twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాదుగాడు.... (మూవీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5

    హైదరాబాద్: పక్కింటి అబ్బాయిలా కనిపించే నాగశౌర్య తొలి నుంచి ప్రేమకథల్లో ఇమిడిపోయాడు. 'వూహలు గుసగుసలాడే' , 'దిక్కులు చూడకు రామయ్యా', 'చందమామ కథలు', 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రాల్లోనూ శౌర్య ప్రతిభ ఆకట్టుకొంది. ఇప్పుడు 'జాదూగాడు' అంటూ మాస్‌ హీరోగా మన ముందుకు వచ్చాడు.

    కథ విషయానికొస్తే...
    కోటి రూపాయలు సంపాదించిన తర్వాత మళ్లీ ఊళ్లో అడుగు పెడతానని పాలమూరులో జులాయిగా తిరిగే కృష్ణ(నాగ శౌర్య) ఛాలెంజ్ చేస్తాడు. ఎలాగైనా కోటి రూపాయలు సంపాదించాలని హైదరాబాద్ వస్తాడు. తొలుత బ్యాంక్ లోన్లు రికవరీ చేసే పని మొదలు పెడతాడు. నర్సు పార్వతితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రౌడీ శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) కంట్లో పడతాడు. అతని సత్తా చూసి తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. శ్రీశైలం కేంద్ర మంత్రి జగదీష్ నాయుడు(కోట)కు రైట్ హ్యాండ్. శ్రీశైలం ద్వారా జగదీస్ నాయుడు కోట్ల రూపాయల డీల్స్ నడుపుతుంటాడు. ఓసారి కృష్ణను అతనికి తెలియకుండా 2వేల కోట్ల పెద్ద డీల్ లో ఇరికిస్తాడు శ్రీశైలం. తర్వాత కృష్ణ ఇబ్బందుల్లో పడతాడు....ఈ నేపథ్యంలో కృష్ణ తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది తెరపై చూడాల్సిందే.

    Jadoogadu movie Review

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
    ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయిలా, లవర్ బాయ్ లా కనిపించిన నాగ శౌర్య జాదుగాడుగా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు, పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టాడు. సోనారిక తొలి సినిమాలోనే గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఆమెకు పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా అవకాశం లేకుండా పోయింది. సప్తగిరి కామెడీ ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి పాత్రలో కోట శ్రీనివాసరావు తన సహజ నటన ప్రదర్శించారు. రౌడీ పాత్రలో జాకీర్ హుస్సేన్, పోలీస్ కమీషనర్ పాత్రలో ఆశీష్ విద్యార్థి, సిఐ పాత్రలో రవి కాలే మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చారు. పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్ కామెడీ ఫర్వాలేదు.

    సాంకేతిక పరమైన అంశాలు పరిశీలిస్తే..
    జాదుగాడు సినిమా ద్వారా మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బావుంది. వివిధ సన్నివేశాలకు తగిన విధంగా రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ ప్లస్సయింది. పిక్చరైజేషన్ బావుంది. ఎడిటింగ్ విషయంలో ఎంఆర్ వర్మ ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుండనిపిస్తుంది. సినిమాలో కొన్ని అనవసర సీన్లు తీసేస్తే బావుండు అనిపిస్తుంది. మధుసూదన్ డైలాగ్స్ బావున్నాయి. ఆయన అందించి స్టోరీ గొప్పగా ఏమీ లేక పోయినా ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

    Jadoogadu movie Review

    గతంలో ‘చింతకాయల రవి' చిత్రానికి దర్శకత్వం వహించిన యోగేష్ కథని బాగానే హ్యాండిల్ చేసాడు కానీ....స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా మలచడంలో విఫలం అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య ఉన్నట్టుండి యాక్షన్ పాత్రలో చూడటం కాస్త ఇబ్బందే అనిపిస్తుంది. మాస్ పాత్రకు న్యాయం చేయగల ఇమేజ్ నాగ చైతన్యకు లేదనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య సీన్లు రొమాంటిక్ గా బాగా పండాయి. ఫస్టాఫ్ ఫర్వాలేదు. అయితే సెకండాఫ్ లో హీరో పాత్రను సరిగా చూపించలేక పోయాడు దర్శకుడు. సినిమా క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు.

    ఓవరాల్‌గా... జాదుగాడు యావరేజ్ మాస్ ఎంటర్టెనర్.

    కథ, మాటలు: మధుసూదన్‌,
    పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి,
    ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.
    కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
    సంగీతం: సాగర్‌ మహతి
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ‘చింతకాయల రవి' ఫేమ్‌ యోగేశ్‌
    నిర్మాత: వి.వి.ఎన్‌. ప్రసాద్‌
    విడుదల తేది: 26, జూన్ 2015.

    English summary
    Check out Jadoogadu movie Review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X