»   » మాంఝీ-ది మౌంటేన్ మ్యాన్ (రివ్యూ)

మాంఝీ-ది మౌంటేన్ మ్యాన్ (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో హిందీలో తెరకెక్కిన చిత్రం ‘మంఝీ-ది మౌంటేన్ మ్యాన్' ఈ రోజు విడుదలైంది. దశరథ్ మాంఝీ అనే వ్యక్తి జీవిత కథను దర్శకుడు కేతన్‌ మెహతా అదే 'మాంఝీ' పేరుతో తెరకెక్కించారు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇంతకీ 'మాంఝీ' ఎవరూ అంటారా... భార్యపై తనకున్న ప్రేమతో ఏకంగా కొండనే తవ్వేశాడు బిహార్‌కు చెందిన దశరథ్‌ మాంఝీ. బీహార్ లోని గయా సమీపంలోని తన గ్రామం వజీర్ గంజ్ కొండప్రాంతంలో ఉండటంతో సరైన దారి లేక ప్రజలు అవస్థలు పడేవారు. మాంఝీ భార్య అనారోగ్యంతో వైద్యం కోసం పట్టణానికి ఆ కొండనెక్కి వెళ్లేలోపు ఆలస్యమై మరణించింది.

రొమాన్స్, రింవేజ్ లాంటి అంశాలను సినిమాలో ప్రధానంగా ఫోకస్ చేస్తూ భార్యపై ప్రేమ మాంఝీని దృడ సంకల్పం వైపు ఎలా నడిపించింది అనేదాన్ని తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.

Manjhi The Mountain Man Movie Review

తారాగణం: నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధిక ఆప్టే, టిగ్మాన్షు ధులియా, పంకజ్ త్రిపాఠి, గౌరవ్ ద్వివేది, అష్రాప్ ఉల్ హక్, జగత్ రావత్, దీపా సాహి ప్రధాన

స్టోరీ లైన్..
1960లో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారనంగా దశరథ్ మాంఝీ(నవాజుద్దీన్ సిద్ధిఖీ) తన భార్య ఫగునియా(రాధిక ఆప్టే)ను కోల్పోతాడు. తనకు జరిగిన నష్టం మరెవరికీ రాకూడదని నిర్ణయించుకుంటాడు. కవలం సుత్తి, ఉలి ఉపయోగించి 22 సంవత్సరాలు కష్టపడి తమ గ్రామానికి రాక పోకలకు అడ్డంగా ఉన్న పెద్ద కొండను తవ్వేస్తాడు.

స్టోరీ విషయానికొస్తే...
దశరథ్ మాంఝీ(నవాజుద్దీన్ సిద్దిఖీ) ఒక పేద గ్రామంలో పెరుగుతాడు. చిన్నతనంలోనే అతనికి బలవంతంగా బాల్య వివాహం జరుగుతుంది. ఇది నచ్చని దశరథ్ తన గ్రామం నుండి పారిపోతాడు. ధన్‌బాద్ అతను బొగ్గు గనుల్లో పని చేస్తుంటాడు. 7 సంవత్సరాల తర్వాత తిరిగి తన ఊరికి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత మార్కెట్లో ఫగునియా(రాధిక ఆప్టే) చూసి ప్రేమలో పడతాడు. తాను చిన్నతనంలో పెళ్లాడింది ఆమెనే అని తెలుసుకుంటాడు. తాను ఎంతగానో ప్రేమించిన భార్యను తనకు దూరం చేసిన కొండను తవ్వాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే ఆ కొండ వల్ల ఊర్లో చాలా మంది నష్టపోయారు. 22 సంవత్సరాలు కష్టపడి ఆ కొండను తవ్వేస్తాడు.

దర్శకుడు తాను ఎంచుకున్న యూనిక్ కాన్సెప్ట్‌ను డిఫరెంటుగా తెరకెక్కించాడు. సినిమాలోని సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నవాజుద్దీన్ సిద్ధిఖీ మంచి నటన కనబరిచాడు. మాంఝీ పాత్రకు అతను పర్‌ఫెక్టుగా సెట్టయ్యాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాలు సూపర్బ్. మాంఝీ భార్య పాత్రలో రాధిక ఆప్టే ఆకట్టుకుంది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా నవాజుద్దీన్ తో ఆమె కెమిస్ట్రీ బావుంది. సెటైరిక్ గా రాసిన డైలాగులు బావున్నాయి.

Manjhi The Mountain Man Movie Review

రియల్ సంఘటనలతో సినిమా తెరకెక్కించడం అంటే కష్టమైన విషయమే. భావోద్వేగాలు తెరపై పడించడం ఒక సవాల్. ఈ విషయంలో దర్శకుడు కేతన్ మెహతా తన దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు. గతంలో అతనూ ఈ దర్శకుడు తెరకెక్కించిన మంగళ్ పాండే చిత్రం అద్భుతం. తాజాగా మాంఝీ జీవిత కథను కూడా అద్భుతంగా తెరకెక్కించాడు.

కెమెరా వర్క్ ఎక్సలెంటుగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. సినిమా తొలి భాగాన్ని దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించి ఎంటర్టెన్ చేసాడు. అయితే సెకండాఫ్ కాస్త డ్రమటిక్ గా సాగింది. ఎడిటింగ్ బావుంది.

ఓవరాల్ గా...
మాంఝీ-ది మౌంటేన్ మ్యాన్ ఒక మంచి చిత్రమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంకల్ప దీక్ష ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే సందేశాన్ని ఇచ్చారు. సినిమాలో అక్కడక్కడ ఏదో మిస్సయిన భావన కలుగినా ఆ భావన ప్రేక్షకుడిపై పెద్దగా ఎఫెక్ట్ చూపదు. తప్పకుండా చూడాల్సిన సినిమా.

English summary
Inspired by a true story, Manjhi - The Mountain Man is a stirring tale of an unsung hero, Dashrath Manjhi (Nawazuddin Siddiqui), the man who single handedly cut a mountain to pave a path from his village Gehlore to the nearest town, Wazirganj near Gaya in Bihar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu