twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జానీ..ఇదేమీ కహానీ?

    By Staff
    |

    Johnny
    -ఎ.మాధవి
    చిత్రం: జానీ
    నటీనటులు: పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయి, రఘువరన్‌,
    గీత, మల్లికార్జునరావు, ఆలీ, ఎం.ఎస్‌.నారయణ
    సంగీతం: రమణ గోగుల
    నిర్మాత: అల్లు అరవింద్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పవన్‌ కళ్యాణ్‌

    పవన్‌ కళ్యాణ్‌ గత చిత్రాలన్నింటికి తానే దర్శకత్వం వహించాడనే పేరుంది. కానీ, ఆయన అధికారికంగా తొలిసారి దర్శకత్వం వహించిన జానీ చిత్రం చూసిన తర్వాత సందేహం పడాల్సి వస్తుంది. చాలా అర్ధరహితంగా, కథనంలో ఏ మాత్రం పట్టులేకుండా, నేల విడిచి సాము చేసిన వైనం ఈ చిత్రంలో కన్పిస్తుంది. 'మనది' కానీ సంస్కృతిని ప్రతిబింబించే దృశ్యాలు, సీన్లు, సెట్లు, అర్థం కానీ డైలాగ్స్‌, చిన్న పాయింట్‌ తో హాలీవుడ్‌ తరహాలో టెక్నికల్‌ గిమ్మిక్కులతో సినిమా లాగించాలన్న ప్రయత్నం మినహా సినిమాలో ఆకట్టుకునే అంశం అంటూ ఏమీ లేదు.‌

    కాస్తా ప్రథమార్థం ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్‌ లో తెలుగు ప్రేక్షకుల సహనాన్ని మరీ దారుణంగా పరీక్షించాడు. డాక్యుమెంటరీ తరహాలో రూపొందించి సెకండాఫ్‌ లో అందర్నీ భయపెట్టేశాడు. ఆసుపత్రి దృశ్యాలు, ఫైట్‌, ట్రీట్‌ మెంట్‌, డబ్బులు కట్టడం, మళ్ళీ ఫైట్‌, ఆసుపత్రి..ఇలా ఓ 45 నిమిషాల పాటు ఇవే సీన్లు తిరిగి తిరిగి చూపించడంలోని స్క్రీన్‌ ప్లే కిటుకు ఏమిటో ఒక్క పవన్‌ కళ్యాణ్‌ కే తెలియాలి. సాంకేతికంగా తనకు ప్రతిభ ఉందని ఈ సినిమా ద్వారా పవన్‌ నిరూపించుకున్నప్పటికీ కథకు సంబంధం లేని సాంకేతికత ఎందుకు?‌

    జానీ(పవన్‌) తాగుబోతు తండ్రికి దూరంగా ఒక ఆంథోని కేఫ్‌ లో పెరుగుతాడు. తల్లి చనిపోతుంది. కేఫ్‌ పక్కన మార్షల్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ ఇస్తూ..'సీరియస్‌'గా బతుకుతుంటాడు. అలాంటి వాడి జీవితంలోకి గీత (రేణు దేశాయి) ప్రవేశిస్తుంది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి అయ్యాక తెలుస్తుంది ఆమెకు ల్యూకెమియా అని. కానీ ఆమెను బతికించుకునేందుకు డబ్బులు ఉండవు.‌

    ముంబైలో ఓ ఆసుపత్రిలో చేర్పిస్తాడు. ఆమె వైద్య పరీక్షల కోసం డబ్బుల కోసం రెస్లింగ్‌ టైప్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొంటాడు. ఇక ఒకణ్ణి కొట్టడం డబ్బులు తేవడం, ఆస్పత్రిలో ఫీజు కట్టడమే..దాదాపు సెకండాఫ్‌. క్లైమాక్స్‌ లో హీరో రెండులక్షల కోసం పోటీపడి...హీరోయిన్‌ ఆపరేషన్‌ ను పూర్తి చేయడంతో కథ ముగుస్తుంది.‌

    ఇలాంటి అతి సాధారణ కథకు స్క్రీన్‌ ప్లేను సరిగా రూపొందించుకోవడంలో పవన్‌ దారుణంగా ఫెయిల్‌ అయ్యాడు. దీనికితోడు క్యారక్టరైజేషన్‌ మరీ వీక్‌. పవన్‌ కళ్యాణ్‌ రోగియా, రేణు దేశాయి రోగియా అని తెలియకుండా ఇద్దరూ మరీ 'వీక్‌'గా సినిమా అంతా కన్పిస్తారు.‌

    సినిమా సెట్టింగ్‌ లు, చుట్టు ఉండే వాతావరణం, అర్థం కానీ హిందీ-తెలంగాణయాస-ఇంగ్లీషు పదాల కలపోతతో కూడిన డైలాగ్స్‌ ఒక్కముక్క అర్థం కావు. ఇక మాస్టార్జీ రాసిన మూడు పాటలు కూడా సినిమాకు అతకవు. ఆ పాటల కోసమే సినిమాల్లో సన్నివేశాలను సృష్టించినట్లు కన్పిస్తుంది. హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం అధికంగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులు చూడకుండా ఉండడమే మంచిది. హార్డ్‌ కోర్‌ పవన్‌ అభిమానులు కూడా చూడలేని చిత్రం ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X