twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Evaru Movie Review And Rating || ఎవరు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

    Rating:
    3.0/5
    Star Cast: అడివి శేషు, రెజీనా కసండ్రా, నవీన్ చంద్ర, మురళీశర్మ, పవిత్రా లోకేష్
    Director: వెంకట్ రాంజీ

    టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయం రీసెంట్‌గా క్షణం, గూఢచారి సినిమాలు రుజువు చేశాయి. ఆ రెండు సినిమాలు కూడా అడివి శేషు హీరోగా రావడంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవరు మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే రెజీనా కసండ్రా ఉండటంతో మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. పీవీపీ బ్యానర్ ఈ సినిమాను రూపొందించడం మరింత ఆకర్షణగా మారింది. ఇలాంటి పరిస్థితులు మధ్య రిలీజైన ఎవరు సినిమా అడివి శేషుకు మరో సక్సెస్‌ను అందించిందా? రెజీనా మళ్లీ సక్సెస్ ట్రాక్ పట్టిందా? పీవీపీ ఖాతాలో మరో విజయం చేరిందా? కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ ప్రేక్షకులను ఎలా మెప్పించాడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలను, నటీనటుల ప్రతిభను సమీక్షించాల్సిందే.

    ఎవరు మూవీ కథ

    ఎవరు మూవీ కథ

    ప్రముఖ పారిశ్రామిక వేత్త సమీర్ మహా (రెజీనా కసండ్రా) కొన్ని పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ అశోక్ (నవీన్ చంద్ర) హత్యకేసులో నిందితురాలిగా మారుతుంది. తనను రేప్ చేయడానికి ప్రయత్నించడంతో హత్యకు పూనుకొన్నాననే వాదన వినిపిస్తున్న సమీరాకు సహాయం చేయడానికి ఓ అవినీతి పోలీస్ అధికారి విక్రమ్ వాసుదేవన్ ( అడివి శేషు) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వినయ్ వర్మ (మురళీశర్మ) మిస్సింగ్ కేసు తెరపైకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసుకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని విక్రమ్ సేకరిస్తాడు.

    ఎవరు మూవీలో ట్విస్టులు

    ఎవరు మూవీలో ట్విస్టులు

    పోలీస్ ఆఫీసర్ అశోక్‌ను సమీరా ఎందుకు చంపాల్సి వచ్చింది? వినయ్ వర్మ మిస్సింగ్ కేసుకు అశోక్ హత్యకు ఏదైనా సంబంధం ఉందా? ఉద్దేశపూర్వకంగా సమీరా హత్య చేసిందా? లేక ఆత్మరక్షణ కోసం మర్డర్ చేసిందా? విక్రమ్ వాసుదేవన్ ఎందుకు ఈ కేసులో తలదూర్చాడు? చివరికి సమీరా కేసు నుంచి బయటపడిందా? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే ఎవరు మూవీ కథ.

    ఫస్టాఫ్‌ అనాలిసిస్

    ఫస్టాఫ్‌ అనాలిసిస్

    పోలీస్ ఆఫీసర్ అశోక్‌ను సమీరా హత్య చేయడంతో నేరుగా కథ మొదలవుతుంది. హత్య కేసు నుంచి బయటపడటానికి అవినీతి అధికారి విక్రమ్ రంగ ప్రవేశంతో సన్నివేశాలు చకచకా సాగిపోతుంటాయి. ఇన్ హౌజ్ ఇన్వెస్టిగేషన్ తరహా కథనం కావడంతో నటీనటులు ఎమోషన్స్‌తో కథ సాఫీగా సాగిపోవడం, అనుక్షణం కథలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. రెజీనా, అడివి శేషు మధ్య సన్నివేశాలు గ్రిప్పింగ్ ఉంటాయి. రెజీనా, నవీన్ చంద్ర మధ్య వచ్చే సీన్లు కథకు బలంగా మారుతాయి. ఇలా ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతున్న క్రమంలో చక్కటి అంశంతో ఇంటర్వెల్ కార్డు పడటంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరుగుతుంది. కథలో భాగంగా నాలుగు వెర్షన్లుగా కనిపించే ఓ రేప్ సీన్ సినిమాకు స్పెషల్ ప్యాకేజ్‌లా అనిపిస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో హత్య వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తూ నవీన్ చంద్ర, రెజీనా మధ్య ఉండే డ్రామా సినిమాపై మరింత ఆసక్తిని పెంపొదిస్తుంది. అలాగే అడివి శేషు ఇన్వెస్టిగేషన్‌ తెరకెక్కించిన తీరులో క్రియేటివ్ లిబర్టీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కథ, కథనాలను తన కంట్రోల్ పెట్టుకోవడం, యధేచ్ఛగా క్రియేటివ్ లిబర్టీని ఉపయోగించుకోవడం దర్శకుడి పరిణతికి అద్దం పట్టింది. వినయ్ వర్మ, ఆదర్శ్ వర్మ క్యారెక్టర్ల ద్వారా జొప్పించిన ఎమోషనల్ కంటెంట్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచింది. కొత్త తరహా మైండ్ గేమ్ ప్రేక్షకుడిని కథలో లీనం కావడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలుగజేస్తాయి. కథ ఎక్కడా ట్రాక్ తప్పుకుండా సాగిపోవడంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. సినిమాకు అదే హైలెట్ అనే భావన కలుగుతుంది. కాకపోతే ఒకేరకమైన పంథాలో కథ సాగడం కొంతమందికి రుచించకపోవచ్చు.

    డైరెక్టర్ వెంకట్ రాంజీ టేకింగ్ గురించి

    డైరెక్టర్ వెంకట్ రాంజీ టేకింగ్ గురించి

    దర్శకుడు వెంకట్ రాంజీ తొలి చిత్ర దర్శకుడైనప్పటికీ అనుభవ లేమీ ఎక్కడా కనిపించదు. తాను ఎంచుకొన్న పాయింట్‌ను డ్రైవ్ చేయడంలో ఎలాంటి తడబాటు కనిపించలేదు. అలాగే రెజీనా చేసే మర్డర్ అంశంలో మూడు, నాలుగు వెర్షన్లను చెప్పిన తీరు, ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే సినిమాకు పాజిటివ్‌గా మారింది. క్యాట్ అండ్ మౌజ్ తరహా స్క్రిన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది. పాత్రల చేత చెప్పించి డైలాగ్స్ బాగున్నాయి. ప్రతీ పాత్రను పాజిటివ్‌గా మలచడానికి చేసిన ప్రయత్నం ఆకట్టుకునేలా ఉంది.

    రెజీనా అందం, అభినయం

    రెజీనా అందం, అభినయం

    చాలా రోజుల తర్వాత కథను స్వయంగా తన భుజాల మీద మోసే సమీరా పాత్రలో రెజీనా కనిపించింది. పవర్ ప్యాక్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడంతోపాటు.. అవసరమైన చోట అతిగానే గ్లామర్ ప్రదర్శించింది. అందం, అభినయం అనే అస్త్రాలతో రెజీనా మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పవచ్చు. గ్లామర్ తారగా ముద్ర వేసుకొన్న రెజీనాలో నటనపరంగా మరో కొత్తకోణం కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నది. డెఫినెట్‌గా మరో లెవెల్‌కు చేరే పాత్రలో మెప్పించింది.

    హై ఇంటెన్సీవ్‌గా అడివి శేషు

    హై ఇంటెన్సీవ్‌గా అడివి శేషు

    హై ఇంటెన్సిటీతో కూడిన అవినితీ అధికారి అడివి శేషు పాత్రలో అద్భుతంగా రాణించాడు. తన పాత్రలో ఉండే వివిధ వేరియేషన్స్‌ను చక్కగా తెరపైన పండించాడు. సెకండాఫ్‌లో వచ్చే సీన్లలో శేషు నటన చాలా బాగుంది. చివరి 15 నిమిషాల్లో ఫెర్ఫార్మెన్స్‌తో మ్యాజిక్ చేశాడనే చెప్పవచ్చు. లుక్‌పరంగా, యాక్టింగ్ పరంగా మరింత మెచ్యురిటీ కనిపించింది. ఇక నవీన్ చంద్ర విషయానికి వస్తే.. మరోసారి ఓ మంచి పాత్రలో కనిపించాడు. ఆవేశమే తప్ప ఆలోచన లేని అధికారి పాత్రలో నవీన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఆ పాత్రలో అంతర్లీనంగా ఉండే ఎమోషనల్ పాయింట్‌ను తెర మీద చక్కగా పండించాడు

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో వినయ్ వర్మగా మురళీ శర్మ, అతడి భార్య పవిత్రా లోకేష్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. మురళీ శర్మ కనిపించేది కొద్ది సేపైనా గుర్తుండే పాత్రలో కనిపించారు. ఇక కథలో ఆదర్శ్ వర్మ పాత్ర ప్రత్యేకమైనది. ఆ పాత్ర ట్రీట్‌మెంట్ స్పెషల్‌గా ఉంటుంది. ఆ పాత్రను తెర మీద ఆస్వాదిస్తేనే బాగుంటుంది. మిగితా పాత్రలు సినిమాకు సపోర్ట్‌గా మారాయి.

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌గా

    సాంకేతిక పరమైన అంశాలలో ఎవరు సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అదనపు ఆకర్షణ. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలను సినిమాటోగ్రాఫర్ వంశీ చక్కగా తెరకెక్కించారు. అలాగే ఇన్‌హౌజ్ డ్రామాను కూడా తెర మీద రక్తికట్టించడానికి ఉపయోగించుకొన్న లైటింగ్, కలర్ ప్యాటర్న్ బాగుంది. ఈ సినిమాకు రీరికార్డింగ్ ప్రాణంగా నిలిచింది. ఎమోషనల్ సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి కారణమైందని చెప్పవచ్చు. ఆర్ట్ విభాగం పనితీరు కూడా నచ్చుతుంది. ఎవరు స్క్రీన్ ప్లే అత్యంత క్లిష్టమైనదని చెప్పవచ్చు. ఏ ఒక్క అంశమైనా సరిగా మ్యాచ్ చేయకపోతే దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లేకు తన ఎడిటింగ్ సత్తాను చూపించడంలో గ్యారీ సఫలమయ్యాడని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఎమోషనల్ కంటెంట్‌తోపాటు టెక్నికల్‌గా బలమైన అంశాలున్న చిత్రం ఎవరు. అనేక మలుపులతో సరికొత్త సస్సెన్స్, థ్రిలర్ అనే ఫీలింగ్‌ను కల్పిస్తుంది. మేకింగ్ విషయంలో గ్రిప్పింగ్‌గా ఉండటంతోపాటు ప్రేక్షకుడిని మెదడుకు పదును పెట్టే అంశాలకు స్కోప్ ఉన్న చిత్రంగా చెప్పవచ్చు. థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఎవరు మరింత నచ్చేలా ఉంటుంది. పీవీపీ సంస్థ నిర్మాణ విలువలు సినిమాకు ది బెస్ట్‌ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. అలాగే నటీనటుల ఎంపిక విషయంలోనూ పీవీపీ ఛాయిస్ బాగుంది. మల్టీప్లెక్స్, ఏ, బీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ తోడైతే కమర్షియల్ పెద్ద విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

     ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    రెజీనా, అడివి శేషు, నవీన్ చంద్ర యాక్టింగ్
    స్క్రీన్ ప్లే
    సినిమాటోగ్రఫి
    టిస్టులు

    మైనస్ పాయింట్స్

    కన్విన్స్ కాకుండా ఉండే కొన్ని అంశాలు

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: అడివి శేషు, రెజీనా కసండ్రా, నవీన్ చంద్ర, మురళీశర్మ, పవిత్రా లోకేష్ తదితరులు
    డైరెక్టర్: వెంకట్ రాంజీ
    నిర్మాతలు: పర్ల వీ పొట్లూరి, పరమ్ వీ పొట్లూరి, కెవిన్ అన్నె
    మ్యూజిక్ డైరెక్టర్: శ్రీ చరణ్ పాకాల
    సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
    ఎడిటర్: గ్యారీ బీహెచ్
    బ్యానర్: పీవీపీ సినిమా
    రిలీజ్: 2019-08-15

    English summary
    Evaru Telugu thriller film directed by Venkat Ramji. The film produced by Pearl V Potluri, Param V Potluri and Kavin Anne. The film starring Adivi Sesh, Regina Cassandra, and Naveen Chandra. The music is composed by Sricharan Pakala and editing by Garry Bh. The film is scheduled for release on 15 August 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X