»   » జబ్ హ్యారీ మెట్ సెజల్ రివ్యూ: మరోసారి నిరాశపరిచిన షారుక్

జబ్ హ్యారీ మెట్ సెజల్ రివ్యూ: మరోసారి నిరాశపరిచిన షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

బాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ రొమాన్స్‌ అంటే కేవలం బాద్షా షారుక్‌ ఖాన్‌ మాత్రమే గుర్తొస్తాడు. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, దిల్ తో పాగల్ హై సినిమాల్లో నటించడం ద్వారా ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఆయన సమ ఉజ్జీలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రేమ కథలను వదలి విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకొంటే షారుక్ ఖాన్ మాత్రం ప్రేమ కథలతోనే ముందుకు సాగుతున్నాడు. ఇటీవల కాలంలో షారుక్ నటించిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనుష్క శర్మతో షారుక్ జతకట్టాడు. లవ్ స్టోరీలను చాలా చక్కగా తెరకెక్కిస్తారనే పేరున్న ఇంతియాజ్ అలీతో కలిసి జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిలీజ్‌కు ముందే ప్రోమోలు, పాటలు చిత్రంపై కొంత హైప్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా షారుక్‌కు సక్సెస్ అందించాదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

 యూరప్‌లో మొదలై..

యూరప్‌లో మొదలై..

హరిందర్ సింగ్ నెహ్రా అలియాస్ హ్యారీ (షారుక్ ఖాన్) యూరప్‌లో టూరిస్ట్ గైడ్. సెజల్ జవేరి (అనుష్క శర్మ) ఒక నెలపాటు విహారయాత్ర కోసం తన కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌కు వెళ్తుంది. సెజల్ బృందానికి నెలరోజులపాటు హ్యారీ గైడ్‌గా వ్యవహరిస్తాడు. టూర్ ముగిసిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు చెప్పి తన బాధ్యతను పూర్తి చేస్తాడు హ్యారీ. కానీ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చే లోపే సెజల్ వచ్చి నిశ్చితార్థ ఉంగరం టూర్‌లో ఎక్కడో పోయింది. తన కాబోయే భర్త రూపెన్‌తో గొడవ జరిగింది. ఆ ఉంగరం లేనిదే ఇండియాకు వెళ్లలేను. పెళ్లి చేసుకోను అని చెప్తుంది. ఆ ఉంగరం దొరికే వరుకు నీవు నాతోనే ఉండాలంటుంది. అందుకు హ్యారీ ఒప్పుకోడు. మీతో తన కాంట్రాక్టు ముగిసింది. ఇక సేవలు అందించలేను అని హ్యారీ స్పష్టం చేస్తాడు.

ఇండియాలో క్లైమాక్స్

ఇండియాలో క్లైమాక్స్

కానీ సెజల్ మొండితనంతో హ్యారీ సరేనని ఒప్పుకొంటాడు. అలా యూరప్‌లోని అమ్‌స్టర్ డ్యామ్, బుడాపెస్ట్, తదితరనగరాల్లో వాళ్ల ప్రయాణం సాగుతుంది. ఉంగరం వెతికే క్రమంలో వారిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. వారిద్దరూ చెప్పుకోలేని ఓ బంధం బలపడుతుంది. ఒకరికొకరు ప్రేమలో పెడుతారు. అలా చాలా నగరాలు తిరిగిన తర్వాత ఉంగరం పోలేదని, తన బ్యాగ్‌లోనే ఉందని సెజల్ తెలుసుకొంటుంది. ఆ తర్వాత బలవంతంగా హ్యారీని విడిచి సెజల్ ఇండియాకు వస్తుంది. తన పెళ్లికి రావాలని కోరగా, తప్పకుండా వస్తానని చెప్తాడు. అలా ఇండియాకు వెళ్లిన సెజల్ పెళ్లి రూపెన్‌తో జరిగిందా? లేదా హ్యారీ, సెజల్ ప్రేమకు ముగింపు ఏమిటి? హ్యారీ, సెజల్ ఒక్కటైతే రూపెన్‌తో పెళ్లి ఎందుకు ఆగిపోయింది? అనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే రెండున్నర గంటల జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్ర కథ.

ఫస్టాఫ్‌ కథనం..

ఫస్టాఫ్‌ కథనం..

నెలరోజుల టూర్ ముగిసే పాయింట్ వద్ద జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమా ఆరంభమవుతుంది. సెజల్ తిరిగి వచ్చి ఉంగరం దొరికే వరకు తనతో ఉండాలని బెట్టు చేయడం, అందుకు షారుక్ అంగీకరించడం వరకు జరిగే సీన్లు చక్కగా ఉంటాయి. ప్రథమార్థంలో ట్రావెల్ ఎపిసోడ్లు బాగనే అనిపిస్తాయి. ప్రథమార్థంలో స్క్రీన్ మీద షారుక్, అనుష్క రెండే రెండు క్యారెక్టర్లు కనిపిస్తాయి. అయినా ప్రేక్షకులను మెప్పించేలా సీన్లను చిత్రీకరించడంలో దర్శకుడు తన ప్రతిభను చూపాడు. ప్రథమార్థంలో స్టోరీ చాలా నెమ్మదిగా సాగిందనిపించినప్పటికీ.. షారుక్, అనుష్క తమ ఫెర్మార్మెన్స్‌తో ఆ లోటును కనిపించకుండా చేశారు. ఫస్టాఫ్‌లో గొప్పగా చెప్పుకొనే విధంగా కథ, సన్నివేశాలు బలంగా లేకపోయినా స్క్రీన్‌ప్లేతో ఇంతియాజ్ అలీ నెట్టుకొచ్చాడు.

సెకండాఫ్‌లో నత్త నడక

సెకండాఫ్‌లో నత్త నడక

బలమైన కథలేకపోవడం వలన కేవలం షారుక్, అనుష్కల మధ్య ఎమోషన్స్ సీన్లు తప్ప ఏమీ కనిపించదు. ప్రేమలో ఉన్న ఇద్దరి మధ్య సంఘర్షణ ఆకట్టుకొనే విధంగా ఉంది. కానీ మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఒకటే మూస ధోరణిలో కథ నెమ్మదిగా కదలడం వల్ల ప్రేక్షకుడికి ఓ దశలో సినిమా ఎప్పుడు క్లైమాక్స్ చేరుకొంటుందిరా బాబో అనే ప్రశ్న మొదలవుతుంది. అనుష్క పెళ్లి కోసం షారుక్ ఇండియాకు రావడం నుంచి ఎండ్ టైటిల్ వరకు సినిమా వేగం అందుకోవడంతో కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఓవరాల్‌గా కథ లేకుండా దర్శకుడు ఇంతియాజ్ కథనంపై స్వారీ చేసిన ప్రయోగమని చెప్పవచ్చు. రెండో భాగంలో చిత్ర నిడివి సినిమాకు ప్రతికూలంగా మారింది.

దర్శకుడిగా విఫలమైన ఇంతియాజ్

దర్శకుడిగా విఫలమైన ఇంతియాజ్

జబ్ వీ మెట్, కాక్ టైల్, తమాషా చిత్రాలతో దర్శకుడు ఇంతియాజ్ అలీ మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నాడు. ఎమోషన్స్‌తో కూడిన ప్రేమకథను తెరకెక్కించడంలో సమకాలీన దర్శకుల్లో మేటి అనే పేరు సొంతం చేసుకొన్నాడు. గతంలో మాదిరిగా ప్రేమ కథలో ఎమోషన్స్ జొప్పించి స్క్రీన్‌ప్లేతో గారడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ గత చిత్రాల్లో ఉండే మ్యాజిక్ కనిపించకపోవడం జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమాకు మైనస్. సినిమా అంతా మూసగా సాగడం వల్ల వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు నిరాశను పంచాడు ఇంతియాజ్ అలీ. రెండు పాత్రలతో చేసిన ప్రయోగం షారుక్, అనుష్క అభిమానులను మెప్పించవచ్చు. కానీ సగటు ప్రేక్షకులు మాత్రం తనదైన శైలిలో షాకిచ్చాడని చెప్పవచ్చు. స్క్రిప్ట్‌లో చాలా లోపాలు కనిపిస్తాయి. ఓవరాల్‌గా ఇంతియాజ్ అలీ కెరీర్‌లో దారుణమైన సినిమా అని చెప్పవచ్చు.

రొటీన్‌గా కింగ్ ఆఫ్ రొమాన్స్

రొటీన్‌గా కింగ్ ఆఫ్ రొమాన్స్

రొమాంటిక్ హీరోగా షారుక్‌కు ఈ సినిమాలోని హ్యారీ పాత్ర కొట్టిన పిండే. ఇలాంటి పాత్రలను షారుక్ ఎన్నో పోషించాడు. గతంలో పోషించిన పాత్రలకు భిన్నంగా లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం. కీలక సన్నివేశాల్లో షారుక్ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం సాదాసీదాగా ఉండటం వల్ల షారుక్‌ నుంచి ఎక్కువ ఆశించకపోవడంమే మంచింది.

 గ్లామర్‌తో అదరగొట్టిన అనుష్క

గ్లామర్‌తో అదరగొట్టిన అనుష్క

ఇక అనుష్క‌కు మరోసారి పరిణతి ఉన్న పాత్రలో కనిపించింది. ఇప్పటికే గ్లామర్ పాత్రలతో అదరగొడుతున్న అనుష్క మరోసారి బరువైన పాత్రతో ఆకట్టుకొన్నది. రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నది. గుజరాతీ యాసలో ఆమె చెప్పిన డైలాగులు బాగున్నాయి. చాలా అందంగా కనిపించి అభిమానులకు పండుగ జేసింది. కాకపోతే రొటీన్ సినిమా కావడం వల్ల కేరీర్‌లో హిట్ పడకపోవచ్చు.

సంగీత ప్రధాన బలం

సంగీత ప్రధాన బలం

ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. స్క్రీన్ ప్లేతో సాగే సినిమాకు హితేజ్ సోనిక్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. ఎమోషన్స్ సన్నివేశాలకు తన సంగీతంతో ప్రీతమ్, హితేశ్ ప్రాణం పోశారు. రెండు, మూడు పాటలు తెర మీద బాగున్నాయి. ఇర్షద్ కమిల్ అందించిన సంభాషణలు సన్నివేశాలకు ప్రాణం పోసాయి. కేయూ మోహనన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.

టైంపాస్ కోసం వెళ్లే వారికి..

టైంపాస్ కోసం వెళ్లే వారికి..

ఎలాంటి అంచనాలు లేకుండా, టైంపాస్ కోసం వెళ్లే ప్రేక్షకులకు, ముఖ్యంగా షారుక్ ఫ్యాన్స్‌కు జబ్ మెట్ హ్యారీ సినిమా నచ్చే అవకాశం ఉంది. యూరప్‌లో విహార యాత్ర చేసినట్టు ఓ ఫీలింగ్ కలుగుతుంది. అంతేగానీ గొప్ప సినిమా చూసిన అనుభూతి ఎట్టి పరిస్థితుల్లో కలుగదనేది గ్యారెంటీ.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
1. షారుక్, అనుష్క శర్మ
2. స్క్రీన్ ప్లే
3. కెమెరా వర్క్

నెగిటివ్ పాయింట్స్
1. కథ
2. డైరెక్షన్

 తెర ముందు.. తెర వెనుక

తెర ముందు.. తెర వెనుక

నటీనటులు: షారుక్ ఖాన్, అనుష్క శర్మ, ఎవెలీన్ శర్మ, చందన్ రాయ్ సన్యాల్
కథ, దర్శకత్వం: ఇంతియాజ్ అలీ
నిర్మాత: గౌరీ ఖాన్
సంగీతం: ప్రీతమ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హితేజ్ సోనిక్
సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్
రిలీజ్: ఆగస్టు 4

English summary
King of Romance Shahrukh Khan, glamour doll anushka Sharma's latest movie Jab Harry met Sejal. Imtiaz Ali dircted the movie. The story revolves around Harry and Sejal's journey across Europe. A search for Sejal's engagement ring makes Harry understand love and relationships better. Sejal experiences new found freedom, security and solace in Harry's company.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu