Kantara Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 ట్విట్టర్ రివ్యూ
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు.
ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కంతార చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను, కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమా గురించి సెన్సార్ రివ్యూ ఎలా ఉంటుందనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. అయితే ఈ సినిమా ప్రీమియర్లు అక్టోబర్ 1వ తేదీన మొదలయ్యాయి. ఈ ప్రీమియర్ షో తర్వాత నెటిజన్లు, క్రిటిక్స్ ఎలా స్పందించారనే వివరాల్లోకి వెళితే..

కాంతార చిత్రాన్ని ఇప్పుడే చూశాను. మైండ్ బ్లోయింగ్ ప్రీక్వెల్. రిషబ్ శెట్టి మరోసారి తాను ఎంత గొప్ప స్టోరీ టెల్లర్ అని నిరూపించుకొన్నాడు. విజువల్స్, డివైనిటీ, ఎమోషన్స్, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్. కాంతార చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా మరోసారి ఆ బాక్సాఫీస్‌ను అంతకు మించి షేక్ చేస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కాంతార చాప్టర్ 1 సినిమా ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ వస్తున్నది. ఈ సినిమా తప్పకుండా 2000 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఖాయం. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే అబిప్రాయాన్ని నెటిజన్ వ్యక్తం చేశాడు.
గుడ్ ప్రజెంటేషన్, వీఎఫ్ఎక్స్ బాగుంది, మరీ ముఖ్యంగా టైగర్ సీక్వెన్స్ అదిరిపోయిందని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు
రిషబ్ శెట్టి మళ్లీ తన ప్రతిభను కనబరిచారు. దర్శకుడిగా, నటుడిగా కాంతార ఆత్మ సజీవంగా ఉండేలా చూసుకున్నాడు. అజనీష్ ఇచ్చిన బీజీఎం హైలైట్.. సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. ఫస్టాఫ్‌లో సాంప్రదాయాలు, సంస్కృతితో ముడిపెట్టి నడిపించారు. సెకండాఫ్‌లో హై ఓల్టేజ్ యాక్షన్, భావోద్వేగాలతో నిండి ఉంది. క్లైమాక్స్‌లో రిలయ్ ఫైర్ చూపించారు.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
రిషబ్ శెట్టి ఫైర్, అద్భుతమైన ఫర్ఫార్మర్. చివరి 30 నిమిషాల ఎపిసోడ్‌కి మాటలు రావడం లేదు. ఆ గూస్‌బంప్స్ నిండిన క్షణాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అని నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
కాంతార చాప్టర్ 1ని ఖచ్చితంగా చూడాల్సిందే. రిషబ్ శెట్టి బ్రిలియంట్ పర్పార్మెన్స్ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. రుక్మిణీ వసంత్ పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకెట్‌తో వచ్చారు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ అయితే ఫైరే. జానపద కథలు, విశ్వాసం, రహస్యం, సాంకేతిక ప్రతిభల సమ్మేళనమే కాంతార చాప్టర్ 1. సీజీ వర్క్, నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.. గుహ లోపల సన్నివేశాలు, వార్ సీన్స్‌తో మహాశివుడు మనకు కనెక్ట్ అవుతాడని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











