twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృదయాల్ని కదిలించే సినిమా... ('మసాన్' రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    3.0/5
    హైదరాబాద్: అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన తొలి హిందీ చిత్రం ‘మసాన్'. మసాన్ అంటే ‘ఒంటరిగా ఎగిరిపో’ అని అర్థం. ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద స్టార్స్ లేరు. పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

    ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? అంటే హృదయాల్ని కదిలించే సంఘటనలు, సన్నివేశాలు ఉన్నాయి. ప్రస్తుత సామాజిక, సాంకేతిక పరిస్థితుల్లో యువతరం ధోరణికి అద్దం పట్టే విధంగా ఉంది. ఇప్పటికే ఈచిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2015లో రెండు అత్యున్నత అవార్డులు గెల్చుకుంది. గెలిచిన బహుమతుల్లో ఒకటి మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ , రెండోంది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్.

     'Masaan' Telugu movie Review

    కథ విషయానికొస్తే...
    సినిమా రెండు సపరేట్ స్టోరీలతో సాగుతుంది. అందులో ఒక స్టోరీ దేవి పాఠక్(రీచా చద్దా)కు సంబంధించినది, రెండోది దీపక్ చౌదరి (వికీ కౌశల్)కు సంబంధించినది. దేవి పాఠక్ తన క్లాస్ మేట్‌తో ప్రేమలో పడుతుంది. బాయ్ ఫ్రెండుతో కలిసి లాడ్చికి వెళ్లి పోలీసు ఇన్స్‌స్పెక్టర్ మిశ్రా(భగ్వాన్ తివారి)కి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోతుంది. ఈ సంఘటన తర్వాత ఆమె లైఫ్ మారిపోతుంది. ఆమె బాయ్ ఫ్రెండుతో లాడ్జిలో ఉన్న వీడియోను తీసిన మిశ్రా డబ్బు కోసం ఆమెను, ఆమె తండ్రి విధ్యాధర్ పాఠక్ (సంజయ్ మిశ్రా)ను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. మరో వైపు దీపిక్ స్టోరీ... కాశీ ఘాట్లలో శవాలను తగలబెట్టే కులానికి చెందిన దీపక్ కుమార్ (విక్కీ కౌశల్) ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతుంటాడు. ఉన్నత వర్గానికి చెందిన శాలూ గుప్తా(శ్వేతా త్రిపాఠి)తో ప్రేమలో పడతాడు. సమాజం వారి ప్రేమను ఆమోదించే పరిస్థితిలో ఉండదు. దేవి పాఠక్, దీపిక్ కుమార్ తమ తమ సమస్యలను ఎలా అధిగమించారు అనేది తర్వాతి కథ...

     'Masaan' Telugu movie Review

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
    దర్శకుడు తను అనుకున్న పాత్రలకు తగిన నటీనటులను ఎంచుకున్నాడు. రీచా చద్దా తన పాత్రలో ఒదిగి పోయింది. ప్రతి సీన్లోనూ కాన్ఫిడెంట్‌గా చరిష్మాటిక్‌గా ఆకట్టుకుంది. కర్మకాండల పూజారి పాత్రలో సంజయ్ మిశ్రా నటించాడు. కూతురిపై పడ్డ నిందను తుడుచుకునే క్రమంలో పదేళ్ల కుర్రాడి జీవితాన్ని రిస్కులో పెట్టే పాత్ర అతడిది. అతని పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్సే విధంగా ఉంది. వికీ కౌశల్, శ్వేతా త్రిపాఠి లుక్ ఫ్రెష్ గా ఉంది. పెర్ఫార్మెన్స్ కూడా బావుంది.

     'Masaan' Telugu movie Review

    టెక్నికల్ అంశాలు..
    దర్శకుడు సినిమాను వాస్తవిక దృక్ఫథంతో తెరకెక్కించాడు. ప్రతి ఫ్రేములోనూ రియాల్టీ ఉట్టిపడే విధంగా ఉంది. ప్రస్తుత సమాజ పరిస్థితులు, సాంకేతికత యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశాలను అద్భుతంగా ప్రజంట్ చేసాడు. పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే, పాత్రల్లో భావోద్వేగం, సంఘర్షణ అద్భుతంగా ఆవిష్కరించాడు. అయితే సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు మాత్రమ లేవు. అయితే సినిమా కాస్త స్లోగా సాగడం కూడా విసుగు తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ కథ, సినిమా స్వభావానికి తగిన విధంగా చాలా బావుంది. ఇండియన్ ఓసియన్ టీం అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్ ఎక్సలెంటుగా ఉంది. నేను కాల్చే శవాలతో పాటు నా మనసూ రోజూ కాలి పోతుంది లాంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

    చివరగా...
    మసాన్ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సినిమా కంటెంట్, భావోద్వేగాలు ప్రతిఒక్కరి హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నాయి.

    English summary
    Vicky Kaushal, Richa Chadda starrer Masaan movie Telugu Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X