For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kothala Rayudu review.. శ్రీకాంత్ కోతలు మెప్పించాయా? మూవీ ఎలా ఉందంటే?

  |

  Rating: 2.5/5

  కోతలరాయుడు సినిమా టైటిల్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో చేసిన సినిమా కావడం, ఆ టైటిల్‌తో శ్రీకాంత్ వస్తున్నాడనే వార్త అందరిలో ఆసక్తిని రేపింది. శ్రీకాంత్, నటాషా దోషి, డింపుల్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజా కోతలరాయుడు ఎలాంటి అనుభూతిని కలిగించాడనే విషయంలోకి వెళితే..

  ట్రావెల్ ఎజెన్సీలో మేనేజర్‌గా ఉద్యోగం చేసే అజయ్ (శ్రీకాంత్) నీళ్లలా డబ్బును ఖర్చు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన ధనలక్ష్మీ (నటాషా దోషి)తో ప్రేమలో పడుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో ధనలక్ష్మితో నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత అజయ్ మరోసారి ప్రేమలో పడుతాడు. సంధ్య అనే యువతిని ఇష్టంగా ప్రేమిస్తాడు.

  సంధ్యను ప్రేమించిన తర్వాత అజయ్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొన్నాయి? ధనలక్ష్మీతో నిశ్చితార్థం ఎందుకు విఫలమైంది? అజయ్ విలాసవంతంగా జీవితాన్ని గడుపాలనుకొనే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? సంధ్యతో ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది? అజయ్ జీవితానికి ఎలాంటి ఫినిష్ లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే కోతల రాయుడు సినిమా కథ.

  Kothala Rayudu movie review and rating: Srikanths Routine love drama

  వందకుపైగా చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ మరోసారి విభిన్నమైన పాత్రతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అజయ్‌గా రెండు విభిన్నమైన కోణాలు ఉన్న పాత్రను పోషించారు. ప్రియుడిగా, ట్రావెల్ ఎజెన్సీలో మేనేజర్‌గా తనదైన శైలిలో నటించాడు. నటాషా, డింపుల్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. వీరిద్దరూ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నారు. 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ, హేమ మధ్య సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. పోసాని, మురళీశర్మ పాత్రలు సినిమాకు ఆకర్షణగా మారాయి.

  ఇక దర్శకుడు సుధీర్ రాజు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. దానిని ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, యూత్‌ఫుల్‌గా మలిచిన తీరు బాగుంది. అయితే కొన్ని సన్నివేశాలుగా రొటీన్‌గా అనిపించడం కాస్త ప్రేక్షకులను నిరాశ కలిగిస్తుంది. మిగితా విషయాలను పర్‌ఫెక్ట్‌గా డీల్ చేశాడని చెప్పవచ్చు. ఇంకాస్త కథ, కథనాలపై దృష్టిపెట్టి ఉంటే మంచి ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది.

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. బుజ్జి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. సిక్కిం, తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన పాటలు బాగున్నాయి. సునీల్ కశ్యప్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా ఉంది. విక్రమ్ రాజ్, స్వామి మండేలా అందించిన సంభాషణలు కథకు తగినట్టుగా ఉన్నాయి. ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక నిర్మాతలకు సినిమాపై ఉన్న అభిరుచిని తెలియజెప్పిందనిపిస్తుంది.

  కోతలరాయుడు సినిమా లవ్, సెంటిమెంట్, వినోదం కలిసిన ఎంటర్‌టైనర్. రెగ్యులర్ కథను విభిన్నమైన కథనంతో తెర మీద చెప్పే ప్రయత్నం చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కోతలరాయుడు మిమ్మల్ని నిరాశపరచడు. ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఆస్కారం ఉన్న చిత్రమిది.

  నటీనటులు: శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు
  నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్
  సంగీతం: సునీల్ కశ్యప్
  సినిమాటోగ్రఫీ: బుజ్జి
  ఎడిటర్: ఉద్ధవ్
  మాటలు: విక్రమ్ రాజ్, స్వామి మండేలా
  ఆర్ట్ డైరెక్టర్: ఠాగూర్
  పాటలు: కంది కొండ
  ఫైట్స్: రియల్ సతీష్
  పబ్లిసిటి డిజైనర్: ధని ఏలే
  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్ వర్మ
  కో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డి
  రిలీజ్ డేట్: 2022-02-04

  English summary
  Srikanth's latest movie is Kothala Rayudu. This movie released on Feb 4th, 2022. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X