Mithra Mandali First Review: మిత్ర మండలి మూవీ ఫస్ట్ రివ్యూ

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం మిత్ర మండలి. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. రాజీవ్ కుమార్ రామ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వినోదభరిత చిత్రానికి నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్, సిద్దార్థ్ ఎస్టే సినిమాటోగ్రఫి, పవన్ కల్యాణ్ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్, శిల్ప టంగుటూరు కాస్ట్యూమ్స్ విభాగాలను పర్యవేక్షించారు. ఈ చిత్రం అక్టోబర్ 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాకు వారు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ లభించింది అనే వివరాల్లోకి వెళితే..

Mithra Mandali Review by Censor Board

జంగ్లీ పట్టణం అనే ఓ ఫిక్షనల్ టౌన్‌లో నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ. గ్రామంలో తన కూతురు వంక ఎవరైనా చూస్తే.. వాడి అంతు చూసే తండ్రికి బిడ్డగా ఓ సాఫ్ట్ పాత్రలో నిహారిక ఎన్ఎమ్ నటించారు. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా చిలిపి చేష్టలతో సినిమా సాగుతుంది. ఈ చిత్రం ఎక్కువగా యూత్‌కు రిలేట్ అయ్యేలా కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టించి రూపొందించారు.

మిత్ర మండలి మూవీని వీక్షించిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆద్యంతం వినోదభరితంగా ఉంది. సమాజంలోని వ్యవస్థల మీద సున్నితంగా విమర్శనాస్త్రాల్ని సంధించారు. మిత్ర మండలిని బడ్డీ కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే మంచి సెటైరికల్ మూవీగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం అని సెన్సార్ ప్రశంసలు గుప్పించి, అభినందనలు తెలిపారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

మిత్ర మండలి సినిమా చూసిన తర్వాత కొన్ని స్వల్ప మార్పులు చేయాలని సూచించారు. కొన్ని డైలాగ్స్ మార్పులు చేయాలని లేదా బీప్స్ వేయాలనే సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఈ సినిమాను పూర్తి పరిశీలన తర్వాత అధికారులు యు/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ చూసేలా అనుమతి ఇచ్చారు. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో వీక్షించాలని సలహా ఇచ్చారు. ఈ సినిమా రన్ టైమ్ సుమారుగా 148 నిమిషాలు అని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X