»   » హార్ట్ టచింగ్ ‘హ్యాపీ ఎండింగ్’ (తెలుగు ఇండిపెండెంట్ ఫిల్మ్ రివ్యూ)

హార్ట్ టచింగ్ ‘హ్యాపీ ఎండింగ్’ (తెలుగు ఇండిపెండెంట్ ఫిల్మ్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షార్ట్ ఫిల్మ్.....వినడానికి ఈ పేరు చిన్నగా ఉన్నా ఈ ఇంటర్నెట్ కాలంలో ప్రతిభను నిరూపించుకోవడానికి యువ దర్శకులకు పెద్ద సాధనంగా మారింది. రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, దేవా కట్టా, లాంటి వారు కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలను వదిలి షార్ట్ ఫిలింస్ మీద పడ్డారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో యూట్యూబులో కుప్పలు తెప్పలుగా షార్ట్ ఫిలింస్ వచ్చి పడుతున్నాయి. అయితే అందులో కొన్ని మాత్రం ఆలోచనాత్మకంగా, విభిన్నంగా, సామాజిక పరిస్థితులను, యువత పోకడలకు అద్దం పట్టే విధంగా ఉంటున్నాయి. ఇటీవల యూట్యూబులో విడుదలైన ‘హ్యాపీ ఎండింగ్"' అనే ఒక గంట మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది.

సినిమాలైనా, షార్ట్ సినిమాలైనా రెండు రకాలగా వుంటాయి. మొదటి రకం మంచి స్టొరీ‌కి స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, కెమెరా వర్క్, మ్యూజిక్, యాక్టర్స్ నటన ప్రతిభ ఇవ్వన్ని సాధారణంగా వున్నా సినిమా హిట్ అవుతుంది. రెండో రకం కథ అతి సాధారణంగా వుండి స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, కెమెరా వర్క్, మ్యూజిక్, యాక్టర్స్ నటన ప్రతిభ ఆసాధారణంగా వుంటే తప్ప ఆ సినిమా హిట్ అవ్వదు.

హ్యాపీ ఎండింగ్‌తో దర్శకుడు జయశంకర్ రెండో రకం ప్రయత్నం చేసాడు. ఒక దర్శకుడు అలా చేయాలంటే చాలా ధైర్యం అంతకు మించి స్క్రీన్ ప్లే మీద పూర్తీ స్తాయి పట్టు వుండాలి.

కథ:
ఈ గంట మూవీ మనం ఎంత వెతికినా స్టొరీ కనిపించదు. ఒక అబ్బాయి తన కంటే వయసు ఎక్కువ వున్నా అమ్మాయి వెనకాల తిరగడం...ప్రతి సీన్ లో ప్రేమిస్తున్నానని చెప్పటం. మద్య‌లో హీరో ఫ్రెండ్ సర్పరాజు చేసే కామెడీ ...కేవలం నాలుగు కారెక్టర్ల మరియు సూపర్ సీన్‌లతో గంట మూవీ తీసారు.

కథనం విశ్లేషణ:
ఈ గంట మూవీ‌కి స్క్రీన్ ప్లే బాగా కుదిరింది. ఒక అందమైన ప్రేమకథలో ఉండాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. తల్లిదండ్రుల సమస్యలు వుండవు ...హీరో కి జాబు సమస్య వుండదు ..ప్రేమ కథ అంటే పూర్తి స్తాయి ప్రేమ కథ ఈ హ్యాపీ ఎండింగ్. స్క్రీన్ ప్లే స్లో గా వుంటుంది..కాని మంచి ఫ్లో లో వుంటుంది.

ఒక సీన్‌లో మనోజ్, సారిక ప్రేమ కోసం ఒక మొక్క ని నాటుతాడు..తన ఫ్రెండ్ తో ఇదే మా ప్రేమ కి చిహ్నం అని చెపుతాడు ....అది ఎన్ని నీళ్ళు పోసిన పెరగదు ..ఎంత ట్రై చేసిన సారిక, హీరో ప్రేమలో పడదు ...ఒక రోజు సారిక అనుకోకుండా మనోజ్ ఇంటికి వచ్చి ఆ మొక్క‌కి నీళ్ళు పోసి "ఈ మొక్క తప్పకుండా పెరుగుతుంది అని చెపుతుంది". ఈ సన్నివేశంలో సీన్ బాగా పండింది. దర్శకుడు హార్ట్ టచింగ్ సీన్ తెరకెక్కించాడు.

మరో సీన్‌లో సారిక క్యారెక్టర్ హీరో‌ని తన ప్రేమ‌ని నిరుపించమని అడుగుతుంది ..అప్పుడు హీరో మనోజ్ తన ప్రేమ నిరూపించే సీన్ వండర్ ..మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన వుంటే హార్ట్ బీట్ ఎక్కువ అవుతంది..అ సీన్ కి అందరికి అర్థం అయ్యే విధంగా సింపుల్ గా టెర్రిఫిక్‌గా తీసారు. షటిల్ కాక్ సీన్ కూడా చాలా బాగుంది ...ప్రీ క్లైమాక్స్ లో బాధ లో ఎవరినా ప్రేమ గురించి సాడ్ సాంగ్ పెడుతారు ..కాని ఈ దర్శకుడు శాంతి మంత్రం అండ్ నిర్వాణ శతకం పెట్టి తన రూట్ సపరేటు అని నిరుపించుకున్నాడు.

పెర్ఫార్మెన్స్...
సారిక పాత్రలో ఐశ్వర్య గోరక్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన హావభావాలతో పాత్రలో ఒదిగి పోయింది. ఇటు అభినయంతో పాటు అందం కూడా తోడవటం అమెకు మంచి భవిష్యత్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో గా చేసిన మనోజ్ క్యారెక్టర్‌కి సెట్ కాకున్నా తన పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. సర్పరాజ్ గా చేసిన రవి శివ తేజని సరిగా వాడుకుంటే తెలుగు సినిమాకి సంతానం దొరికినట్టే. తన క్యారెక్టర్ ని సూపర్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.

సాంకేతికవర్గం
జయశంకర్ సాధారణమైన సీన్లని తనదైన మార్కు డైలాగులతో ఆకర్షణీయంగా మలిచాడు. అన్ని డైలాగ్స్ బాగున్నాయి. ప్రేమ, కామెడీ, ఎమోషనల్, ఇలా అన్ని సన్నివేశాలకు తగిన విధంగా డైలాగ్స్ బాగా సెట్టయ్యాయి. దర్శకుడు, రచయిత కూడా సినిమాకు మరింత మేలు జరుగుతుంది. జయశంకర్ ఇటు దర్శకత్వంతో పాటు, అటు డైలాగ్స్ పరంగా కూడా సూపర్బ్ అనిపించాడు. ఈ గంట మూవీకి సంగీతం అందించిన రాజ హార్ట్ టచింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరింత వన్నె తెచ్చాడు. శివ శంకర్ వర ప్రసాద్ కెమెరా పనితనం బావుంది.

చివరగా...

మూవీ అంత స్లోగా వుంటుంది బట్ ముందే చెప్పినట్టు మంచి ఫ్లో లో వుంటుంది. మంచి సీన్లు, మంచి సంగీతం, మంచి మాటలు, మంచి కామెడీ. ఇవి చాలు ఈ గంట మూవీ చూడటానికి . మీరు ప్రేమ లో వుంటే ఈ మూవీ తప్పకుండ నచ్చుతుంది.

English summary
Happy Ending Telugu Independent film 2015 directed by Jayashankarr Dazzler. Happy Ending is a story about a 20 year boy who loves a 27 aged girl.
Please Wait while comments are loading...