For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్

  |
  Lakshmi's NTR Review And Rating || లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

  Rating:
  3.5/5
  Star Cast: విజయ్ కుమార్, యజ్ఞశెట్టి, శ్రీ తేజ్
  Director: రాంగోపాల్ వర్మ, ఆగస్త్య మంజు

  వెండి తెర దైవం నందమూరి తారక రామారావు. రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం పేదవాడికి ఆయన ఆసరా, భరోసా. అలాంటి మహనీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అధికారం, కుటుంబం దూరమైన మానసిక క్షోభతో పలు కుట్రల మధ్య ఈ లోకాన్ని వీడారు. లక్ష్మీ పార్వతి తన జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు, చోటుచేసుకొన్న కుట్రలను నేపథ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని, ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని కలిగించే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

   లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరీ

  లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరీ

  1989 తర్వాత అధికారం కోల్పోయి, కుటుంబం, నేతలు, స్నేహితులు, సన్నిహితులు దూరమై ఎన్టీఆర్ (విజయ్ కుమార్) ఒంటరిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న సమయంలో తన జీవిత చరిత్రను రాయడానికి లక్ష్మీపార్వతి (యజ్ఞశెట్టి) ఆయన గడపలోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీపార్వతి మాటలు, వ్యక్తిత్వం వల్ల ఆమెకు ఆయన దగ్గరవువతాడు. ఇది బాబు ( శ్రీ తేజ్)కు, కుటుంబానికి, నేతలకు సహించదు. ఎన్టీఆర్‌ నుంచి దూరం కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆమె పట్ల ఉన్న నమ్మకం, ప్రేమ వల్ల ఆయనకు లక్ష్మీపార్వతి మరింత చేరువవుతుంది. ఈ క్రమంలో తన చుట్టు ఉన్న కుటుంబ సభ్యులు, బాబు వ్యూహాలను పసిగట్టిన ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతికి భద్రత కల్పించడానికి మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేడుకలో వివాహం చేసుకొంటున్నట్టు ప్రకటిస్తాడు.

   లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్విస్టులు

  లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్విస్టులు

  లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకొన్న తర్వాత బాబు శిబిరం పన్నిన వ్యూహాలు ఏమిటి? లక్ష్మీపార్వతిపై బాబు ఎలాంటి నిందలు మోపాడు? లక్ష్మీపార్వతిని బూచిగా చూపి బాబు చేసిన కుట్రలు ఏమిటి? వైశ్రాయి హోటల్ వద్ద చెప్పులు విసిరిన ఘటన తర్వాత ఎన్టీఆర్ మానసికంగా ఎలా చనిపోయాడు? ఎన్టీఆర్ మరణానికి బాబు ఎలా కారణమయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కథ.

   ఫస్టాఫ్ రివ్యూ

  ఫస్టాఫ్ రివ్యూ

  1989లో అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవితం, ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశంతో సినిమా ఆరంభం అవుతుంది. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ మధ్య బలపడిన బంధం, భర్త వీరగ్రంథం సుబ్బరావుతో లక్ష్మీపార్వతి అనుబంధం అంశాలతో సినిమా చాలా హోమ్లీగా సాగుతుంది. ఎలాంటి అసభ్య సన్నివేశాలకు చోటు లేకుండా క్లీన్‌గా సన్నివేశాలు సాగుతాయి. తొలిభాగంలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఎమోషన్స్ ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంటాయి. దాంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

   సెకండాఫ్ రివ్యూ

  సెకండాఫ్ రివ్యూ

  సెకండాఫ్‌లో ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి రావడంలో లక్ష్మీపార్వతి పాత్ర కీలకం అని చెప్పే ప్రయత్నం జరిగింది. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ కుటుంబాన్ని బాబు ఎలా తన చేతుల్లోకి తీసుకొన్నాడు. ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్చుకోవడానికి ఎలాంటి కుట్రలు చేశాడు. వైశ్రాయి నాటకాన్ని ఎలా ఆడారు? విజయవాడలో సింహగర్జన మీటింగ్ పెట్టుకోవడానికి అడ్డుకొన్న విధానం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. చివర్లో ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ ప్రేక్షకుడిని భావోద్వేగానికి, కంటతడి పెట్టించేలా ఉంటాయి.

   వర్మ, ఇతర దర్శకుడి పనితీరు

  వర్మ, ఇతర దర్శకుడి పనితీరు

  అగస్త్యతో కలిసి రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. కొద్దికాలంగా వైఫల్యాలతో బాధపడుతున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం సరైన కథతో తెర మీద విజృంభించాడని చెప్పవచ్చు. ఎంచుకొన్న కథ, రాసుకొన్న సన్నివేశాలు, కథను వర్మ నడిపించిన విధానం హ్యాట్సాఫ్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ మరణానికి దారి తీసిన చీకటి కోణాలను వెలుగులోకి తీసుకురావడానికి వర్మ చేసిన పరిశోధన ముచ్చటేస్తుంది. ఈ కథలో వాస్తవాలు, నిజాలు ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే వర్మ తీసిన విధానం సగటు ప్రేక్షకుడిని కొత్తరకమైన అనుభూతిలో ముంచెస్తుంది. లక్ష్మీపార్వతి పాత్రను రాసుకొన్న విధానం హైలెట్ అనిచెప్పవచ్చు. సినిమాలో వర్మ తీసిన సన్నివేశాలు గానీ, కెమెరా యాంగిల్స్, ఉపయోగించిన లైటింగ్ మరోసారి చర్చనీయాంశం అవుతాయి. చివరగా.. వెన్నుపోటు అన్యాయానికి గురైనట్టు ఎన్ఠీఆర్ పూనితే వచ్చిన పూనకంతో వర్మ ఈ సినిమాను తీశాడనే ఫీలింగ్ కలుగుతుంది.

  ఎన్టీఆర్‌గా విజయ్ కుమార్

  ఎన్టీఆర్‌గా విజయ్ కుమార్

  ఎన్టీఆర్‌గా రంగస్థల నటుడు విజయ్ కుమార్ పాత్రలో లీనమైపోయాడు. ప్రతీ సన్నివేశంలో ఎన్టీఆర్‌గా నటించడానికంటే జీవించడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ముఖ్యంగా హావభావాల ప్రదర్శన, క్లైమాక్స్‌లో మానసిక వేధనకు గురయ్యే సన్నివేశాలు తెర మీద అద్బుతంగా ఉంటాయి. గొప్ప నటులకు మించి ఎన్టీఆర్‌గా అమోఘమైన నటనను ప్రదర్శించారు.

  లక్ష్మీపార్వతిగా యజ్ఞశెట్టి నటన

  లక్ష్మీపార్వతిగా యజ్ఞశెట్టి నటన

  లక్ష్మీపార్వతిగా యజ్ఞశెట్టి నటన చాలా బాగుంది. సినిమాకు యజ్ఞశెట్టి వెన్నముకగా నిలిచేంతగా ఫెర్మార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. కీలక సన్నివేశాల్లో ఆమె నటన సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. లక్ష్మీపార్వతికి గొప్ప గౌరవాన్ని తెచ్చే విధంగా యజ్ఞశెట్టి తన పాత్రను పోషించింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పెట్టే వేధింపులు, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత వచ్చే సీన్లలో యజ్ఞశెట్టి మంచి నటనను ప్రదర్శించిందని చెప్పవచ్చు.

  బాబుగా శ్రీ తేజ్ ఫెర్హార్మెన్స్

  బాబుగా శ్రీ తేజ్ ఫెర్హార్మెన్స్

  లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో మరో కీలకమైన పాత్ర బాబు. ఈ పాత్రలో శ్రీ తేజ్ జీవించాడు. తెర మీద వాస్తవ పాత్రను మించేలా శ్రీ తేజ్ ఎమోషన్స్ పలికించాడు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చేసిన ప్రయత్నాల్లో చూపిన క్రూరత్వం మహాభారతంలో శుకునిని మించి విధంగా కనిపిస్తాయి. అధికారం కోసం ఎంతకైన తెగించే పాత్రలో శ్రీ తేజ్ నటన పరిశ్రమలో ఈ సినిమాను మైలురాయిగా నిలబెట్టే రేంజ్‌లో ఉంది.

   మిగితా పాత్రలు

  మిగితా పాత్రలు

  ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ, హరికృష్ణ, పురంధేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులను తలపించే పాత్రలు ఉన్నప్పటికీ అవి నామమాత్రంగానే కనిపిస్తాయి. కొన్ని సందర్బాల్లో బాలకృష్ణ, హరికృష్ణల్లాంటి పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్‌కు థియేటర్లో విజిల్స్, చప్పట్లు మోగడం ఖాయం. ఎన్టీఆర్ పీఏ మోహన్, అశోక్ గజపతి, దేవేందర్ గౌడ్, దేవినేని నెహ్రూ, పరిటాల రవి పాత్రల సందర్బోచితంగా కనిపిస్తాయి.

   కల్యాణి మాలిక్ మ్యూజిక్

  కల్యాణి మాలిక్ మ్యూజిక్

  లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కల్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్. తన కెరీర్‌లోనే బెస్ట్ అనే రేంజ్‌లో మ్యూజిక్‌ను అందించారని చెప్పవచ్చు. దగా, సింహగర్జన, నీ ఉనికి పాటల బాణీలు ఫీల్‌గుడ్‌గా ఉన్నాయి. భావోద్వేగ సన్నివేశాల్లో రీరికార్డింగ్ అదిరిపోయింది. కథను, కథనాన్ని, సన్నివేశాలను మరింత ఎలివేట్ చేయడానికి కల్యాణ్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది.

   సినిమాటోగ్రఫి, ఎడిటింగ్

  సినిమాటోగ్రఫి, ఎడిటింగ్

  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మరో పాజిటివ్ అంశం సినిమాటోగ్రఫి. లైట్ అండ్ షేడ్స్ సీన్లు, సన్నివేశాలకు తగిన లొకేషన్ల ఎంపిక వాటిని తెరకెక్కించిన విధానం సినిమాను 80, 90 దశకాల్లోకి తీసుకుపోయేలా ఉంది. ఈ సినిమాకు ఉపయోగించిన లైటింగ్ చాలా రిచ్‌గా ఉంటుంది. కలర్ ప్యాటర్న్ కూడా బాగుంది. ఈ మధ్యకాలంలో వర్మ తన సినిమాలను నాసిరకంగా చుట్టేశారనే అపవాదు ఉంది. ఈ సినిమాతో అలాంటివి తొలిగిపోతాయి. ఎడిటింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎలాంటి ల్యాగ్స్ లేకుండా సినిమాను పరుగులుపెట్టించారని చెప్పవచ్చు.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను తన విజన్‌కు, తన ఉద్దేశాలకు అనుగుణంగా తెరకెక్కించడంలో రాకేష్ రెడ్డి సఫలమయ్యాడు. వర్మతో కలిసి సినిమాను తెరకెక్కించిన విధానం, పాత్రల ఎంపిక, లొకేషన్లను సమకూర్చుకోవడం సినిమాకు పాజిటివ్‌గా మారాయి. రాకేష్ రెడ్డి రాజీ లేకుండా నిర్మించారనే చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన బయోపిక్స్‌లో అత్యుత్తమ నిర్మాణ విలువలు పాటించిన చిత్రాల్లో ఒకటని చెప్పవచ్చు.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఏపీ రాజకీయాలపై సంధించిన విమర్శనాస్త్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ జీవితం అర్ధాంతరంగా ముగియడానికి ఎలాంటి కుట్రలు జరిగాయనేది ఈ చిత్ర కథ. . ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని రూపొందించిన చిత్ర ఇది. కథకు ఉపయోగించిన సీన్లలో వాస్తవం ఉందా అనే విషయం పక్కన పెడితే సినిమాకు మాత్రం కమర్షియల్‌గా ఎంతో బలంగా మారాయి. భావితరాలకు ఎన్టీఆర్ ఔన్నత్యం, ఆయన ముక్కుసూటి తనం, అతని ప్రజాదరణ చాటిచెప్పడానికి చెప్పడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సమయంలో సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తేల్చాల్సి ఉంటుంది. మరో రెండో రోజుల్లో సినిమా సక్సెస్ రేంజ్ తప్పక తెలుస్తుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్

  • వర్మ, ఆగస్త్య టేకింగ్
  • కథ, కథనాలు
  • సినిమాటోగ్రఫి, మ్యూజిక్

  మైనస్ పాయింట్స్

  • కొంత మంది పాత్రలకు నటీనటుల ఎంపిక
  • లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ డ్యాన్స్ చీప్‌గా అనిపించాయి
  నటీనటులు

  నటీనటులు

  నటీనటులు: విజయ్ కుమార్, యజ్ఞశెట్టి, శ్రీ తేజ్ తదితరులు

  దర్శకత్వం: రాంగోపాల్ వర్మ, ఆగస్త్య మంజు

  రచన: నరేంద్రచారి, రాంగోపాల్ వర్మ

  నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి

  సంగీతం: కల్యాణి మాలిక్

  సినిమాటోగ్రఫి: రామి

  ఎడిటింగ్: ఆర్ కమల్

  బ్యానర్: గన్ షాట్ ఫిల్మ్స్, జీవీ ఫిల్మ్స్, 10,00,000 ప్రొడక్షన్

  రిలీజ్: 2019-03-28

  English summary
  Director Ram Gopal Varma' Lakshmi's NTR advance booking starts with high voltage. This movie's 1000 tickets sold out in 10 mins. In this occassion, RGV tweeted sensationally.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X