twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మిస్టర్ ఫర్ ఫెక్ట్'..నాట్ ఫర్ ఫెక్ట్ (ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' రివ్యూ)

    By Srikanya
    |


    -జోశ్యుల ప్రకాష్
    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    తారాగణం: ప్రభాస్, తాప్సీ, కాజల్, ప్రకాష్ రాజ్, కె విశ్వనాధ్, నాసర్, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు.
    కూర్పు: మార్తాండ్ కే వెంకటేష్
    సినిమాటోగ్రఫీ: విజయ్ కే చక్రవర్తి
    సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
    నిర్మాత: దిల్ రాజు
    దర్శకత్వం:దశరధ్

    ఓ శుభవార్త..ఫెరఫెక్ట్ గా ఉండటం ఎలా అనే విషయాన్ని తెలుసుకోవటానకి ఇకనుంచి ఓపిగ్గా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తిరగెయ్యక్కర్లేదు. బోలెడు డబ్బులు తగలేసి పర్శనాలిటీ డవలప్ మెంట్ క్లాసులకు పోనక్కర్లేదు.చక్కగా మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం టిక్కెట్టు తీసుకుని ధియోటర్ లో వెనక్కి వాలి కూర్చుంటే చాలు.మీకిష్టమైన ఆర్టిస్టులు పనిగట్టుకుని మరీ జీవితపాఠాలు వివరించేస్తారు.ఇదేంటి సినిమాకి వెళితే పాఠాలు బోధించటం ఏంటి అంటారా...ఏం బొమ్మరిల్లు అప్పుడు చెప్తే మీరు వినలేదా..అది బాగా నచ్చిందని మెచ్చుకుని హిట్టు చేసారనే అదే ఫార్మెట్ లో కాస్త డోస్ పెంచి చెప్తున్నాం..అని దిల్ రాజు ఫిక్సై ఈ చిత్రం చేసినట్లుంది.మరి సగటు ప్రేక్షకుడు దీన్నుంచి ఏమి ఎక్సపెక్ట్ చేయవచ్చు అంటే...

    తనకోసం,తన సంతోషం కోసమే బ్రతికే విక్కి(ప్రభాస్)ది దేనికీ రాజీపడని వ్యక్తిత్వం.ఆస్ట్రేలియాలో వీడియోగేమ్స్ తయారుచేసే విక్కీ చెల్లి పెళ్ళికోసం ఇండియా వస్తాడు.అక్కడ సహజంగానే చిన్ననాటి స్నేహితురాలు ప్రియ(కాజల్)కలుస్తుంది.ఆమె కామన్ గానే విక్కీకి వ్యతిరేకమైన భావాలు గల వ్యక్తిత్వం.విక్కీని చూసిన ఆమె మొదట చిరాకు పడ్డా తర్వాత ప్రేమలో పడుతుంది.అంతేగాక విక్కీ కోసం తన ఆలోచనలను,అలవాట్లను,జీవితాన్ని మార్చేసుకోవటానికి సిద్దపడుతుంది.ఇది గమనించిన విక్కీ ..నో..ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ఉండాలి వేరొకరి కోసం మన ఇష్టాలు మార్చుకుంటే పోతే చివరకు మనకంటూ ఏదీ మిగలదు అని పెద్ద క్లాస్ పీకి ప్రియను వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు.అక్కడికి వెళ్ళిన అతనికి తనలాంటి ఆలోచనలతోనే ఉన్న మ్యాగి(తాప్సి)కలుస్తుంది.తొలి చూపు..తొలి డైలాగులతోనే ఇద్దరూ డేటింగ్ కు సిద్దపడతారు.మరి ఇండియాలోనే మిగిలిపోయిన ప్రియ చివరకు విక్కిని ఎలా కలుస్తుంది.విక్కిలో ఎలా మార్పు వస్తుంది అనేది తెరపై చూడాల్సిందే.

    బొమ్మరిల్లు లాగే ఈ చిత్రాన్ని హిట్ చేయాలని కంకణం కట్టుకుని దిల్ రాజు ఈ చిత్రం ప్లాన్ చేసినట్లు సినిమా మొదటి సీన్ కే అర్దమవుతుంది.ఇక సెకెండాఫ్ కి వచ్చేసరికి హీరోని పట్టుకుని బొమ్మరిల్లులో లాగానే ప్రకాష్ రాజు..నువ్వు మాతో పాటు నాలుగురోజులు ఉండు. అందరికీ నచ్చితే నిన్ను ఓకే చేస్తాను అనటంతో ఇది బొమ్మరిల్లుకి నకలు అని అర్దమవుతుంది.దానికి తగినట్లు డైలాగులు,సీన్స్ కూడా ఎక్కడికక్కడ పాఠాలు చెప్తూ ప్రేక్షకుడుని టార్చర్ పెడుతూంటాయి.వీటికి తోడు తన కోసమే తాను బ్రతికే హీరో పాత్ర లో మార్పు వచ్చే సన్నివేశాలు కూడా పూర్తిగా పండలేదు.కేవలం డైలాగుల మీద సినిమాలో చెప్పదలుచుకున్న విషయాన్ని డెలవరీ చేసే ప్రయత్నం చేసారు.

    ఇక కాజల్ పాత్ర బృందావనంలో లాగ ఎప్పూడు భూదేవంత ఓర్పుతో సాగుతూంటుంది.తాప్సీ నుంచి మరేదో ఎక్సపెక్ట్ చేసిన వారికి ఈ చిత్రం తృప్తిని ఇవ్వదు.స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మొదట్లో స్పీడుగా సాగినా సెకెండాఫ్ కి వచ్చేసరికి డల్ అయిపోయింది.కథ మొత్తాన్ని పాత్రలు కాకుండా విధే నడిపించటం జరిగింది.పాత్ర చుట్టూ,అతనిలో మార్పు కోసం జరిగే క్యారెక్టర్ డ్రైవన్ ఫిలింస్ లో ఇది కొద్దిగా ఇబ్బందికర అంశమే.అయినా ఈ పాత కథకు కొత్తగా అనిపించటానికి తగిన స్క్రీన్ ప్లేని మాత్రం హరి ఇవ్వగలిగాడు.అన్నిటికన్నా బ్యాడ్ ఏమిటంటే..కథలో అస్సలు ఇమడని బ్రహ్మానందం,రఘుబాబు కామిడీ,ఫైట్స్.లైటర్ వీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దామనకున్నప్పుడు ఇలాంటి కొన్ని కమర్షియల్ అంశాలను త్యాగం చేస్తే సినిమాకు నిండుతనం వచ్చేది.ప్రభాస్ ఎప్పటిలాగే క్యారెక్టర్ లో లీనమై పోయి ఈజీగా నటించిపారేసాడు.టెక్నికల్ గా కెమెరా,ఎడిటింగ్ వంటి శాఖలు వంక పెట్టాల్సిన పనిలేదు.పాటలు మూడు బాగున్నాయి. రీరికార్డింగ్ ఎమోషనల్ సీన్స్ లో ఆ డెప్త్ తేలకపోయింది.

    అసభ్యత,అశ్లీలం లేకుండా ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఆ వర్గాన్నే ఆకర్షించే అవకాశం ఉంది.టైటిలూ,ప్రమోషన్ చూసి బొమ్మరిల్లు రేంజి సినిమా అనుకోకుండా ప్రభాస్ డార్లింగ్ లా ఉంటుంది అనుకుని వెళితే నిరాశపరచదు.

    English summary
    Mr Perfect is a romantic love story with a family drama based movie in which, chemistry between Prabhas, Kajal and Tapsi will be highlight of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X