»   » 'స్పేస్' బ్యాక్ డ్రాప్ లో 'టైటానిక్' చూడాలని ఉంటే... (రివ్యూ: ప్యాసెంజర్స్‌ )

'స్పేస్' బ్యాక్ డ్రాప్ లో 'టైటానిక్' చూడాలని ఉంటే... (రివ్యూ: ప్యాసెంజర్స్‌ )

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

కొత్త కథలు ఎక్కడ నుంచి వస్తాయండీ..ఉన్న కథలనే అటూ ఇటూ చేసి మార్చి రాసేస్తే...కొత్త కథ తన్నుకుంటూ వచ్చేస్తుంది..ఇది ఎంతో కాలంగా రీజనల్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ నమ్మి చేస్తున్న ఫార్ములా... ముఖ్యంగా స్క్రీన్ ప్లే ను తీసుకుని కొత్త నేపధ్యం చేరిస్తే ..బాషా నే సమరసింహా రెడ్డి అవుతుంది..ఆనక నరసింహ నాయుడు , ఇంద్ర...ఇలా వరస పెట్టి ఎన్నో సూపర్ కథలకు రూపం ఏర్పడుతుంది.

అలాగే టైటానిక్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ...బ్లాక్ బస్టర్ హిట్...దాన్ని నేపధ్యం మార్చి హాట్ స్టార్స్ తో సినిమా మళ్లీ చేస్తే ఎలా ఉంటుంది ...ఇది ఏ తెలుగోడికో వచ్చిన ఐడియా కాదు...హాలీవుడ్ డైరక్టర్ కు వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఆలోచన. అంతే ఐడియా వచ్చిన వెంటనే నిర్మాతని ఒప్పించి, సినిమా రెడీ చేసి వదిలేసాడు. అదే ప్యాసింజర్స్.

ప్యాసింజర్స్ సినిమా...చూస్తూంటే ఖచ్చితంగా టైటానిక్ గుర్తుకు వస్తుంది. అఫ్ కోర్స్ టైటానిక్ అప్పటికే మీరు చూడకపోతే గుర్తుకు రాదనుకోండి. అయితే టైటానిక్ అంత హిట్టే అంటారా.. అని అడిగితే ...అనుకరణ ..అనుకరణే...ఒరిజనల్ ..ఒరిజనలే. గోల్డ్ ..గోల్డే..గిల్ట్..గిల్డే.

ఇప్పటికే కొన్ని దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ఈ వారం ఇండియాలో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో కథఏంటి, హైలెట్స్ ఇక్కడ చూద్దాం.

అక్కడ ఉండగలమా

అక్కడ ఉండగలమా

సైంటిస్టులు ...అంతరిక్షంలో హోమ్‌స్టెడ్‌-2 అనే ఓ నూతన గ్రహాన్ని కనుగొంటారు. ఆ కొత్త గ్రహంపై నివసించేందుకు ఐదు వేల మంది ప్రయాణికులు ఓ అంతరిక్ష నౌక ఎక్కుతారు. ఆ అందులో జనజీవనయోగమైన అంశాలున్నాయేమో తెలుసుకొనేందుకు స్పేస్ షిప్ లో క్రిష్, జెన్నీఫర్ ను పంపిస్తారు.

ప్రత్యేక ఏర్పాట్లు

ప్రత్యేక ఏర్పాట్లు

హోమ్‌స్టెడ్‌-2 అనే గ్రహాన్ని చేరుకోవాలంటే 120 ఏళ్లు పడుతుంది. ఈలోపు వారి జీవితకాలం ముగిసిపోకుండా అందరినీ ప్రత్యేక పరికరాల సాయంతో నిద్రావస్థలో ఉంచుతారు.

ఆమెను లేపేస్తాడు

ఆమెను లేపేస్తాడు

ఈ లోగా టెక్నికల్ ప్రాబ్లంలు తలెత్తి జిమ్‌ ప్రెట్‌సన్‌(క్రిస్‌ ప్రాట్‌) అనే మెకానికల్‌ ఇంజినీరుకు 90 ఏళ్ల ముందే మెలుకువ వస్తుంది. ఏడాది పాటు ఒంటరిగా గడిపిన జిమ్‌ తోడు కోసం అరోరా లేన్‌(జెన్నిఫర్‌ లారెన్స్‌) అనే అందమైన అమ్మాయిని నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తాడు. సాంకేతిక సమస్యలతోనే అరోరాకు మెలకువ వచ్చిందని నమ్మిస్తాడు.

ప్రేమలో పడ్డారు

ప్రేమలో పడ్డారు

ద్వేషం,ప్రేమచేసేదేమీ లేక ఆ నౌకలో తన అనుభవాలను పుస్తకంగా రాయడం మొదలు పెడుతుంది అరోరా. ఈ క్రమంలో జిమ్‌.. అరోరా ప్రేమలో పడతారు.
అయితే జిమ్‌ కావాలనే తనను మేల్కొలిపాడని అరోరాకు తెలియడంతో అతనిపై ద్వేషం పెంచుకుంటుంది. ఆ తర్వాత నౌకకు కొన్ని సమస్యలు తలెత్తి వారు ప్రమాదంలో పడతారు. అప్పుడు వారేం చేశారన్నది తెరపై చూడాల్సిందే.

దీపాలయ్యాయి...

దీపాలయ్యాయి...

ఆ తర్వాత నౌకకు కొన్ని సమస్యలు తలెత్తి వారు ప్రమాదంలో పడతారు. ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచ్చేసింది... నౌకకు ఏవో సమస్యలు... వారి ప్రేమ... ప్రయాణికుల ప్రాణాలు అన్నీ గాలిలో దీపాలయ్యాయి... మరి ఆ నౌక ఏ తీరానికి చేరింది? వారి ప్రేమకథ ఏ మలుపు తిరిగింది? అప్పుడు వారేం చేశారు...ఇలాంటి ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కింది ‘ప్యాసెంజర్స్‌'.

స్క్రీన్ ప్లే ...

స్క్రీన్ ప్లే ...

అంతరిక్షం నేపథ్యంలో హాలీవుడ్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటన్నింటితో పోల్చితే ఈ కథాంశం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కథకు తగ్గట్టుగా పటిష్ఠమైన కథనంతో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. కాన్సెప్టు టైటానిక్ ని గుర్తు చేసినా ..స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేసారు.

ఆ సీన్స్ బాగుంటాయి

ఆ సీన్స్ బాగుంటాయి

నౌకలో టెక్నికల్ ప్లాబ్లం వచ్చినప్పుడు జిమ్‌ నిద్రలోంచి మేల్కొనడం...అంత పెద్ద నౌకలో ఒంటరితనం భరించలేక తోడు కోసం అరోరాని లేపడం.. వాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. జిమ్‌.. అరోరా మధ్య వచ్చే సన్నివేశాలు.. ముఖ్యంగా అంతరిక్ష వీధుల్లో వీళ్లిద్దరూ విహరించడం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

చాలా సేపటి వరకూ..

చాలా సేపటి వరకూ..

సినిమా ప్రారంభమైన చాలాసేపటి వరకు సినిమాలో కాంప్లిక్ట్ పాయింట్ రాదు. కేవలం హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలతోనే సినిమాని నడిపించాడు దర్శకుడు. ఎప్పుడైతే అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు ఏర్పడతాయో అప్పట్నుంచి కథలో వేగం పెరుగుతుంది. నౌకలో తలెత్తిన సమస్యను సరిచేసే క్రమంలో వచ్చే సీన్స్ టెన్షన్ ఎలిమెంట్ తో కలిపి బాగా డిజైన్ చేసారు.

ఇవి సినిమాలో బాగున్నాయి

ఇవి సినిమాలో బాగున్నాయి

స్క్రీన్‌ప్లే.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది. గ్రాఫిక్స్‌ ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగులు ఏంటిరా ఇలా రాసారు అనిపిస్తాయి. క్రిస్‌ప్రాట్‌ నటన బావుంది. ముఖ్యంగా నౌకలో ఒంటరితనంతో బాధపడే వ్యక్తిగా తొలి పదినిమిషాల్లో క్రిస్‌ నటన ఆకట్టుకుంటుంది. జెన్నిఫర్‌ లారెన్స్‌ అందంగా కనిపించింది. క్రిస్‌.. జెన్నిఫర్‌ల కెమిస్ట్రీ కొత్తగా అనిపిస్తుంది. సాంకేతిక సమస్యలు తలెత్తిన నౌకలో క్రిస్‌.. జెన్నిఫర్‌లకు సాయపడే చీఫ్‌ డెక్‌ ఆఫీసర్‌ పాత్రలో లారెన్స్‌ ఫిష్‌బొర్న్‌ ఒదిగిపోయాడు.

 సినిమా టీమ్ వీళ్లే...

సినిమా టీమ్ వీళ్లే...

చిత్రం పేరు: ప్యాసెంజర్స్‌(ఇంగ్లిష్‌)
నటీనటులు: క్రిస్‌ ప్రాట్‌.. జెన్నిఫర్‌ లారెన్స్‌.. లారెన్స్‌ ఫిష్‌బర్న్‌
కథ: జాన్‌ స్పైట్స్‌
సినిమాటోగ్రఫీ: రొడ్రిగో ప్రిటో
దర్శకత్వం: మోర్టిన్‌ టిల్‌డమ్‌
సంగీతం: థామస్‌ న్యూమన్‌
నిర్మాతలు: నీల్‌ హెచ్‌. మారిట్జ్‌.. స్టీఫెన్‌ హమిల్‌
విడుదల తేదీ: 6-1-2017

ఫైనల్ గా...ఒకటి రెండు సీన్లు మినహా అంతరిక్షం గురించి ఎక్కడా చూపించరు. దీంతో స్పేస్‌ నేపథ్యంలో సాగే సినిమా అని అంచనాలు పెట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదు. లేకుండా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాహసభరితమైన ప్రేమకథాచిత్రంగా 'ప్యాసెంజర్స్‌' ఆకట్టుకుంటుంది.

English summary
promising premise and a pair of the planet’s hottest movie stars in tow, the pitch for Passengers is practically perfect. Put simply, it’s Titanic in space.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu