For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా... (మనమంతా మూవీ రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  3.0/5

  హైదరాబాద్: ఐతే, అనుకోకుండా ఒకరోజు లాంటి చిత్రాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తాజాగా 'మనమంతా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా సిలక్షణమైన సినిమాలను ప్రేక్షకులను అందిస్తాడనే పేరున్న చంద్రశేఖర్ ఏలేటి.... 'మనమంతా' సినిమాలో ఒకే ప్రపంచానికి చెందిన నలుగురి కథలను సినిమాగా ఆవిష్కరించారు. ఆ సినిమా విశేషాలు ఏమిటో రివ్యూలో చూద్దాం...

  కథ విషయానికొస్తే...

  సాయిరామ్, గాయత్రి, మహిత, అభి అనే నలుగురి కథల సమాహారమే 'మనమంతా' చిత్రం. సాయి రామ్ (మోహన్ లాల్) ఓ పెద్ద రీటైల్ సూపర్ మార్కెట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూంటాడు. తన మధ్యతరగతి జీవితాన్ని ముందుకు నడిపించడం కోసం అప్పులు చేయాల్సిన స్థితిలో ఉంటాడు...మేనేజర్ గా ప్రమోషన్ వస్తే తన కష్టాలు తీరిపోతాయని ఆశపడుతుంటాడు.

  గాయత్రి (గౌతమి) మధ్య తరగతి ఇల్లాలు..కుటుంబమే జీవితంగా గడిపే గృహిణి. ఏమేం చేస్తే తన భర్త, పిల్లలు సంతోషంగా ఉంటారని ఆలోచిస్తూ ఉండే మనస్థత్వం. అభిరామ్ (విశ్వాంత్) ఇంజనీరింగ్ కుర్రాడు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న కుర్రాడు. మహిత (రైనా రావు) 12 ఏళ్ల విద్యార్థిని. అందరికీ సహాయం చేసే మనస్తత్వం. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగతా కథ.

  పెర్ఫార్మెన్స్..

  తెలుగులో తొలిసారి నటించిన మోహన్ లాల్ సగటు మధ్యతరగతి వ్యఃక్తి పాత్రలో ఆకట్టుకున్నాడు. సింపుల్‌గా కనిపిస్తూనే ఆ పాత్ర పడే సంఘర్షణను మోహన్ లాల్ చాలా బాగా చూపించగలిగారు. మధ్యతరగతి ఇల్లాలు పాత్రలో గౌతమి బాగా నటించింది. విశ్వంత్ ఇంతకు ముందు కేరింత సినిమాలో నటించాడు. ఆ సినిమాతో పోలిస్తే ఇందులో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 12 ఏళ్ల చిన్నారి పాత్రలో రైనా రావు పెర్ఫార్మెన్స్ పరంగా అందరినీ కట్టపడేసింది. అయ్యప్ప పి. శర్మ చిల్లరరౌడీ పాత్రలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వాలేదు. హర్షవర్థన్, పరుచూరి వెంకటేశ్వరరావు, ధన్ రాజ్, అనీష ఆంబ్రోస్, ఊర్వశి, నాజర్, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మాజీ తదితరులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

  మహేష్ శంకర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సందర్భానుసారంగా పాటలు సినిమాలో కలిసిపోయి చూసేవారికి మంచి ఫీల్ కలిగిస్తాయి. నిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. రవిచంద్ర తేజ అందించి డైలాగ్స్ బావున్నాయి. ఎస్.రవీంద్ర కథకు, సన్నివేశాలకు తగిన విధంగా ఆర్ట్ డైరెక్షన్లో తన టాలెంట్ చూపాడు. ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి నిర్మాణ విలువల పరంగా ఫర్వాలేదు.

  ప్లస్ పాయింట్స్ :

  ప్లస్ పాయింట్స్ :

  కథాంశం, స్క్రీన్‌ప్లే సినిమాకు బాగా ప్లస్సయ్యాయి

  ఇంటర్వెల్ బ్లాక్‌ని సినిమాకు బాగా హైలెట్ అయింది.

  ఈ కథలో నలుగురికీ ఉన్న కనెక్షన్ ఏంటన్నది చివరివరకూ సస్పెన్స్‌ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

  మైనస్ పాయింట్స్ :

  మైనస్ పాయింట్స్ :

  మేకింగ్ కథ స్థాయికి తగిన విధంగా లేదు.

  నలుగురి కథను నాలుగు ముక్కలుగా చెప్పడంతో ప్రధమార్థం అంతా అతుకుల బొంతలా తయారైంది.

  కొన్ని సీన్లు లాజిక్ లేకుండా ఉండటం

  దర్శకుడి పని తీరు..

  దర్శకుడి పని తీరు..

  దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్లే అందించారు. ఇక నటీనటుల నుంచి సరైన నటన రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. కమర్షియల్ అంశాల జోలికి పోనివ్వకుండా, పూర్తిగా వాస్తవికతకు అద్దం పట్టేలా సినిమా తీర్చి దిద్దారు.

  ఫైనల్ గా...

  ఫైనల్ గా...

  ఈ సినిమా అచ్చంగా నిజ జీవితాన్నే తెరపై ఆవిష్కరించినట్లు ఉంటుంది. ఫస్టాఫ్‍లో సినిమా కాస్త నెమ్మదిగా నడిచినా... సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. మంచి సినిమా చూసామనే అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారు. కమర్షియల్ అంశాలు కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా కాస్త నిరశ పరవచ్చు.

  English summary
  Manamantha movie Review. Manamantha is based on the lives of four different individuals. Manamantha is a unique family thriller which impresses you completely. Movies like these are rare to come by and when they do, they are a treat to watch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X