»   » సూపర్ మిర్చి... ( S/o సత్యమూర్తి మ్యూజిక్ రివ్యూ)

సూపర్ మిర్చి... ( S/o సత్యమూర్తి మ్యూజిక్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5
హైదరాబాద్: ‘S/o సత్యమూర్తి' ఆడియో ఇటీవల గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో మరో హిట్ మ్యూజికల్ ఆల్బంగా ఈ చిత్రం ఆడియో పేరు తెచ్చుకుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో 5 బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి. ‘S/o సత్యమూర్తి' ఆల్బంతో వీరు డబల్ హాట్రిక్ కొట్టారు. పాటలు ఎలా ఉన్నాయనే విషయం రివ్యూలో చూద్దాం...
MUSIC REVIEW: Son Of Satyamurthy - Super Machi

1. వన్ అండ్ టూ అండ్ త్రీ : ఈ పాట లిరిక్స్ రాసింది మరెవరో కాదు మల్టీ టాలెంటెడ్ దేవిశ్రీ ప్రసాద్. పాండింది సూరజ్ సంతోష్. ఈ సాంగ్ ట్రాక్స్ డిఫరెంట్ మ్యూజిక్ తో ఆకట్టుకునే విధంగా ఉంది.

2. శీతాకాలమ్ : ఈ పాటను రాసింది శ్రీమణి. లెటెస్ట్ సెన్నేషన్ యాసిన్ నాజర్ ఈ పాటను పాడారు. స్వీట్ మెలొడీ గా ఈ పాటకు గుర్తింపు వచ్చింది. ఈ పాటకు దేవిశ్రీ తనదైన శైలిలో హార్మోనియస్ ట్యూస్స్ ఇచ్చాడు.

3. చల్ చలో చలో : ఈ పాట రాసింది రామజోగయ్య శాస్త్రి. రఘు దీక్షిత్, రిటా, సూరజ్ సంతోష్ స్వరం అందించారు. అల్లు అర్జున్ కు పర్ ఫెక్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. అయితే ఈ పాట ట్యూన్స్ ఆయన గతంలో చేసిన ఓ సినిమాలోని పాటలా ఉందనే టాక్ వచ్చింది.

4. కమ్ టు ది పార్టీ: ఈ సాంగ్ పాండింది విజయ్ ప్రకాష్. రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాట సినిమాకు ప్లస్సయ్యే విధంగా ఉంది.

5. సూపర్ మిర్చి: అల్లు అర్జున్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్ ఎలాంటి ట్యూన్స్ కోరుకుంటారో....అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఈ పాట రాసింది స్వయంగా దేవిశ్రీ ప్రసాదే కావడం విశేషం.

6. జారుకో : ఈ పాట రాసింది శ్రీమణి. దేవిశ్రీ ప్రసాద్ బ్రదర్ సాగర్ ఈ పాట పాడారు. ఇదొక సిచ్యువేషనల్ సాంగ్. కథలో భాగంగా సాగిపోతుంది.

7. వచ్చాడు : ఈ పాట రాసింది కూడా దేవిశ్రీ ప్రసాదే. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసే విధంగా ఉంది.


ఓవరాల్‌‌గా చెప్పాలంటే... S/o సత్యమూర్తి మ్యూజిక్ ఆల్బంకు మిశ్రమ స్పందన వస్తోంది. ఆయన గత సినిమాల్లోని ట్యూన్స్ రిపీట్ అయ్యాయని అంటున్నారు. అయితే పాటలు మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సూపర్ మిర్చి సాంగ్ మాస్ నంబర్లలో హైలెట్ అయ్యే విధంగా ఉంది.

English summary
Son Of Satyamurthy songs have hit the list of chart-busters of 2015 straight away. Devi Sri Prasad and Allu Arjun's combination was renowned for its super hit albums. The duo have delivered 5 blockbuster albums till now and the latest one, Son Of Satyamurthy, finishes off their double hat-trick.
Please Wait while comments are loading...