twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా కాన్సెప్టు బాగానే ఉంది కానీ.... (గోపీచంద్ ‘ఆక్సిజన్’ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    Star Cast: గోపిచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, కిక్ శ్యామ్
    Director: ఏఎం జ్యోతికృష్ణ

    Recommended Video

    Gopichand's 'Oxygen' Movie Public Talk ! 'ఆక్సీజన్' పబ్లిక్ టాక్

    హీరో గోపీచంద్‌కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. దీంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ హీరో.... తాజాగా 'ఆక్సిజన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు', 2006లో 'కేడీ', 2012లో 'ఊ లా లా' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎ.ఎం జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

    రొటీన్ కమర్షియల్, ఫ్యామిలీ డ్రామాలు చేస్తూ వెళుతున్న గోపీచంద్ ఈ సారి కాస్త దేశభక్తిని, కాస్త సందేశాన్ని జోడించి 'ఆక్సిజన్'తో బాక్సాఫీసు బరిలో దూకారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది? సినిమా విశేషాలు ఏమిటనేది రివ్యూలో చూద్దాం...

    సినిమా కథలోకి వెళితే..

    సినిమా కథలోకి వెళితే..

    సంజీవ్(గోపీచంద్) దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని సిన్సియర్ మిలటరీ ఆఫీసర్. సెలవుపై ఇంటికి వెళ్లిన అతడు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటాడు. దేశ ప్రజలకు హాని చేసే సమస్యను పరిష్కరించేందకు తన మిలటరీ నెట్వర్క్ ఉపయోగించి ‘ఆక్సిజన్' అనే మిషన్ మొదలు పెడతాడు.

    కృష్ణ ప్రసాద్‌గా మరో పాత్రలో గోపీచంద్

    కృష్ణ ప్రసాద్‌గా మరో పాత్రలో గోపీచంద్

    అచ్యుతాపురం అనే ఊరిలో జగపతి బాబు, షాయాజీ షిండే కుటుంబాల మధ్య పాత పగలు ఉంటాయి. జగపతి బాబు కుటుంబాన్ని చంపేందుకు షాయాజీ షిండే మనుషులు ప్రయత్నిస్తుంటారు. వాళ్ల ప్రయత్నాలను జగపతి కొడుకు(శ్యామ్), తమ్ముళ్లు అభిమన్యు సింగ్, బ్రహ్మాజీ ఈజీగా ఎదుర్కొంటారు. అయితే వీళ్లు కాకుండా మరో శత్రువు వీరి కుటుంబంలోని మగవారిని మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికే అన్నయ్య నాగినీడుని కోల్పోయిన జగపతి.... కుటుంబాన్ని కాపాడుకోవడానికి సిటీ నుండి ఊరికి మకాం మారుస్తారు. కూతురు(రాశిఖన్నా)కు పెళ్లి చేసి అమెరికా పంపిస్తే సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో అమెరికా సంబంధం చూస్తారు. అమెరికా నుండి రాశి ఖన్నాను పెళ్లి చేసుకోవడానికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్(గోపీచంద్) ఊరికొస్తాడు. ఓసారి షాయాజీ షిండే మనుషుల దాడి నుండి కుటుంబం మొత్తాన్ని కాపాడిన కృష్ణ ప్రసాద్ కుటుంబం దృష్టిలో హీరో అవుతాడు.

    ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్

    ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్

    కృష్ణ ప్రసాద్, రాశి ఖన్నా పెళ్లికి అంతా సిద్ధమైన తర్వాత కథలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. అప్పటి వరకు మంచి వాడిగా కనిపించిన కృష్ణ ప్రసాద్ అసలు రూపం బయట పడుతుంది. జగపతి కొడుకు శ్యామ్, తమ్ముడు బ్రహ్మాజీతో పాటు అతడి మనుషులను ఊచకోత కోసి రాశిఖన్నాను కిడ్నాప్ చేసి తీసుకెళతాడు. అసలు మిలటరీ ఆఫీసర్ సంజీవ్‌కు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్‌కు సంబంధం ఏమిటి? ‘అక్సిజన్' మిషన్ వెనక ఉన్న అసలు కథ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టిన గోపీచంద్

    పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టిన గోపీచంద్

    పెర్ఫార్మెన్స్ పరంగా హీరో గోపీచంద్ అదరగొట్టాడు. అటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్‌గా, ఇటు మిలటరీ ఆఫీసర్ సంజీవ్‌గా బాగా నటించాడు. యాక్షన్ సీన్లలో బాగా చేశాడు. లుక్ పరంగా కూడా గోపీచంద్ ఆకట్టుకున్నాడు.

    రాశి ఖన్నా, అను ఎమ్మాన్యూయేల్

    రాశి ఖన్నా, అను ఎమ్మాన్యూయేల్

    గోపీచంద్ సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా, అను ఎమ్మాన్యూయేల్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. విలేజ్ గర్ల్‌గా రాశి ఖన్నా, మైక్రో బయాలజిస్టుగా అను ఎమ్మాన్యూయేల్ ఇటు నటన పరంగా, అటు అందం పరంగా ఓకే అనిపించారు.

    ముఖ్య నటీనటులు

    ముఖ్య నటీనటులు

    ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించిన జగపతిబాబు మరోసారి తన సత్తా చాటారు. ఆయన లుక్, పెర్ఫార్మెన్స్, పలు సన్నివేశాల్లో ఆయన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. షాయాజీ షిండే, బ్రహ్మాజీ, శ్యామ్, అభిమన్యు సింగ్, చంద్రమోహన్, వెన్నెల కిషోర్, అలీ, ప్రభాకర్, జయన్, తాగుబోతు రమేష్, సితార, ఆశిష్ విద్యార్థి వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. స్పెషల్ సాంగులో సాక్షి చౌదరి గ్లామర్ పరంగా పర్వాలేదనిపించింది.

    టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే.... యువన్ శంకర్ రాజా అందించిన పాటలు రొటీన్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్సయింది. ఎస్ బి ఉద్ధవ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బావుండేది. రత్నం అందించిన స్క్రీప్లే కొంత వరకు ఫర్వాలేదు. సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి.

    డైరెక్టర్ పని తీరు

    డైరెక్టర్ పని తీరు

    చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేసిన ఎ.ఎం.జ్యోతి కృష్ణ ‘ఆక్సిజన్' సినిమాను నడిపించిన తీరు యావరేజ్‌గా ఉంది. సినిమా ఫస్టాఫ్ చూస్తుంటే ఏదో రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ట్విస్ట్ అదరగొట్టాడు. సెకండాఫ్ యువతకు సందేశాత్మకంగా ఉండేలా ప్లాన్ చేశాడు. సినిమా టేకింగ్ ఫర్వాలేదు. అయిదే దర్శకుడు చెప్పాలనుకున్న అంశాన్ని రొటీన్ ఫార్మాట్లో చెప్పడం కాస్త మైనస్ అయింది.

    సినిమా ఫస్టాఫ్

    సినిమా ఫస్టాఫ్

    సినిమా ఫస్టాఫ్ రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా సాగింది. తొలి భాగం చాలా స్లోగా ఉండటం, రొటీన్ సీన్లు ఉండటంతో ఇది మామలు సినిమాయే అని డీలా పడిపోయే సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్త ఊరటనిస్తుంది.

    సెకండాఫ్...

    సినిమా సెకండాఫ్‌లోనే ‘ఆక్సిజన్' అసలు కథ మొదలు అవుతుంది. అప్పటి నుండి కథ వేగంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా ఫర్వాలేదు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    గోపీచంద్ పెర్ఫార్మెన్స్
    ఇంటర్వెల్ బ్యాంగ్
    సినిమా కాన్సెప్టు
    సెకండాఫ్‌లో కొన్ని సీన్లు

    మైనస్ పాయింట్స్

    కథ, కథనం ఊహించే విధంగా ఉండటం
    ఫస్టాఫ్ లో కనిపించే రొటీన్ సీన్లు
    ఆకట్టుకోని పాటలు

    ఫైనల్‌గా...

    ఫైనల్‌గా...

    ఫైనల్‌గా సినిమా గురించి చెప్పాలంటే.... గోపీచంద్ గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్. అయితే సినిమాలోని సందేశం ప్రేక్షకులు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది? అనే అంశంపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

    తారాగణం

    తారాగణం

    జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్" యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ

    English summary
    Gopichand's much delayed film 'Oxygen' is finally hitting the theaters on this Thursday. The movie Produced by S. Aishwarya on Sri Sai Raam Creations banner, presented by A. M. Rathnam and directed by A. M. Jyothi Krishna. Starring Gopichand, Raashi Khanna, Anu Emmanuel in the lead roles while Jagapati Babu in crucial supporting role and music composed by Yuvan Shankar Raja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X