twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనదేశం 'మనోహర'మనే చిత్రం

    By Staff
    |

    Manohram
    -జలపతి గూడెల్లి
    చిత్రం: మనోహరం
    నటీనటులు: జగపతిబాబు, లయ, ప్రకాష్‌ రాజ్‌
    దర్శకత్వం: గుణశేఖర్‌

    దేశంలోని ఐ.ఎస్‌.ఐ కార్యకలాపాలపై తీసిన చిత్రమిది. కోయంబత్తుర్‌, ఢిల్లీ వంటి నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్ళు వంటి వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని నిర్మించిన ఈ చిత్రకథ పాతదే. అయితే దేశభక్తి నేపథ్యానికి కొత్తగా పెళ్ళైన భార్యభర్తల అలకలు, తగాదాలు, ప్రేమలు జోడించడంతో 'మనోహరం', మూస చిత్రాలకు కొంత భిన్నంగా ఉంటుంది. టేకింగ్‌ కు ప్రాధాన్యమిచ్చే దర్శకుడు గుణశేఖర్‌ చిత్రాన్ని రమ్యంగా మలిచే ప్రయత్నంలో అక్కడక్కడ తప్పటడుగులు వేశాడు.

    జగపతిబాబు ఒక బ్యాంక్‌ ఉద్యోగి. ఇంటర్‌ పాసైన ఓ పల్లెటూరి యువతి లయను పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఈ పెళ్ళి ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండదు. చక్కగా చదువుకోవాలన్నేదే ఆమె కోరిక. చీకూ, చింత లేకుండా హాయిగా మ్యారీడ్‌ లైఫ్‌ ను ఎంజాయి చేయాలన్న జగపతిబాబు ఆశ- లయ అయిష్టత వల్ల నిరాశే అవుతుంది. తన స్నేహంతో ఆమెను మార్చేందుకు ప్రయత్నిస్తాడు. హనీమూన్‌ కు వెళ్తే దగ్గరవుతామన్న ఉద్దేశంతో తనని ఢిల్లీ తీసుకువెళుతాడు. అక్కడ జరిగిన బాంబు పేలుడు ఘటన, జగపతి బాబు ప్రవర్తన లయ మనసును మార్చేస్తాయి. ఇద్దరు ఒకటై తిరిగి హైదరాబాద్‌ కు వస్తారు.

    మనోహరంగా సాగుతున్న వారి కాపురం ఒక్కసారిగా జగపతిబాబు అరెస్టుతో మారిపోతుంది. ఐ.ఎస్‌.ఐ ఏజెంట్‌ అన్న నెపంతో అతన్ని పోలీసులు టాడా చట్టం కింద నిర్భందిస్తారు. తగిన సాక్ష్యాధారాలున్నాయంటూ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు లయ ప్రయత్నిస్తుంది. 9 వ నెంబర్‌ ఫ్లాట్‌ లో ఉన్న వ్యక్తి ని అరెస్టు చేయాల్సిన పోలీసులు పొరపాటున 6వ నెంబర్‌ ఫ్లాట్‌ లో ఉన్న తన భర్తను అరెస్టు చేశారని లయ గ్రహిస్తుంది. ఈ విషయన్నే కేసు విచారిస్తున్న సిబిఐ అధికారి ప్రకాష్‌ రాజ్‌ కు చెపుతుంది. వీరిద్దరు కలసి జగపతిబాబును ఎలా రక్షిస్తారు? అసలు ఐఎస్‌ఐ ఏజెంట్‌ ముకేష్‌ రుషిని ఎలా పట్టుకుంటారనేదే చిత్రం ముగింపు.

    కొత్తగా పెళ్ళైన జంటగా జగపతిబాబు, లయలు చక్కగా నటించారు. లయ నటన బావున్నా డబ్బింగ్‌ బాగాలేదు. సిబిఐ అధికారి పాత్రకు ప్రకాష్‌ రాజ్‌ న్యాయం చేసినా, కొన్ని సందర్భల్లో 'అతిగా' నటించడం ఎబ్బెట్టుగా ఉంది. మణిశర్మ సంగీతం ఫర్వాలేదు. అయితే పాటల్లో సాహిత్యం మాత్రం చాలా బావుంది. 'పిండి వెన్నెల వండివార్చిన వెండి ఇసుకల్లో..' వంటి అద్భుతమైన ప్రయోగాలు వేటూరి వారి కలం నుంచి జాలువారాయి. చిత్రానికి ఏ మాత్రం పొంతన కుదరని కొన్ని సన్నివేశాలను దర్శకుడు గుణశేఖర్‌ ఎడిట్‌ చేస్తే బావుండేది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X