twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీర బలి ('ఏక వీర' రివ్యూ)

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    నటీనటులు: ఆది, దన్సిక, అర్చనాకవి, అంజలి,పశుపతి, విజయచందర్ తదితరులు
    సంగీతం: కార్తీక్
    పాటలు: అనంతశ్రీరామ్
    సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్
    దర్శకత్వం: వసంతబాలన్
    నిర్మాత: శ్రీనివాస్ దామెర
    నిర్మాణ నిర్వాహకుడు: బాబి

    కథలో ముడి విప్పటానికి ప్లాష్ బ్యాక్ ఉంటే బావుంటుంది కానీ... ప్లాష్ బ్యాక్ కోసమే కథని ముడి వేస్తేనే ఇబ్బందిగానే ఉంటుంది. రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ఆది హీరోగా వచ్చిన పీరియడ్ డ్రామా ఏకవీర అదే సమస్యని ఎదుర్కొంది. గతంలో వెయిల్(తెలుగులో వేసవి), షాపింగ్ మాల్ వంటి ఎమోషనల్ ఫిల్మ్ లను డైరక్ట్ చేసిన వసంత్ బాలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ముందు ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనుకుని దాని చుట్టూ కథ అల్లినట్లు ఉంటుంది. దానికి తోడు పూర్తి అరవ సెంటిమెంట్, హీరోయిజం లేకుండా డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో జరిగిన కథగా చెప్పాలనుకోవటంతో పూర్తి బోర్ గా తయారైంది.

    18వ శతాబ్దంలో జరిగే ఈ కథ ఎక్కడినుంచో వచ్చిన చిన్నా(ఆది)ని అతని శక్తి యుక్తులు నచ్చి .. పశుపతి తాను నడిపే దొంగల ముఠాలో చేర్చుకోవటంతో మొదలవుతుంది. తానెవరో ఎక్కడనుంచి వచ్చాడో చెప్పకుండా దాచిపెట్టి చిన్నా ఆ ముఠాతో కలిపి దొంగతనాలు చేస్తూ వాళ్లతో కలిసిపోతాడు. అయితే అనుకోని పరిస్ధితిల్లో ఓ చోట దొంగతనాకి వెళ్లి అక్కడ బిళ్లూ అనే కాపలా వ్యక్తి గుర్తు పట్టి వెంటబడి చంపటానికి ప్రయత్నంచటంతో వేడెక్కుతుంది. ఇంతకీ బిళ్లూ ఎవరు... ఎందుకు చిన్నా అలా దొంగగా మారి అజ్ఠాత వాసం చేయాల్సివచ్చిందనేది అనేది మిగతా కథ.

    కావలి కొట్టం అనే నవలలోని ఓ ఎపిసోడ్ ఆధారంగా అల్లిన ఈ కథ 18నాటి దక్షిణ భారతదేశంలోని ఓ దొంగల తెగని చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. గుప్పెడు ధాన్యం కోసం వారు ప్రాణాలకు తెగించే విధానాన్ని ఆశ్చర్యపరిచేలా మన ముందు ఉంచుతుంది. అయితే ఆ దొంగతనాలు వరకూ బాగానే ఉన్నా కథ హీరోకి సంభందం లేకుండా ఒక దొంగతనం తర్వాత మరొకటి అంటూ వరసగా దొంగతనాల మీద డాక్యుమెంటరీలా నడుస్తూ పోతూ ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం దర్శకుడు ఎన్నుకున్న ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ ని సరిగా వినియేగించుకోకపోవటమే. సాధారణంగా ఈ నేరేషన్ లో జరిగే కథలన్నీ ఇంటర్వెల్ అయ్యిక వచ్చే ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ చుట్టూనే తిరుగుతూంటాయి. ప్లాష్ బ్యాక్ కి చెందిన ఎలిమెంట్స్ ఫస్టాఫ్ లో వెంబడిస్తూ కథలో ఓ సస్పెన్స్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తూంటాయి. అలాగే ప్లాష్ బ్యాక్ లో హిరోకి వచ్చే సమస్యను ఫస్టాఫ్ లో హీరో సాల్వ్ చేస్తూ ఆసక్తి కలిగిస్తూ ఉంటాడు. అయితే ఈ ఏకవీర అలా జరగదు. ఫస్టాఫ్ కి సెకండాఫ్ కి కొంచెము కూడా సంభంధం లేకుండా జరుగుతుంది. చిత్రంగా సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లోనే హీరోకి సమస్య రావటం,అక్కడే అతను ఫరిష్కారం వెతుక్కోవటం ఉంటాయి. అంతోటి దానికి ఫస్టాఫ్ ని ఎందుకు వృధాగా నడిపారో అర్దం కాదు.

    ఇక ఆ సంగతి ప్రక్కన పెడితే మృగం సినిమాతో నటనలో విశ్వరూపం చూపిన ఆది ఈ సినిమాలో తన శరీరం చూపటానికే సమయం కేటాయించాడనిపిస్తుంది. అయితే పశుపతి మాత్రం సినిమాకు వెన్నుముకై నిలిచాడు. గెస్ట్ గా కనపడిన భరత్(ప్రేమిస్తే)ని గుర్తు పట్టడం కష్టమే. అంతలా గెటప్ లోనూ,పాత్రలోనూ లీనమై కనిపించాడు. రాజుగా..విజయచందర్ తన పాత్రకు ప్రాణం పోసాడు. హీరోయిన్ గా చేసిన ఆమె ఓకే అనిపిస్తుంది. దర్శకుడు వసంత్ బాలన్ ఈ కథను ఎందుకు విషాదాంతం చెయ్యాలనుకున్నాడో అర్దం కాదు. నవలను ఉన్నదున్నట్లు తీయాలని ఫిక్సై అలా చేసాడేమో అనిపిస్తుంది. సినిమా చివరలో అయినా హీరోయిజం ఎలివేట్ చేసి ఉంటే ఉన్నంతలో బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మరింత షార్పు గా చేసి ఉంటే బాగుండేదేమో. పాటల్లో టైటిల్ సాంగ్ తప్ప మరేమీ బాగోలేవు. డైలాగులు నేటివిటీ టచ్ తో బాగానే ఉన్నాయి.

    ఫైనల్ గా అరవ వాతావరణంలో పూర్తి అరవ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం తమిళ డబ్బింగ్ లు హిట్టవుతాయనే సెంటిమెంట్ కి లొంగదనిపిస్తుంది. ఇక చారిత్రిక కథాంశాలు మీద ఆసక్తి,ఆనాటి వాతావరణం ఎలా ఉంటుంది చూడాలనుకునేవాళ్లకు మాత్రం ఈ సినిమా బెటర్ ఆప్షన్.

    English summary
    Eka Veera (2012) a historical film released today with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X