twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mimi movie review: సర్రోగసి తల్లిగా కృతి సనన్.. ఎమోషనల్ పాత్రలో ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

    |

    Rating:
    2.5/5
    Star Cast: కృతి సనన్, పంకజ్ త్రిపాఠి, సుప్రియా పాథక్
    Director: లక్ష్మణ్ ఉటేకర్

    బాలీవుడ్ నటి కృతి సనన్ 1 నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబు పక్కన గ్లామర్ తారగా నటించి మెప్పించింది. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తాజాగా కృతి సనన్ నటించిన మిమి చిత్రం థియేటర్లల మూసివేత కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో రిలీజ్ అయింది. సర్రోగసి మదర్‌గా నటించిన కృతి సనన్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ మూవీ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమిటనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం.

    పల్లెటూరి యువతి (మిమి రాథోడ్) బాలీవుడ్‌లో హీరోయిన్ కావాలనే కలలతో జీవితాన్ని కొనసాగిస్తుంటుంది. పేదరికం కారణంగా తన లక్ష్యానికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో విదేశీ దంపతులు సమ్మర్, జాన్ (ఎవ్లీన్ ఎడ్వార్డ్స్, జాన్) మిమి గ్రామానికి వచ్చి అద్దెకు గర్బం కావాలని ఆ గ్రామంలోని భాను ప్రతాప్ పాండే (పంకజ్ త్రిపాఠి)ని కలుస్తారు. అద్దెకు గర్భం ఇచ్చి పిల్లాడికి జన్మనిస్తే 20 లక్షల రూపాయలు ఇస్తామని విదేశీ దంపతులు ఆశచూపుతారు. అయితే భాను ప్రతాప్ ఒత్తిడి మేరకు మిమి తన గర్బాన్ని అద్దెకు ఇవ్వడానికి సిద్దమవుతుంది. విదేశీ దంపతులతో జరిగిన ఒప్పందం ప్రకారం.. కడుపులో బిడ్డను పెంచడం మొదలుపెడుతుంది. అయితే ఓ రోజు విదేశీ దంపతులు వచ్చి మాకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మాకు అవసరం లేదని చెప్పి వెళ్లిపోతారు.

    Kriti Sanons Mimi movie review and rating

    పెళ్లి కాకుండానే కడుపులో బిడ్డ పెరుగుతున్న మిమి ఆ పరిస్థితులను ఎలా ఆకలింపు చేసుకొన్నది? కడుపులో బిడ్డ పెరుగుతున్న గ్రామస్థుల స్పందన ఎలా ఉంది? కాంట్రాక్టు ఉల్లంఘించడంతో భానుప్రతాప్ పరిస్థితి ఏమైంది? బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత మళ్లీ బిడ్డ కావాలని వచ్చిన విదేశీ దంపతులకు మిమి ఎలాంటి గుణపాఠం నేర్పింది? పెళ్లి కాకుండానే తల్లి అయిన మిమి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నదనే ప్రశ్నలకు సమాధానమే మిమి.

    మిమి మూవీ కథలో మంచి భావోద్వేగం కనిపిస్తుంది. దర్శకుడు లక్ష్మన్ ఉటేకర్ ఎంచుకొన్న థీమ్ బాగుంది కానీ.. కథలో నాటకీయత, భావోద్వేగాన్ని ప్రభావవంతంగా జొప్పించలేకపోవడం సినిమాకు ఓ ప్రతికూలంగా మారింది. కథనం విషయానికి వస్తే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తాపీగా నడుస్తుంటుంది. అయితే చివరి 30 నిమిషాల్లో కథలో వేగం, భావోద్వేగం, నాటకీయత కనిపిస్తుంది. అయితే సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే అంశాలు మాత్రం కొరవడినట్టే చెప్పుకోవాలి. ఇలాంటి ప్రతికూల అంశాల మధ్య కృతిసనన్ ఫెర్ఫార్మెన్స్ సినిమాను ఫీల్‌గుడ్‌గా నిలబెట్టింది.

    ఇక కృతి సనన్ నటన విషయానికి వస్తే మిమి పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ పాత్రలే కాదు.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను కూడా చేసి మెప్పించగలను అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అల్లరి పిల్లగా, గర్బవతిగా, పిల్లాడికి తల్లిగా పలు రకాల కోణాలు, భావోద్వేగం ఉన్న పాత్రలో మెప్పించింది. పాత్ర పరిధి మేరకు తాను 100 శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు.

    Kriti Sanons Mimi movie review and rating

    ఇక భాను ప్రతాప్ పాండేగా మరోసారి పంకజ్ త్రిపాఠి తన నటనతో ఆకట్టుకొన్నాడు. గ్రామంలో బ్రోకర్‌గా తనదైన శైలిలో మెప్పించాడు. మిమికి అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత పంకజ్ త్రిపాఠి నటన మరింత ఆకట్టుకొన్నది. అలాగే సర్రోగసి కోసం మిమిని ఒప్పించే సీన్లలో కాస్త వినోదాన్ని కూడా పండించాడు. క్లైమాక్స్‌లో కొన్ని సన్నివేశాల్లో తనదైన మార్కు నటనను చూపించాడు. మిమి తల్లిగా సుప్రియా పాథక్ పరిమితమైన పాత్రలో కనిపిస్తారు. అలాగే సాయి తమ్మాంకర్ మిమి స్నేహితురాలిగా కనిపంచింది.

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు కూడా బాగుంది. కథలో వైవిధ్యం లేకపోవడం వల్ల ఈ మూవీలో సినిమాటోగ్రఫి గానీ, ఇతర అంశాలు గానీ ప్రభావం చూపలేకపోయాయి. ఒకే పాయింట్‌తో కథ సాగడం, పాత్రల మధ్య విలక్షణ లేకపోవడం, కథలో ఎమోషనల్ పాయింట్స్ లేకపోవడం వల్ల మ్యూజిక్, ఆర్ట్ విభాగాలు పనితీరు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రఫిని ఆకాశ్ అగర్వాల్, ఎడిటింగ్ మనీష్ ప్రధాన్, మ్యూజిక్ ఏఆర్ రెహ్మాన్ అందించారు. కానీ ఏఆర్ రెహ్మాన్ మార్కు మ్యూజిక్ ఎక్కడా కనిపించదు.

    చివరగా మిమి మూవీ విషయానికి వస్తే.. భావోద్వేగాలకు మంచి స్కోప్ ఉన్న చిత్రం. కానీ ఎమోషనల్ కంటెంట్ కొరవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. మరాఠీలో సమ్రుద్దీ పోరే దర్శకత్వంలో వచ్చిన మాలా ఆయ్ వచ్చై, తెలుగులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన వెల్‌కమ్ ఒబామా సినిమాకు రీమేక్‌గా రూపొందింది. తెలుగులో ఉండే భావోద్వేగాలను కూడా మిమి పండించలేకపోయింది.కృతిసనన్, పంకజ్ త్రిపాఠి ప్రేక్షకులను మెప్పించే రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారాంతంలో ఫ్యామిలీతో చూడటానికి అవకాశం ఉన్న చిత్రంగా చెప్పవచ్చు.

    నటీనటులు: కృతి సనన్, పంకజ్ త్రిపాఠి, సాయి తమ్హాంకర్, సుప్రియా పాథక్ తదితరులు
    దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్
    నిర్మాత: దినేస్ విజాన్, జియో స్టూడియోస్
    సినిమాటోగ్రఫి: ఆకాశ్ అగర్వాల్
    ఎడిటింగ్: మనీష్ ప్రధాన్
    మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
    బ్యానర్: మడోక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్
    ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
    ఓటీటీ రిలీజ్: 2021-07-27

    English summary
    Actress Kriti Sanon's latest Mimi movie is released on Netfilx OTT. This is remake of Marati Movie Mala Aai Vhhaychy! and Welcome Obama of Telugu. This movie directed by Laxman Utekar. Produced by dinesh Jain. Music by AR Rahman. This movie released on 26 July 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X