»   » హృతికే 'బలం', కథే బలహీనత ( హృతిక్ రోషన్ 'కాబిల్' రివ్యూ)

హృతికే 'బలం', కథే బలహీనత ( హృతిక్ రోషన్ 'కాబిల్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
ఫార్ములా చిత్రాలా, విభిన్న చిత్రాలా..ఏ కథలు చేయాలి..ఏవి జనాలకు ఆకట్టుకుంటున్నాయి అనే సందేహం ఎప్పుడూ ఫిల్మ్ మేకర్స్ ని పీడించేది. ఫార్ములా చిత్రాలు చేస్తే రొటీన్ గా అనిపించి తిరస్కరిస్తున్నారు. అలాగని విభిన్న చిత్రాలంటూ చేస్తే ప్రయోగం బాగుంది అంటారు కానీ ధియోటర్ కు వెళ్లి చూసే వాళ్లు కరువు అవుతున్నారు. దాంతో ఫార్ములా బేస్ లో సాగే విభిన్న కథా చిత్రాలు అయితే సేఫ్ అనే భావనకు హీరోలు, డైరక్టర్స్ వచ్చారు. అలాంటి కోవలో వచ్చిందే 'కాబిల్‌' . ఈ చిత్రం తెలుగులో బలం టైటిల్ తో వస్తోంది.

'క్రిష్‌' సిరీస్‌ చిత్రాలతో సూపర్‌హీరోగా మారిన హృతిక్‌రోషన్‌ సినిమా వస్తుందంటే అభిమానులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి మరింత భిన్నంగా తన తండ్రి రాకేష్‌ రోషన్‌ నిర్మించిన 'కాబిల్‌' చిత్రంలో అంధుడి పాత్రను పోషించారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న హృతిక్‌ అంధుడిగా నటించడం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. గతేడాది హృతిక్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించిన 'మొహెంజొదారో' చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ నేపధ్యంలో కాబిల్ చుట్టూ అందరి దృష్టీ పడింది.

పక్కా రివేంజ్ కథకి హీరో,హీరోయిన్స్ ఇద్దరూ అంధులు అవటమే విభిన్నత. మరి ఈ కాన్సెప్టు ఎంతవరకూ అభిమానులను ఆకట్టుకుని, సినిమా ఎలా ఉంది. హృతిక్ రోషన్ నుంచి ఆశించే ఎలిమెంట్స్ ఉన్నాయా వంటి అంశాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

 ఆత్మవిశ్వాశం గల ..

ఆత్మవిశ్వాశం గల ..

ఇది ఆత్మవిశ్వాసం, సెల్ప్ రెస్పెక్ట్ గల రోహన్‌ భట్నాగర్‌(హృతిక్‌) సుప్రియ శర్మ(యామీ గౌతమ్‌) అనే ఇద్దరూ అంధుల కల, కత. రోహన్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా.. సుప్రియ పియానో ప్లేయర్‌గా పనిచేస్తూ జీవితం గడుపుతూంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడి.. పెళ్లి దాకా లీడ్ చేస్తుంది.

 ఆమెను రేప్ చేస్తారు

ఆమెను రేప్ చేస్తారు


పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్‌కి మారి హ్యాపీగా తమ జీవితాన్ని లీడ్ చేద్దామనుకుంటారు. ఇంతలోనే ఆ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌ తమ్ముడు అమిత్‌ షెల్లార్‌(రోనిత్‌ రాయ్‌) అతని స్నేహితుడు కలిసి సుప్రియపై రేప్ చేస్తారు.

 ఆత్మహత్య చేసుకున్నాక

ఆత్మహత్య చేసుకున్నాక


దీంతో రోహన్‌.. సుప్రియలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ న్యాయం జరగదు. పైగా సుప్రియపై మరోసారి రేప్ జరుగుతుంది. దీంతో సుప్రియ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత రోహన్‌ ఏం చేశాడు? తన ప్రాణానికి ప్రాణమైన భార్య సుప్రియపై అత్యాచారానికి పాల్పడిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 కాపీ నే..

కాపీ నే..


హాలీవుడ్ చిత్రం Blind Fury (1989), కొరియన్ చిత్రం Broken (2014) ల నుంచి ఎత్తుకొచ్చిన సీన్స్, క్యారక్టర్స్ తో డిజైన్ చేసినట్లు అర్దమవుతుంది. హాలీవుడ్ డివీడీ డైరక్టర్ గా పేరు పడ్డ డైరక్టర్ సంజయ్ గుప్తా ఈ సినిమాకు దర్శకుడు కావటంతో కాపీలు కామన్ అని సినీ జనం సరిపెట్టారు.

 రక్తి కట్టించింది

రక్తి కట్టించింది

అంధుడైనప్పటికీ హీరో ఎలాంటి ఆధారాలు లేకుండా అంతమొందించడం రక్తి కట్టిస్తుంది. ద్వితీయార్ధం హృతిక్‌ రోషన్‌ స్టైల్‌లో.. యాక్షన్‌ ప్ర‌ధానాంశంగా సాగటం రక్తి కట్టించింది. హృతిక్‌ వేసే ఎత్తుగడలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే కథంతా కూడా ప్రెడిక్టుబల్ గా తర్వాత ఏం జరుగుతుంది అని ప్రేక్షకుడు ఊహకు అందేలా ఉండటంతో కాస్త ఇబ్బదిగా అనిపించినా, ఇంటెన్స్ తో సాగే కొన్ని సీన్స్ ఉత్సుకతను రేకెత్తిస్తాయి.

 స్క్రీన్ ప్లే బాగుంటే..

స్క్రీన్ ప్లే బాగుంటే..


ప్రాణానికి ప్రాణమైన తన భార్యపై అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమైన వారిపై ఒక అంధుడు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ప్రతీకారం తీర్చుకోవడమనేది ఈ కథలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. ఫస్టాఫ్ అంధులైన హృతిక్‌.. యామీల మధ్య ప్రేమ.. అనుబంధం మధ్య సాగుతుంది. సెకండాఫ్ మొత్తం తన భార్య మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడంలోనే సాగిపోతుంది. అయితే స్క్రీన్ ప్లే మరింత ఇంట్రస్టింగ్ గా ఉంటే ఇంకా బాగుండేది.

 ఫెరఫెక్షన్ తో...

ఫెరఫెక్షన్ తో...


ఇప్పటివరకూ హృతిక్ చాలా విభిన్న పాత్రలు పోషించాడు. ‘గుజారీష్'లో శరీరంలో ఎటువంటి కదలిక లేని వ్యక్తిగా అద్భుతంగా నటించిన హృతిక్.., ‘కాబిల్' చిత్రంలో అంధుడిగా అంతకు మించిన పర్ఫెక్షన్ తో ఆకట్టుకొన్నాడు. సినిమా చూస్తున్నంతసేపూ నిజంగానే "కళ్ళు లేవా?" అనే అనుమానం ప్రేక్షకుడికి కూడా కలిగే స్థాయిలో హృతిక్ రోషన్ తన నటనతో అలరించాడు.

 శ్రద్ద తీసుకుని మరీ..

శ్రద్ద తీసుకుని మరీ..


తన ప్రియురాలిపై అఘాయిత్యం చేసిన దుర్మార్గులపై ఓ అంధుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది 'కాబిల్‌' కథ. హృతిక్‌ తన పాత్ర కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అంధుల జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి హృతిక్‌ మూడురోజుల పాటు బయటికి రాకుండా చీకటి గదిలో గడిపాడట. అది తెరపై కనిపించింది.

 కష్టపడింది

కష్టపడింది


యామి గౌతమ్ ఎక్కువ మేకప్ లేకుండా నేచురల్ కనిపించి బాగుందనిపించింది. అలాగే ఆమె ఎక్సప్రెషన్ ఓకే కానీ, అంధురాలిగా మాత్రం చాలా సీన్స్ లో తేలిపోయింది. ఇక హృతిక్‌తో కాంబినేషన్ సీన్స్‌లో అంధురాలిగా నటించడానికి ఆమె పడిన శ్రమ ఆమె ఎక్స్ ప్రెషన్స్‌లో కనిపిస్తుంది.

 ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది

ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది

అమిత్‌గా రోహిత్ రాయ్ విలనిజాన్ని పండించడానికి పెద్దగా ఆస్కారం లభించలేదు. ముఖ్యంగా ఇతగాడిలోని విలనీని ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయకపోవడం మైనస్. రోనీత్ రాయ్ కార్పొరేటర్‌గా హావభావాలతోనే పాత్రను పండించేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా నరేంద్ర ఝా సపోర్టింగ్ లో ఫర్వాలేదనిపించుకొన్నాడు.

 సాంకేతికంగా ...

సాంకేతికంగా ...

ఈ చిత్రానికి రాజేష్ రోషన్ బాణీలు వినసోంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్...సినిమా సన్నివేశాల్లోని ఎమోషన్‌ను చక్కగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఫైట్ సన్నివేశాల్లో హీరో అంధుడు కాబట్టి సింక్ సౌండ్ ఎఫెక్ట్ ను వినియోగించుకొన్న విధానం బాగుంది. సందీప్ చట్టర్జీ-ఆయనంక బోస్ ద్వయం సినిమాటోగ్రఫీ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్టాఫ్ మొత్తం రెగ్యులర్ రొటీన్... ఫ్రేమ్మింగ్స్, యాంగిల్స్ తో సరిపెట్టేసిన వీళ్లిద్దరూ.. సెకండాఫ్ లోని యాక్షన్ సీక్వెన్లకు, క్లైమాక్స్ సీన్ లో లైటింగ్‌ను చక్కగా వినియోగించుకొని దుమ్మురేపారు.

 ఈ సినిమా టీమ్ వీళ్లే...

ఈ సినిమా టీమ్ వీళ్లే...

నటీనటులు: హృతిక్‌రోషన్‌.. యామీ గౌతమ్‌.. రోనిత్‌రాయ్‌.. సురేష్‌ మేనన్‌ తదితరులు

కథ: సంజయ్‌ మసూమ్‌.. విజయ్‌కుమార్‌ మిశ్రా
సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ.. అయనంకా బోస్‌
సంగీతం: రాజేష్‌ రోషన్‌
ఎడిటింగ్‌: అకీవ్‌ అలీ
నిర్మాణం: రాకేష్‌ రోషన్‌
దర్శకత్వం: సంజయ్‌ గుప్తా
విడుదల తేదీ: 25-01-2017

English summary
Revenge is a dish best served blind is the message Kaabil serves up. Hrithik Roshan tries hard and offers us a great performance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu