»   » నేనెవరిని? ( ‘1’ నేనొక్కడినే రివ్యూ)

నేనెవరిని? ( ‘1’ నేనొక్కడినే రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

--సూర్య ప్రకాష్ జోశ్యుల

కొత్తగా ఎప్పుడు ఏం చెప్పినా తెలుగు ప్రేక్షకుడు చూస్తున్నాడు...సూపర్ హిట్ చేస్తున్నాడు. అలాగని కొత్త పేరు చెప్పి కథ విడిచి సాము చేస్తే మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాడు. '1' నేనొక్కడినే సినిమాలో దర్శకుడు కొత్తదనం కోసం(సాంకేతికంగా,జెనర్ పరంగా) చేసిన ప్రయత్నం మాత్రం తప్పకుండా మెచ్చుకోవాల్సిన అంశం. అయితే మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలంటే ఖచ్చితంగా వాటినుంచి ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని వదిలేయకుండా తనదైన శైలిలో కథను సుకుమార్ చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేదనిపిస్తుంది.

అయితే థ్రిల్లర్ నేరేషన్ కావటంతో అది ...కమర్షియల్ హీరో కథలా..హీరోనే హైలెట్ చేస్తూ...కథనం నడపటం కష్టమైపోయింది. తెలుగు సినిమాకు తగినట్లు కథ,కథనంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సెకండాఫ్ ని సైతం ఫస్టాఫ్ లాగ స్పీడుగా రన్ నడిపితే ఖచ్చితంగా అంచనాలు అందుకునేది. అయితే మహేష్ మాత్రం తన నటనతో మైమరిపించాడనే చెప్పాలి. ఈ చిత్రానికి నేనొక్కడినే అని కాకుండా...నేనెవరిని అని పెడిగితే బాగుండేదనిపిస్తుంది.

గౌతమ్(మహేష్)...చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోతాడు. తన తల్లి తండ్రులను ముగ్గురు చంపారని గుర్తుపెట్టుకుంటాడు..కాని వాళ్లు ఎవరు..ఎందుకు చంపారు అనేది మాత్రం తెలియకుండానే పెరిగి పెద్దవుతాడు. తన తల్లి తండ్రుల ముఖాలు మర్చిపోతాడు కానీ వారిని చంపిన వారిని మాత్రం ప్రతీ క్షణం తలుచుకుంటూ రాక్ స్టార్ గా ఎదుగుతాడు. ఎదుగుదలతో పాటు తన తల్లి తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పెరిగి పెద్దవుతుంది...అంతేకాదు..వారిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే నిర్ణయించుకుంటాడు. ఈ లోగా అతినిపై దాడులు మొదలువుతాయి..ఈ క్రమంలో గౌతమ్ తల్లి తండ్రులు ఎవరనేది ఎలా తెలుసుకున్నాడు..తన పగ ఎలా తీర్చుకున్నాడనేది మిగతా కథ.

(థ్రిల్లర్ జానర్ లో వచ్చిన చిత్రం కావటంతో ఇంతకు మించి కథను రివిల్ చేస్తే చూడటం ఇబ్బందవుతుంది కాబట్టి...కథలో ఎలిమెంట్స్ ఏవీ రివిల్ చేయటం లేదు..)

టెక్నికల్ గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్ లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే విభిన్నతే విజయానికి మూలం అని నమ్మిన సుకుమార్..ఇక్కడ మన వాళ్ల టేస్ట్ ఎందుకనో మర్చిపోయారు . ముఖ్యంగా ఇలాంటి కథలు ఏ ఇమేజీ లేని హీరోల మీద తీస్తే...చూడటానికి బాగుంటాయి. మహేష్ బాబు సినిమా అంటే కామెడీ, యాక్షన్,మోతిక్కించే పాటలు, జోష్ గా తెరపై చెలరేగే హీరో అని ఫిక్సయిన వారికి చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది.

అందులోనూ హీరో ...ఎంతసేపు తన గతం తవ్వుకుంటూ, విలన్స్ నుంచి తనను తాను రక్షించుకుంటూ తిరగటమే సరిపోతుంది తప్ప..విలన్స్ కి ఎదురు ట్విస్ట్ లు ఇచ్చే ఎలిమెంట్స్ ఈ కథలో బాగా తక్కువ ఉన్నాయి. అసలు విలన్ ఎవరో తెలిస్తేనే కదా వారిపై దాడికి దిగేది ..అది క్లైమాక్స్ దాకా తెలియదు...అందులోనూ కథని థ్రిల్లింగ్ చెప్పాలనే తాపత్రయంలో కొంత కన్ఫూజన్ కి గురి అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ దాటాక అయితే మరీను. ఫస్టాఫ్ ని ...ఎంతో పగడ్బందీగా నడిపిన దర్శకుడు సెకండాఫ్ ని ఆ ఫేజ్ లో రన్ చేయలేకపోయాడు.

మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

మహేష్ హైలెట్...

మహేష్ హైలెట్...

సినిమాలో మొదటి నుంచీ చెప్పుకుంటున్నట్లు మహేష్ మాత్రం తన లుక్స్, స్టైలిష్ ఏక్టింగ్ తో ఫ్యాన్స్ కు పండుగ చేసాడు. ఎమోషన్ సీన్స్ లో,ఛేజింగ్ ఎపిసోడ్స్ లో మహేష్ విశ్వరూపం చూపాడు. ఎక్కడా బిగి సడలకుండా ఎమోషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు.

హీరోయిన్...ఓకేనే

హీరోయిన్...ఓకేనే

హీరోయిన్ గా పరిచయమైన కృతి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది కానీ...నటన మాత్రం ఓకే అనిపిస్తుంది . తెలుగు అమ్మాయిలా మాత్రం అనిపించదు. అందులోనూ మహేష్..ఆమె ఉన్న సీన్స్ లో అయితే మరీను...మహేష్ పూర్తిగా డామినేట్ చేసేసాడు అనిపిస్తాయి. హీరోయిన్ కి,మోడల్ కి తేడా ఉందని తెలిస్తేనే ఆమె నిలబడగలగుతుంది.

దర్శకత్వం...

దర్శకత్వం...

దర్శకుడుగా సుకుమార్ మొదటి సినిమా నుంచీ ఏదో చుట్టేద్దామనే ప్రయత్నం కనపడదు. అది మరీ ఈ చిత్రంలో స్పష్టంగా కనపడుతుంది. కొత్తదనంగా స్క్రీన్ పై సీన్స్ ని చూపాలనే ఆయన తాపత్రయం అడుగడుగునా కనపడుతుంది. అయితే ఎత్తుకున్న జెనర్ ..మహేష్ లాంటి కమర్షియల్ హీరోకి ఇమడకపోవటం.. ...కథన లోపం చూసేవారికి ఇబ్బందిగా మార్చేసాయి.

టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

సినిమా టెక్నికల్ గా ఎక్కడా తీసిపోలేదు. ఓ రకంగా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని దాటారనే చెప్పాలి. అయితే కొన్ని సీన్స్ లలో టెక్నికల్ బ్రిలియెన్స్ ...సీన్ లో ఉన్న ఇంపాక్ట్ ని సైతం తనవైపు లాక్కుపోయి తేలిపోయేలా చేసింది. అయితే థ్రిల్లర్ జెనర్ తగ్గ లొకేషన్స్ ని వాటిని చూపే విధానం మాత్రం చాలా బాగుంది. సీన్స్ లో టెన్స్ పెంచే విధంగా షాట్స్ కంపోజ్ చేసుకున్న విధానం కూడా బాగా కుదిరింది.

డైలాగులు...

డైలాగులు...


పంచ్ కోసం, ప్రాసల కోసం చూడకుండా కథలో లీనమయ్యేలా డైలాగులు విషయంలో జాగ్రత్తలు తీసుకుని రాసారు. అయితే థియోటర్ బయిటకు వచ్చాక గుర్తుండిపోయే డైలాగులు మాత్రం ఏమీ లేవు. సన్నివేశపరంగా మాత్రం కొన్ని డైలాగులు బాగా పండాయి. విలన్ తో...నువ్వు ఊపిరి పీల్చడం వల్ల బ్రతుకుతున్నావు అనుకుంటున్నావ్...కానీ...నేను ఊహించటం వల్ల మాత్రమే బ్రతికున్నావ్ వంటివి విజిల్స్ వేయించాయి.

పాటలు...రీ రికార్డింగ్

పాటలు...రీ రికార్డింగ్

దేవిశ్రీప్రసాద్ సంగీతం లో రెండు పాటలు ఆడియో పరంగా సూపర్ హిట్టయ్యాయి. అయితే సినిమాలో వాటి చిత్రీకరణ మాత్రం పాటల విన్నప్పటి కిక్ ని ఇవ్వలేకపోయింది. అయితే రీరికార్డింగ్ మాత్రం సినిమా టోన్ కి తగినట్లు దేవి అదరకొట్టాడనే చెప్పాలి. సినిమాకు హైలెట్ లో ఒకటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

ఫోటోగ్రఫి, ఎడిటింగ్

ఫోటోగ్రఫి, ఎడిటింగ్

రత్నవేలు ఎప్పటిలాగే సుకుమార్ కు అండగా నిలిచి సినిమాకు ప్లస్ అయ్యాడు. ఆ రేంజి ఫోటో గ్రఫి లేకపోతే సినిమాకు ఆ లుక్ వచ్చేది కాదు. సినిమా జెనర్ కి, మూడ్ కి తగినట్లు లైటింగ్ స్క్రీమ్స్ తో ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ..ఫస్టాఫ్ కు బాగున్నా...సెకండాఫ్ కు వచ్చేసరికి అదే మూడ్ ని సస్టైన్ చేయలేకపోయింది. స్లో పేసెడ్ తో సహన పరీక్షకు దారి తీయించింది.

క్లైమాక్స్ లో...

క్లైమాక్స్ లో...

ఈ సినిమాకకకు చివరి పదిహేను నిముషాలే సినిమాకు ప్రాణం.. సెకండాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ వచ్చే నేరేషన్ ని స్లో చేసినా క్లైమాక్స్ తో దాన్ని సర్దుకునే ప్రయత్నం చేసాడు. ఎమోషన్ గా క్లైమాక్స్ ని లాక్కెళ్లాడు. అయితే మనకి క్లైమాక్స్ అంటే సాధారణంగా విలన్స్ ని వయిలెంట్ గా చంపే కార్యక్రమం ఉంటుంది. దానికి విరుద్దంగా ఈ క్లైమాక్స్ ఉండటం తో కాస్త వెలితి గా తోస్తుంది.

ఎంటర్టైన్మెంట్ మిస్

ఎంటర్టైన్మెంట్ మిస్

ఎంటర్టైన్మెంట్ అంటే సుకుమార్ ఇంటర్వూలలో చెప్పినట్లు ఏదైనా ప్రేక్షకుడుకుని కూర్చో బెట్టగలిగేదే. అయితే తెలుగు సినిమాలలో ఎంటర్టైన్మెంట్ అంటే కామెడినే అన్న అర్దం నడుస్తోంది. అదే ఈ సినిమాలో మిస్సైంది. రిలీఫ్ కోసం అక్కడక్కడ దాన్ని పెడితే సగటు ప్రేక్షకుడుకి రీచ్ అవ్వటంలో సక్సెస్ అయ్యేది. దాంతో ఈ సస్పెన్స్ సినిమాలో ఎక్కడన్నా రిలీఫ్ వస్తే బాగుండును అనిపించింది.

క్యారెక్టరైజేషన్...

క్యారెక్టరైజేషన్...


సుకుమార్ చిత్రాల్లో ఎప్పుడూ క్యారెక్టరైజేషన్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా మహేష్ బాబు పాత్ర డిజైన్ లో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ రకంగా క్యారెక్టర్ డ్రైవన్ ప్లాట్ లాగ తీర్చి దిద్దారనే చెప్పాలి. ఎప్పుడూ తన ప్రపంచోలనే ఉంటూ...తన తల్లి తండ్రి ఎవరనేది అన్వేషిస్తూ మూడీగా ఉండే క్యారెక్టర్ లో మహేష్ ఒదిగిపోయాడు. అయితే మహేష్ ని మొదటి నుంచి చివరి వరకూ అలా చూడటం కష్టమే అయ్యింది.

గౌతమ్...స్పెషల్

గౌతమ్...స్పెషల్


ఈ సినిమా లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జూ.సూపర్ స్టార్ గౌతమ్ (మహేష్ బాబు కుమారుడు)గురించి. చిన్న పిల్లాడైనా,నటనకు కొత్తైనా ఓ ప్రొఫెషినల్ గా ఎక్కడా తడబాటు లేకుండా నటించి..వారసుడుని అనిపించుకున్నాడు.

నిర్మాణ విలువలు..మిగతా ఆర్టిస్ట్ లు..

నిర్మాణ విలువలు..మిగతా ఆర్టిస్ట్ లు..

ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా బాగా ఖర్చు పెట్టారని అర్దమవుతుంది. ఆ డబ్బు ఖర్చుని కొద్దిగా కూడా వృధా పోకుండా తెరపైకి టెక్నీషియన్స్ సాయింతో సుకుమార్ తెరకెక్కించారనే చెప్పాలి. ఇక మిగతా సీనియర్ ఆర్టిస్టులు నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ డోర్జి, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సూర్య, బెనర్జి, చైతన్య వారు తమ పాత్రలకు న్యాయం చేసారు.

టోన్డ్ బాడీ

టోన్డ్ బాడీ

మహేష్ తొలిసారిగా ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ చేసారు. అయితే చొక్కా విప్పేసి ఆ బాడీని ఎక్సపోజ్ చెయ్యాలని చూడలేదు. ఛార్మింగ్ లుక్స్ తో టోన్డ్ బాడీతో మహేష్ బాగున్నాడు.

కన్ఫూజన్ కే..కన్ఫూజన్

కన్ఫూజన్ కే..కన్ఫూజన్

అసలే కన్ఫూజన్ తో నడిచే ప్లాట్ ని మరింత కన్ఫూజ్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఏది వాస్తవం..ఏది ఊహ అన్న దాని మధ్య ఊగిసలాడే మహేష్ పాత్ర కొంతవరకూ బాగానే ఇంట్రస్టింగ్ గా ఉన్నా...మరీ అదే మెయిన్ ప్లాట్ అవటంతో రానురాను మరింత కన్ఫూజన్ గా మారిపోయింది. సామాన్యుడు తెలివితేటలకు పరీక్షలా, దర్శకుడు పెద్ద పజిల్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడు..ఆ రేంజి ఇంటిలిజెన్స్ ఎంతవరకూ సింక్ అవుతుందో చూసుకోలేదు.

ఎవరెవరు..

ఎవరెవరు..


బ్యానర్ : 14 రీల్స్ , ఈరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు:మహేష్ బాబు, కృతిసన, నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ డోర్జి, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సూర్య, బెనర్జి, చైతన్య మరియు మాస్టర్ గౌతమ్ తదితరులు.
కథ:జక్కా హరిప్రసాద్,
మాటలు: అర్జున్. వై.కె, శ్రీను తోట,
ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు,
పాటలు:చంద్రబోస్,
డాన్స్:ప్రేమ్ రక్షిత్,
ఫైట్స్:పీటర్ హేన్స్,
ఎడిటింగ్:శివ శరవణన్,
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్,
నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీ ల్ సుంకర,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

ఫైనల్ గా తెలుగులో లాజికల్ సినిమాలే తక్కువ అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్స్ ..అంటే మరీనూ..వాటిని ఎంతవరకూ అర్దమవుతుందో...ఏ రేంజిలో ఆదరిస్తారో చూడాలి. అయితే ట్విస్ట్ లతో కూడిన ధ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాసం ఉంది. టెక్నికల్ గా బాగున్న ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ చిత్రం గా భావించకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది. అంతేగానీ మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ అని ఓ రేంజిలో మాత్రం ఊహించుకుంటే దారుణంగా దెబ్బ తింటారు.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
1: Nenokkadine, which has been directed by Sukumar, is one of the most-talked about and highly-anticipated Telugu movies relesed today with divide talk. The dragging narration in the second half and lack of entertainment quotient are its big drawbacks. But the clinching aspect of the movie will be its climax, with great performance by Mahesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu