మాత: కె.అశోక్‌ కుమార్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ

    దర్శకుడు జయంత్‌ మంచి టెక్నిషియన్‌. అందులో సందేహం లేదు. ఆయన గత చిత్రం టక్కరిదొంగలో జయంత్‌ టెక్నికల్‌ సత్తా ఏమిటో బయటపడింది. అయితే, ఆ చిత్రంలో చేసిన పొరపాటే తన తాజా చిత్రం ఈశ్వర్‌ లోనూ చేశాడు. కంటెంట్‌ లేకుండా ఎన్ని గిమ్మిక్కులు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అదే కథ మీద దృష్టి పెట్టకపోవడం ఈ చిత్రంలో పెద్ద లోపం. 'అమీర్‌ పేటకైనా, ధూల్‌ పేట్‌ కైనా షహర్‌ ఒక్కటేరా' అనే ఈ చిత్రంలోని పాట మాదరిగా దర్శకుడు కూడా 'నువ్వు-నేనుకైనా, ఈశ్వర్‌ కైనా కథ ఒక్కటేరా' అని అనుకొని ఉంటాడు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన ప్రభాస్‌ ను మాస్‌ హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో చాలా సీన్స్‌ సాగదీయడం కూడా సినిమా కథనానికి అడ్డంకిగా మారాయి.

    ప్రభాస్‌ మాత్రం బాగానే నటించాడు. ధూల్‌ పేట్‌ కుర్రాడిగా బాగానే చేసినా, డైలాగ్‌ డెలవరీలో యాస లేకపోవడం విచిత్రం. కోస్తా రైటర్స్‌ (పరుచూరి బ్రదర్స్‌) ధూల్‌ పేట్‌ కథకు డైలాగ్స్‌ రాస్తే ఇలానే ఉంటాయోమో! కథ పెద్దగా లేకపోవడంతో పాటలు, కాస్తా కామెడీతో సినిమాను నడిపించాలని జయంత్‌ ప్రయత్నించాడు. అది కొన్ని సార్లు అలరించినా, సినిమా మొత్తం ముగిశాక నిరాశే మిగులుతుంది.

    ఈశ్వర్‌(ప్రభాస్‌) హైదరాబాద్‌ లోని ధూల్‌ పేట్‌ లో ఉండే పోకిరి అబ్బాయి. చదువు, సంధ్యలేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. ఈశ్వర్‌ తండ్రి(శివకృష్ణ) గుడంబా తయారు చేస్తుంటాడు. భార్య చనిపోతుంది. ఈశ్వర్‌ తొలిచూపులోనే హీరోయిన్‌ శ్రీదేవిని ప్రేమిస్తాడు. రకరకాల 'మాస్‌' చేష్టలతో ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. శివకృష్ణ తన లాంగ్‌ టైమ్‌ గర్ల్‌ ప్రెండ్‌ రేవతిని మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడు. శ్రీదేవి తండ్రి ఎమ్మెల్యే. అతని కలర్‌ నలుపైనా, ఎరుపంటే ఇష్టం.

    అంటే, పేదింటి వాళ్ళెవరైనా అతని కూతురును ముట్టుకుంటే రక్తం కళ్ళజూస్తాడని అర్థం. తన కూతురు చేయిపట్టుకున్న ఈశ్వర్‌ ను చంపించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ రేవతి ఈశ్వర్‌ ను కాపాడుతుంది. ఈ సంఘటనతో సవతి తల్లిని ఈశ్వర్‌ 'తల్లి'గా భావించడం మొదలుపెడుతాడు. తన కోసం చావడానికి సిద్దపడ్డ ఈశ్వర్‌ ను చూసి ఆమె శ్రీదేవి కూడా ప్రేమిస్తుంది. ఆ తర్వాత..వాళ్ళ తండ్రి వీళ్ళద్దరిని ఎలా వేరు చేస్తాడు. ధైర్యంగా ఎలా ఎదుర్కొంటారనేది మనం చాలా సినిమాల్లో చూశాం కదా! అదే కథనం.

    చాలామంది కొత్త హీరోలతో పోల్చితే, ప్రభాస్‌ నయమే. నటించే సత్తా ఉంది. శ్రీదేవి చాలా అందంగా ఉన్నా ఆకట్టుకునే అందం కాదు. రేవతిని సరిగా ఉపయోగించుకోలేకపోవడం దర్శకుడినే తప్పుపట్టాలి. శివకృష్ణ ధూల్‌ పేట్‌ గుడంబా వ్యాపారం చేసే లోకల్‌ మనిషి పాత్ర పోషించినా..ఆయన తన సహజశైలిలోనే డైలాగ్స్‌ చెప్పాడు. మనవాళ్ళు క్యారక్టర్‌ లో ఇమడిపోవాలన్న బేసిక్‌ సూత్రాన్ని ఎప్పుడు నేర్చుకుంటారో? ఈ చిత్రంలో అమీర్‌ పేట్‌ కు..ధూల్‌ పేట అనే పాటలో ఉన్నంత హుషార్‌ మిగతా పాటల్లో లేదు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం ఫర్వాలేదన్న స్థాయిలోనే ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X