twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కణం సినిమా రివ్యూ: సాయిపల్లవి మళ్లీ అదరగొట్టింది!

    By Rajababu
    |

    Recommended Video

    kanam movie review:Saipallavi Gets The Credit

    Rating:
    2.5/5
    Star Cast: సాయి పల్లవి, నాగశౌర్య, బేబీ వెరోనికా
    Director: ఏఎల్ విజయ్

    ప్రేమమ్ (మలయాళ వెర్షన్), ఫిదా, ఎంసీఏ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సాయి పల్లవి తాజా చిత్రం కణం. గర్భస్రావం వల్ల పసిగుడ్డుల జీవితాలను చితికేస్తున్న అంశాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందించారు. దేశంలో గర్బస్రావం చట్టరీత్యా వ్యతిరేకం. కానీ దేశంలో ఏటా లక్షల గర్భస్రావాలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గర్భంలోనే పసిగుడ్డును చంపేయడం వల్ల ఓ ఇందిరాగాంధీ, కల్పనా చావ్లా, సానియా మిర్జా, పీవీ సింధూ లాంటి వాళ్లను కోల్పోతున్నామనే సందేశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే.

     కణం కథ

    కణం కథ

    తులసి (సాయిపల్లవి), కృష్ణ (నాగశౌర్య) ప్రేమికులు. కాలేజీలో చదుతున్నప్పుడే తొందరపడటం వల్ల తులసి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు తులసికి అబర్షాన్ చేయిస్తారు. వారి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించి ఐదేళ్ల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. చదువులన్నీ పూర్తయి, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత తులసి, కృష్ణకు పెళ్లి చేస్తారు.

    స్టోరీలో ట్విస్టులు

    స్టోరీలో ట్విస్టులు

    తులసి, కృష్ణ పెళ్లి అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థిలో చనిపోతుంటారు. వారు ఎలా చనియారు? ఎందుకు చనిపోయారు? వారిని ఎవరు చంపారు? తన భర్తను కాపాడుకోవడానికి తులసి ఏమి చేసింది అనేవి ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన అంశాలు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రానికి సంబంధించిన పలు సందేహాలకు సమాధానం కణం సినిమాలో వెతుక్కోవచ్చు.

    కణం.. ఫస్టాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    కణం.. ఫస్టాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    మొదటి భాగంలో తులసి అబార్షన్, ఆ తర్వాత పెళ్లి లాంటి సన్నివేశాలతో చకచక అసలు కథలోకి వెళ్లుంది. తులసి, కృష్ణ దంపతులైన తర్వాత వరుసగా అనుమానాస్పద మరణాలతో సినిమా ఆసక్తిగా మారుతుంది. కథ, కథనాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవ్వడంతో కథలో ప్రేక్షకుడు లీనమైపోతాడు. దియా (బేబీ వెరోనికా) ఎంట్రీతో సినిమా ఎమోషనల్‌గా సాగుతుంది. తన కుటుంబ సభ్యుల మరణాలకు అసలు కారణం తెలియడమనే అంశంతో తొలిభాగానికి బ్రేక్ పడుతుంది.

    కణం.. సెకండాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    కణం.. సెకండాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    రెండో భాగంలో తన భార్త ప్రాణాలకు కూడా ముప్పు ఉందనే అంశాన్ని తులసి తెలుసుకోవడం ద్వారా కథను దర్శకుడు ముందుకు తీసుకెళ్తాడు. కథలో ఇంట్రస్టింగ్ అంశాలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి? ఆలోచింపజేస్తాయి. చివరి 15 నిమిషాలు సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి. చక్కటి సందేశంతో కణం సినిమా ఎమోషనల్‌గా ముగుస్తుంది.

     డైరెక్షన్, టేకింగ్

    డైరెక్షన్, టేకింగ్

    దర్శకుడు ఏఎల్ విజయ్ ఎంచుకొన్న పాయింటే సినిమా విజయానికి సగం కారణమని చెప్పవచ్చు. కథ, కథనాలతో సినిమాను దర్శకుడు పరుగులు పెట్టించాడు. అలాగే పాత్రల కోసం నటీనటుల ఎంపికలో మరికొంత విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుడిని భావోద్వేగంతో నింపడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కమర్షియల్ అంశాలు లేకపోవడం కొన్ని వర్గాల ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేస్తుంది. ఓవరాల్‌గా కణం దర్శకుడి విజన్‌కు సంబంధించిన చిత్రమని చెప్పవచ్చు.

    సాయి పల్లవి యాక్టింగ్

    సాయి పల్లవి యాక్టింగ్

    భావోద్వేగ అంశాల కలయికతో రూపకల్పన చేసిన తులసి పాత్రకు సాయిపల్లవి ఎంపిక సరైనదే అని ప్రతీ ప్రేక్షకుడు ఫీలవుతాడు. ప్రతీ ఫ్రేములో సాయి పల్లవి విభిన్నమైన, విలక్షణమైన నటనను ప్రదర్శించింది. కీలక సన్నివేశాల్లో ఆమె చూపించి హావభావాలు హైలెట్. ఇప్పటికే చేరువైన సాయిపల్లవి కణం సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. సాయిపల్లవి కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకమైనదనే చెప్పవచ్చు. గ్లామర్ పాత్రలనే కాదు.. నటనకు స్కోప్ ఉన్న సినిమాలను ఒంటిచేత్తో మోయగల సామర్థ్యం తనకు ఉందని సాయిపల్లవి రుజువు చేసుకొన్నారు.

    నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్

    నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్

    కణం చిత్రంలో కృష్ణ పాత్రలో నాగశౌర్య కనిపించాడు. కీలకమైన సన్నివేశాల్లో తనదైన నటనతో మెప్పించాడు. కథలో కీలక ఘట్టాల్లో భాగమై కథను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నాగశౌర్య పాత్ర ఉపయోగపడింది. ఇప్పటివరకు లవర్ బాయ్ క్యారెక్టర్‌లో కనిపించిన నాగశౌర్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. ఓ మంచి చిత్రంలో నటించినప్పటికీ నాగశౌర్య కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడని పాత్ర అని చెప్పవచ్చు. హీరోగా ఓ రేంజ్‌కు వెళ్లాలనుకొంటున్న నాగశౌర్య ఇలాంటి పాత్రలు చేయకపోవడం బెటర్ అనేది మెజార్టీ వర్గాల అభిప్రాయం.

     బేబీ వెరోనికా, ప్రియదర్శి యాక్టింగ్

    బేబీ వెరోనికా, ప్రియదర్శి యాక్టింగ్

    దియాగా బేబి వెరోనికా తన కళ్లతోనే నటనను పలికించి ఆకట్టుకొన్నది. కేవలం రెండు, మూడు డైలాగ్స్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా అభినయాన్ని పలికించింది. ఐఎస్ పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకొన్నాడు. తనదైనా శైలిలో హస్యాన్ని పంచాడు. మిగితా పాత్రలో నిళగల్ రవి, రేఖ, సంతాన భారతి తదితరులు నటించారు.

    మ్యూజిక్ ఓ ఎస్సెట్

    మ్యూజిక్ ఓ ఎస్సెట్

    కణం ఓ ఎమోషనల్‌గా సాగే కథ. దానికి సామ్ సీఎస్ సంగీతం ప్రాణం పోసింది. సినిమాకు ప్రధానమైన సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో వెన్నెముకగా నిలిచింది. ఈ సినిమాకు మ్యూజిక్ ఓ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

    సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించడంలో నిరవ్ షా తన వంతు పాత్రను సంపూర్ణంగా నిర్వహించారు. సాయిపల్లవి, నాగశౌర్యను అందంగా తెరమీద చూపించడంలోనూ, ఎమోషనల్ సీన్లకు జీవం పోయడం దగ్గర నుంచి హారర్, థ్రిల్లింగ్ అంశాలను స్క్రీన్ మీద ఎలివేట్ చేయడంలో నిరీవ్ షా తన మార్కును చూపించాడు.

    ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్

    ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్

    కణం సినిమాలో పాటలు, కమర్షియల్ అంశాలకు స్కోప్ లేకపోవడం కథనే నమ్ముకొని సినిమాను రూపొందించడం వల్ల ఎడిటర్ ఆంథోనికి పని సులభం అయింది. సినిమాను ఆసక్తిగా మలచడం ఆంథోని ప్రతిభకు అద్దం పట్టింది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    భారీ బడ్జెట్ చిత్రాలను అందించే లైకా ప్రొడక్షన్ ఓ చక్కటి కథను ఎంచుకొని మీడియం రేంజ్‌లో కణం లాంటి సినిమాను అందించడం వారి అభిరుచికి అద్దం పట్టింది. సందేశంతోపాటు ఆలోచింపజేసే సినిమాను చాలా రిచ్‌గా, ఉన్నతమైన నిర్మాణ విలువలను పాటించారు. ప్రేక్షకుడు పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేసే విధంగా ఈ సినిమాను తెరక్కించారు.

     ఫైనల్‌ జడ్జిమెంట్

    ఫైనల్‌ జడ్జిమెంట్

    దేశం ఎదుర్కొంటున్న ప్రజారోగ్య సమస్యలో గర్భస్రావం ఒకటి. దీనివల్ల వెలుగు చూడకుండానే పసిగుడ్డు జీవితం ఛిద్రమైపోతున్నది. అంతేకాకుండా తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది. ఇలాంటి అంశంతో తెరకెక్కిన చిత్రాన్ని సాయిపల్లవి అంగీకరించడమే సినిమా కథకు న్యాయం జరిగింది. కమర్షియల్ చిత్రాల పేరుతో ప్రేక్షకుడిని నానా హింసకు గురిచేస్తున్న సమయంలో కణం ఓ ఆలోచింపజేసే చిత్రం. కమర్షియల్ ఎంత రాబడుతుందనే విషయాన్ని పక్కన పెడితే కోట్లాది ప్రజలను చైతన్య పరిచే చిత్రం అవుతుంది.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    సాయి పల్లవి యాక్టింగ్
    ఏఎల్ విజయ్ టేకింగ్
    కథ, కథనం
    మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయింట్స్
    కమర్షియల్ అంశాలు లేకపోవడం

     తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: సాయి పల్లవి, నాగశౌర్య, బేబీ వెరోనికా, ప్రియదర్శి తదితరులు
    దర్శకత్వం: ఏఎల్ విజయ్
    నిర్మాత: లైకా ప్రొడక్షన్
    సినిమాటోగ్రఫి: నిరవ్ షా
    మ్యూజిక్: సామ్ సీఎస్
    ఎడిటింగ్: ఆంథోని
    రిలీజ్ డేట్: 27 ఏప్రిల్ 2018

    English summary
    Kanam in Telugu is a 2018's horror thriller drama film directed by A. L. Vijay and produced by Lyca Productions. The film stars Sai Pallavi and Veronika Arora in the lead role, while Naga Shourya portray of male lead.This movie released on 27 April, 2018. In this occassion, Telugu Filmibeat brings exclusive review..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X