For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్ష్మినరసింహ..ఒకే

  By Staff
  |

  Laxminarasinha
  -జలపతి గూడెల్లి

  చిత్రం: లక్ష్మినరసింహ

  నటీనటులు: బాలకృష్ణ, ఆషిన్‌, ప్రకాష్‌రాజ్‌, తదితరులు

  సంగీతం: మణిశర్మ

  నిర్మాత: బెల్లంకొండ సురేష్‌

  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయంత్‌

  తమిళ చిత్రం 'సామి' ఆధారంగా తీసిన ఈ సినిమా కమర్షియల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఫర్వాలేదనే చిత్రమే. సినిమా ప్రథమార్థం పేలవంగా సాగి..సెకాండాఫ్‌లో ముఖ్యంగా చివరి అర్థగంట రసవత్తరంగా సాగడం వల్ల ఆకట్టుకుంటుంది. చివరి అర్ధగంట బాలకృష్ణ సోలోగా సినిమాను నడపించాడు. తమిళంలోని ఒరిజినల్‌కు భిన్నంగా సెకాండాఫ్‌లో హీరో ప్లాష్‌బ్యాక్‌ చెప్పిన తీరుతో సినిమాలో పట్టు మొదలు అవుతుంది. అక్కడి నుంచి దర్శకుడు జయంత్‌ తన పనితనాన్ని చూపించాడు. క్రిటికల్‌గా చెప్పాలంటే ఇది సాధారణ సినిమా. ఎందుకంటే పాత చింతకాయ పచ్చడే. కాకపోతే అరిగిపోయిన మూస కథను తమిళంలో దర్శకుడు హరి, విక్రమ్‌ నటనతో ఆసక్తికరంగా నడిపించాడు.‌

  విక్రమ్‌ నటన అక్కడ హైలెట్‌. కానీ తెలుగులో ప్రథమార్థం అదే విధంగా తీయడం దెబ్బతీసింది. ద్వితీయార్థమే సినిమాను కాపాడింది అని చెప్పాలి. అక్రమాలు చేస్తూ సిటీని గడగడలాడించే విలన్‌ను హీరో మట్టుబట్టించడమే అనే ఫార్మూల కథను మనం ఎన్నోసార్లు చూశాం. 'లక్ష్మినరసింహ'లో ప్రతి సీన్‌ పాతదే. కానీ హీరో విలన్‌కు గుణపాఠం చెప్పే సీన్లు, దృశ్యాలను స్టైల్‌గా చిత్రీకరించడం వల్ల బాగుందనిపిస్తుంది. దానికి తోడు బాలకృష్ణ ఖాకీ చొక్కాలో చాలా హ్యండ్సమ్‌గా, మ్యాన్లీగా కనిపించాడు.‌

  ఆ స్టైల్‌ వల్ల సినిమాలో ఆయన చేసే మోస్తారు విన్యాసాలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే, రౌడీ టైప్‌ యువకుడిగా చేసిన నటన మాత్రం పేలిపోయింది. తమిళ ఒరిజినల్‌ చూసిన వారికి ఈ సినిమా అసలు నచ్చదు. అందులో విక్రమ్‌ నటన హైలైట్‌. అలాగే, ఇందులో ప్రకాష్‌రాజ్‌ చేసిన పాత్ర తమిళంలో కోట శ్రీనివాసరావు చేశాడు. ప్రకాష్‌రాజ్‌ కంటే కోటనే బాగా చేశాడు. ఈ సినిమాలో మరో డ్రాబ్యాక్‌ సంగీతం. 'పప్పు ఏసుకో.. చారు ఏసుకో..', 'మరుమల్లి, జాబిల్లి మా చెల్లి..' అనే రెండు పాటలే బాగున్నాయి.‌

  కథ: లక్ష్మినరసింహస్వామి (బాలకృష్ణ) డిసిపి. విజయవాడకు పోస్టింగ్‌ రాగానే..ఆ సిటీలో ఆధిపత్యం చెలాయిస్తోన్న రౌడీనాయకుడు ధర్మభిక్షం (ప్రకాష్‌రాజ్‌)తో తలపడుతాడు. అయితే, ఆయన అక్రమాలు చూస్తూ ఊరుకునేందుకు లంచం తీసుకుంటుంటాడు. లంచగొండితనం అంటే అసహ్యించుకునే ఓ కాలేజ్‌ యువతి రుక్మిణి (ఆషిన్‌)తో ప్రేమలో పడుతాడు. పెళ్ళి చేసుకుందామనుకునే సమయంలో స్వామి ధర్మభిక్షం వద్ద లంచం తీసుకుంటున్నాడన్న విషయం తెలుస్తుంది.‌

  అప్పుడు హీరో తన ప్లాష్‌బ్యాక్‌ చెప్తాడు. మరో ఊరిలో అధికారిగా ఉంటున్నప్పుడు ధర్మభిక్షం అనుచరులను జైలులో వేస్తాడు. వారిని బెయిల్‌పై విడిపించేందుకు కూడా నిరాకరించడంతో ధర్మభిక్షం..హీరో చెల్లెలి పెళ్ళిమంటపంలో బాంబులు పెట్టించి చంపేస్తాడు. హీరోపై లాకప్‌డెత్‌ కేసు పెట్టి డిస్మిస్‌ చేయిస్తాడు. అప్పుడు హీరో తండ్రి (విశ్వనాథ్‌) పైఅధికారులకు లంచం ఇచ్చి తిరిగి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ధర్మభిక్షం వద్దనే లంచం తీసుకొని నష్టపోయిన ఈ ఊరివాళ్ళకు పరిహారం ఇచ్చేలా ప్రతీకారం తీసుకోమని తండ్రి నూరిపోస్తాడు. అందుకే లంచం తీసుకుంటున్నానని హీరో ప్లాష్‌బ్యాక్‌ చెప్పడంతో హీరోయిన్‌ పెళ్ళి చేసుకుంటుంది. ఇక సెకాంఢాప్‌ అంతా హీరో ధర్మభిక్షం పని ఎలా పడుతాడనేది కథ.‌

  అంతా ప్లాన్డ్‌గా హీరోను డిస్మిస్‌ చేయించిన ధర్మభిక్షానికి తను డిస్మిస్‌ చేయించిన వ్యక్తి హీరోనే అన్న (లక్ష్మినరసింహ) వివరాలు తెలియకపోవడం అనేది లాజిక్కు అందదు. కథ గొప్పది కాదు. కేవలం స్క్రీన్‌ప్లే వల్ల మోస్తారుగా ఉన్నట్లు అన్పిస్తుంది. బాలకృష్ణ బాగా చేశాడు. ఆషిన్‌ ఈ సినిమాలో తొలిసారిగా ఎక్స్‌పోజ్‌ చేసింది. కానీ ఈ అమ్మాయి కెమెరావైపు డైరక్ట్‌గా చూసే విధానం మెల్లకన్ను వారి చూసే విధంగా ఉంది. జయంత్‌ గొప్పతనం ఇందులో లేదు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X