»   »  నిల్ ( గోపిచంద్ 'జిల్‌' రివ్యూ)

నిల్ ( గోపిచంద్ 'జిల్‌' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్ కథలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మారిన ప్రేక్షకుడుకి ఆ కథ,కథనం చాలా చాలా కొత్తగా అనిపించేలా డిజైన్ చేయగలగాలి. ముఖ్యంగా మాస్ హీరో తో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ క్రైమ్ తను ఎత్తుకున్న కథలో కరెక్టు గా కలవకపోతే రెండు వేరు వేరు ట్రాక్ లుగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ చిత్రానికి అలాంటిదే జరిగిందనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఓ ప్రక్క, విలన్ ట్రాక్ ఓ ప్రక్క విడివిడిగా నడుస్తూ ఉంటాయి. హీరో తనకు గానీ తన కుటుంబానికి గానీ సంభంధం లేని సమస్యలో ఇరుక్కుంటాడు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఆ సమస్య కూడా అతన్ని దూరం నుంచే పలకరిస్తుంది. పలకరించినా వెంటనే దగ్గరకు రాదు...విలన్ కరెక్టు డెషిషన్ తీసుకుని హీరోకు సమస్య పూర్తిగ నెట్టే సరికే పుణ్యంకాలం గడిచే సరికి క్లైమాక్స్ వచ్చేస్తుంది. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారి చూసే వారికి నీరసం వస్తుంది....మనలో జిల్ చచ్చిపోతుంది. అయితే ఈ సినిమా చూసిన వారికి ఒకటి మాత్రం అనిపిస్తుంది. దర్శకుడు సరైన స్క్రిప్టు లేక ఇబ్బంది పడ్డాడు కానీ లేకుంటే పెద్ద హిట్ కొట్టేవాడిని అర్దమవుతుంది. షాట్ మేకింగ్, డైలాగులు, ఆర్టిస్టుల ఫెరఫార్మెన్స్ విషయంలో కొత్త దర్శకుడు ఎక్కడా తడబడకుండా చాలా బాగా డీల్ చేసాడు. కాబట్టి నెక్ట్స్ టైమ్ బెటర్ లక్. సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్ రాసిఖన్నా. ఆమెను గ్లామర్ గా చూపించిన విధానం.


జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఆ డాన్ దగ్గర నుంచి డబ్బు కొట్టేసిన రంగనాధ్ (బ్రహ్మాజి) ని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ చివరి క్షణాల్లో రంగనాథ్ .. జై కు ఆ డబ్బు వివరాలు చెప్పాడని సందేహంతో. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. దాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


మిగతా ఎలిమెంట్స్ అన్నీ వదిలేసి మాస్ యాక్షన్ హీరోతో కేవలం స్టైల్ ని నమ్ముకుని సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది. దానికి తోడు గతంలో ఎప్పుడో అరవై,డబ్బై సంవత్సరాల క్రితం హిచ్ కాక్ చేసిన The Man Who Knew Too Much వంటి కథనం ఎత్తుకుంటే ఎలా..అప్పటికీ ఇప్పటికీ సినిమా ప్రేక్షకులు బాగా మారారు. అలాగే...మనకు హీరో,హీరోయిన్, పాటలు, విలన్,కామెడీ వంటి అనేక అంశాలు కలిపి వండాలి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేయాల్సింది.


ఇక ఈ సినిమాలో విలన్ ... ఎక్కడా తప్పు చేస్తున్నట్లు కనిపించదు...తన పోగొట్టుకున్న డబ్బు కోసం తను హీరో వెనక తిరుగతూంటాడు. అయినా వెయ్యికోట్లు బ్యాంక్ లో ఉందంటే అది వైట్ మనీనే. అలాంటప్పుడు దాన్ని పోగొట్టుకున్నవాడు...దాన్ని రాబట్టుకోవాలనుకోవటంలో తప్పేముంది అనిపిస్తుంది. అలాగే హీరోకు...క్లైమాక్స్ ముందు దాకా...తన దగ్గర ఉన్న క్లూ సంగతి గుర్తుకు రాదు. అలా ఎక్కడిక్కడ ... కథను కన్వీనెంట్ గా చేసుకుంటూ వెళ్లటంతో చాలా ప్రెడిక్టుబుల్ గా మారిపోయింది.


మిగతా రివ్యూ... స్లైడ్ షోలో...


టెక్నికల్ గా...

టెక్నికల్ గా...


సినిమా టెక్నికల్ గా చాలా సౌండ్ అనే చెప్పాలి. కెమెరామెన్ శక్తి శరవణ్ తన కెమెరాతో ..ఆస్ట్రేలియా, న్యూజ్ లాండ్, హైదరాబాద్ అందాలను పట్టి తెరను కలర్ ఫుల్ గా చేసారు.ఎడిటింగ్ మాత్రం

ఎడిటింగ్ మాత్రం


ఈ చిత్రానికి ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి ఉంటే బాగుండును అనిపిస్తుంది. సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చింది.సంగీతం

సంగీతం


గిబ్రాన్ స్వరపరిచిన పాటలు...అన్నీ ఒకే రకంగా ఉన్నట్లు అనిపించాయి. రన్ రాజా రన్ చిత్రానికి ఉన్నంతగా ఈ పాటలు ఇవ్వలేదు.


 నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు


నిర్మాతలు మాత్రం ఈ చిత్రానికి బాగా ఖర్చుపెట్టారు.ఎక్కడా వెనకడుగువేయలేదని రిచ్ గా ఉన్న ప్రతీ ఫ్రేమ్ అనిపిస్తుంది.దర్శకుడు

దర్శకుడు


పైనే చెప్పుకున్నట్లు దర్శకుడు కొత్తవాడేనా బాగా డీల్ చేసాడు. మంచి కథ,కథనం కుదురితే మంచి అవుట్ ఫుట్ ఇవ్వగలడనే నమ్మకం వస్తుంది. అలాగే డైలాగులు కూడా చాలా బాగా రాసాడు. రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా బాగుంది.హీరో,హీరోయిన్స్, విలన్

హీరో,హీరోయిన్స్, విలన్


చిత్రంలో గోపీచంద్ కన్నా రాశికన్నా కే ఎక్కువ మార్కులు పడతాయి. ముఖ్యంగా గ్లామర్ సీన్స్ లో, లవ్ సీన్స్ లో చాలా బాగా చేసింది. విలన్ కొత్తవాడైనా చాలా బాగా చేసి మెప్పించాడుహైలెట్స్

హైలెట్స్

సినిమా హైలెట్లలో ... ఊర్వసి, గోపిచంద్ మధ్య వచ్చే కామెడీ సీన్ బాగుంది. అలాగే హీరోయిన్ పెళ్లి చూపుల సీన్ కూడా కొత్తగా కన్సీవ్ చేసారు. సెకండాఫ్ లో వచ్చే సమాధుల వద్ద ఫైట్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా విలన్...హీరోని ఉద్దేశించి...నీతో మాట్లాడినవాడినల్లా చంపేస్తానని బెదిరించే లాక్ బాగుంది.ఎవరెవరు

ఎవరెవరు


బ్యానర్ :యూవీ క్రియేషన్స్‌
నటీనటులు:గోపీచంత్, రాశీ ఖన్నా , చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు
కాస్ట్యూమ్ డిజైనర్: తోట విజయభాస్కర్,
ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్,
యాక్షన్: అనల్ అరసు,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్,
మ్యూజిక్: ఘిబ్రాన్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్,
ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి,
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
విడుదల తేదీ : మార్చి 27,2015.ఫైనల్ గా... స్టైలిష్ గా తీసిన ఈ చిత్రం ఫలితం ప్రక్కన పెడితే దర్శకుడు...మంచి కంటెంట్ ఉంటే చెలరేగిపోతాడనేలా ఉంది. ఇది కొత్త దర్శకుడుగా అక్కడ దాకా మంచి మార్కులు వేయించుకున్నాడు. సినిమా విషయానికి వస్తే... కొన్ని సరదా సన్నివేశాలు..పాటల చిత్రీకరణ.. ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా ఉండే కథనం కోరుకునేవారికి ఇది ఆప్షన్.

English summary
Jil is the newly released Telugu film starring the Gopichand and the gorgeous Rashi Khanna. Jil (2015) has finally the theaters today and is get divide talk from all kinds of audience.
Please Wait while comments are loading...