Mass Jathara First Review: మాస్ జాతర ఫస్ట్ రివ్యూ
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మాస్ జాతర. మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల, నితిష్ నిర్మల్, రీతూ పీ సూద్ తదితరులు నటించిన చిత్రానికి భాను భోగవరం దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, విధు అయ్యన్న సినిమాటోగ్రఫిని, నవీన్ నూలీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. అయితే ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ మూవీపై వారు వెల్లడించిన అభిప్రాయాలు ఏమిటి? ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
యాక్షన్‌తోపాటు మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో హీరోగా రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్స్‌పెక్టర్‌గా నటిస్తున్నారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో గంజాయి అక్రమ రవాణా ఓ అంశంగా కథ సాగుతుంది. కానీ ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్ అంశాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉన్నాయి అని ప్రమోషన్స్‌లో రవితేజ చెప్పారు.

మాస్ జాతర మూవీని ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు వీక్షించిన అనంతరం కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్లపై స్వల్ప అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ దిశగా వారు మార్పులు, చేర్పులు చేసి క్లియర్ చేసుకొన్నారు. దాంతో వారు ఈ సినిమాపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ మాస్ ఎలిమెంట్స్ మరోసారి ఆకట్టుకొనేలా ఉన్నాయి. శ్రీలీల గ్లామర్ ఈ మూవీ ప్లస్ అవుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్లు యూత్‌ను అలరిస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.
మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ అధికారులు యూఏ (U/A 16+) సర్టిఫికెట్ ఇచ్చారు. 16 ఏళ్లు దాటిన యువతీ, యువకులు, పెద్దలు ఈ సినిమాను చూడటానికి అభ్యంతరాలు ఏమీ ఉండవు. కానీ 16 ఏళ్ల లోపు ఉండే యూత్ మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో చూడోచ్చని తమ సర్టిఫికెట్ జారీ సందర్భంగా వెల్లడించారు.
ఇక ఈ మూవీకి కథ స్వభావ రీత్యా, యాక్షన్, ఇతర అంశాల విషయంలో క్లారిటీగా చెప్పే విధంగా ఈ సినిమాను నిడివిని కొంత పెంచాల్సి వచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు అంటే.. 160 మినిట్స్ రన్ టైమ్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా నవంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్స్ 31వ తేదీన గ్రాండ్‌గా పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించేందుకు నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











