twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Enemy Movie Review : అంచనాలు పెంచి ఉస్సూరనిపించిన యాక్షన్ ఎంటర్టైనర్!

    |

    rating:2/5

    తమిళ హీరోలు విశాల్, ఆర్య ప్రధాన పాత్రలలో తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందించిన సినిమా ఎనిమీ. ఈ దర్శకుడు గతంలో విజయ్ దేవరకొండతో నోటా సినిమా చేసి ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమే. ఈ సినిమా దీపావళి సందర్భంగా అటు తమిళ భాషలో సహా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అలా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ఎనిమీ ఆ అంచనాలను అందుకుందా? లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం..

    ఎనిమీ కథ ఏంటంటే:

    ఎనిమీ కథ ఏంటంటే:

    సూర్య(విశాల్), రాజీవ్(ఆర్య) బాల్యంలో ఎలా కలిశారు? అనే కథతో సినిమా ప్రారంభం అవుతుంది. సూర్య తండ్రి రిస్క్ రామలింగం(తంబి రామయ్య)కి రిస్క్ అంటే చాలా భయం. సూర్య తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతూ ఉంటాడు. అదే సమయంలో సూర్య పక్కింట్లో రాజీవ్ తన పారి(ప్రకాష్ రాజ్)తో కలిసి దిగుతాడు. రాజీవ్ తండ్రి సూర్యలో పట్టుదలను చూసి తన కొడుకుతో పాటు సూర్యకి కూడా పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇద్దరినీ మంచి పోలీసులుగా చూడాలనుకుంటాడు. అనుకోని పరిస్థితులలో రాజీవ్ తండ్రి చనిపోతాడు.. దీంతో రాజీవ్, సూర్య ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ వాళ్ళిద్దరూ సింగపూర్ లో ఉన్న లిటిల్ ఇండియా అనే ఒక ప్రదేశంలో ఎలా కలిశారు ? కలిశాక వీళ్లిద్దరూ ఒకరినొకరు ఎలా పలకరించు కున్నారు? స్నేహితులుగా ఉన్న వీరు శత్రువులుగా ఎందుకు మారారు ? వీరికి అశ్విత(మృణాళిని రవి), అనీషా(మమతా మోహన్ దాస్)లతో సంబంధం ఏమిటి అనేది తెర మీద చూడాల్సిందే.

    ఎనిమీ సినిమాలో ట్విస్టులు :

    ఎనిమీ సినిమాలో ట్విస్టులు :

    ఆనంద శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. రాజీవ్ తండ్రి మరణం నుంచి ఊపందుకున్న ఈ సినిమాలో ఏకైక ట్విస్ట్ అసలు రాజీవ్ ఎందుకు చెడ్డవాడిగా మారాడు అనేదే. ఆ విషయాన్ని చాలా సినిమాటిక్ గా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. ప్రేక్షకుడి ఊహకు ఏ మాత్రం అందని విధంగా స్క్రీన్ ప్లే రాసుకోవడం లో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే తరువాత తరువాత ఒక స్థాయికి వచ్చాక ప్రేక్షకుడు ప్రతి సన్నివేశాన్ని ముందే ఊహించే విధంగా స్క్రీన్ ప్లే బలహీనమైంది. సూర్య, రాజీవ్ ఏ విషయంలో గొడవ పడ్డారు? ఈ గొడవ లో ఎవరు గెలిచారు? సూర్య కారణంగా అనీషా కి ఏమైంది ? చివరికి సూర్య రాజీవ్ లలో ఎవరు గెలిచారు? అనేది సినిమా కథ.

    దర్శకుడి విషయానికి వస్తే

    దర్శకుడి విషయానికి వస్తే

    ఇంకొక్కడు సినిమాతో మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత నోటా సినిమాతో పరాజయం అందుకున్న ఆనంద్ శంకర్ మూడు సంవత్సరాల తర్వాత తీసిన సినిమా ఇది. ఒక రకంగా సినిమా కథను ఎంచుకున్నప్పుడే సగం విజయం సాధించాడు దర్శకుడు, దానికి విశాల్, ఆర్యలు న్యాయం చేశారు. యాక్షన్‌ కి ఎమోషన్‌ కూడా కలిపి అన్నింటినీ మేనేజ్ చేస్తూ చక్కని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ఆనంద్. ముందు సినిమా మొదలయ్యేదే ఫ్లాష్‌బ్యాక్‌ నుంచి అయినా అసలు సూర్య,
    రాజీవ్ లకు ఎందుకు శత్రుత్వం ఏర్పడుతుంది? అనే అంశంతో పాటు పోలీసుల బుర్ర ఎంత షార్ప్ గా ఉండాలని చెబుతూ రాసుకున్న సీన్స్ బాగా పండాయి. కథ రాసుకున్న తీరు దానికి కథనాన్ని రాసుకున్న తీరు ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తం మీద సినిమా ఆద్యంతం కూడా దర్శకుడి మార్క్ కనిపించింది. అత్యాధునిక టెక్నాలజీ, వెపన్స్ వాడకం ఇలా ప్రతి విషయంలో కూడా ఆనంద్ తన స్పెషాలిటీ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు.

     విశాల్ నటన విషయానికి వస్తే

    విశాల్ నటన విషయానికి వస్తే

    ఎప్పటిలాగే విషయాలు తనదైన శైలిలో నటించారు. సూర్య పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. ఒకరకంగా ఇది ఎప్పుడూ విశాల్ చేసే రొటీన్ రోల్ లాగా అనిపిస్తుంది కానీ ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు. ముందు నుంచి విశాల్ పోలీస్ ఆఫీసర్ అన్నట్లుగా ప్రచారం జరిగింది కానీ పోలీస్ ఆఫీసర్ కాకపోయినా దానికి తగిన ఫిజిక్ తో విశాల్ అదరగొట్టాడు. కొన్ని కొన్ని సీన్స్ లో విశాల్ నటన విపరీతంగా ఆకట్టుకుంది. తన తోటి నటుడు ఆర్యతో పోటీపడుతూ విశాల్ బాగా నటించాడని చెప్పవచ్చు.

    ఆర్య నటన విషయానికి వస్తే

    ఆర్య నటన విషయానికి వస్తే

    విశాల్ కు తగ్గట్టే ఆర్య కూడా మంచి ఫాలోయింగ్ కలిగిన యాక్షన్ హీరో. అందుకే ఆర్య కనిపించినంత సేపు తనదైన మార్కు ఉండేలా చూసుకున్నాడు. అలాగే విశాల్ తో నటించిన సీన్స్ వారిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ మాత్రం హైలైట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు. ఎమోషనల్ సీన్స్ లో ఆర్య నటన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కొన్ని కొన్ని సీన్స్ లో ఆర్య అనే నటుడు మనకు కనిపించడు కేవలం అక్కడ రాజీవ్ అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంతలా ఆయన ఈ పాత్రలో ఒదిగిపోయాడు.

    ఇతర నటీనటుల విషయానికి వస్తే

    ఇతర నటీనటుల విషయానికి వస్తే

    తెలుగు తమిళంలో చాలా సినిమాలు చేసి క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైన మమతా మోహన్ దాస్ ఈ సినిమాలో ఎక్కువ సేపు కనిపించే పాత్రలో కనిపించకపోయినా ఆర్య భార్య పాత్రలో ఆమె మెప్పించింది. ఇక విశాల్ ప్రేయసిగా నటించిన మృణాళిని రవి కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తెలుగులో గద్దల కొండ గణేష్ సినిమాలో నటించిన ఈ భామ ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఇక విశాల్ తండ్రి పాత్రలో నటించిన తంబి రామయ్య నటన కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేర నటించారు.

    సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే

    సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే

    ఈ సినిమాలో పాటలు అసలు ఏమాత్రం వినడానికి ఆసక్తికరంగా లేవు, బహుశా తమిళం నుంచి తెలుగులోకి తర్జుమా చేయడంలో వచ్చిన సమస్యల వల్ల అలా అయ్యుండొచ్చు అని చెప్పవచ్చు. అయితే సామ్ సీఎస్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని నెక్ట్స్ లెవల్కి తీసుకువెళ్ళింది. కొన్ని కొన్ని సీన్స్ లో కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సినిమా ఆసక్తిగా సాగింది.. ఇక రాజశేఖర్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాల్సిందే. ముఖ్యంగా నైట్ సీన్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయంలో కూడా కాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. తెలుగు అనువాదం విషయంలో ఎక్కడా వంక పెట్టాల్సిన పని లేదు.

    ఫైనల్ గా చెప్పాలి అంటే

    ఫైనల్ గా చెప్పాలి అంటే

    ఎనిమి సినిమా అందరికీ తెలిసిన రొటీన్ కథే అయినా కొత్తగా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అందులో కొంతలోకొంత సఫలం అయ్యాడు కానీ అన్ని వర్గాల ప్రేక్షలను ఆకట్టుకోలేకపోయాడు అనే చెప్పాలి. రొటీన్ రివేంజ్ డ్రామానే కానీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతూ ఉండడంతో ప్రతి సీన్ ఆసక్తికరంగా మలచడానికి ప్రయత్నించాడు. ఏదో చేద్దామని ప్రయత్నిస్తే ఫలితం ఇంకేదో వచ్చిందని చెప్పచ్చు. ఈ దీపావళికి ఇంటిల్లిపాది ఒకసారి చూడతగ్గ యాక్షన్ ఎంటర్టైనర్ ఎనిమీ.

    Recommended Video

    Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
    నటీనటులు

    నటీనటులు

    విశాల్ , ఆర్య , మృణాళిని రవి , ప్రకాష్ రాజ్ , మమత మోహన్ దాస్, తంబీ రామయ్య
    నిర్మాత :- వినోద్ కుమార్
    సంగీత దర్శకుడు :- థమన్. యస్. యస్
    దర్శకుడు: - ఆనంద్ శంకర్
    విడుదల తేదీ :- నవంబర్ 4 , 2021

    English summary
    Here is the Vishal and Arya starrer Enemy Movie Review and rating in telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X