For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వీక్ వీరుడు ( 'గ్రీకువీరుడు' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  1.5/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  నాగార్జునకు 'సంతోషం' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దశరథ్ మరోసారి నాగ్ ని డైరక్ట్ చేయబోతున్నాడంటే ఓ రేంజి అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలకు పోటీపడుతున్నట్లు నాగార్జున కూడా తన కొడుకులకు పోటీ ఇచ్చేటట్లు మరింత యంగ్ గా రెడీ అయ్యి తెరపైకి దూకేసాడు. ఆయనకి జోడిగా నయనతార కూడా సై అంది. అయితే వీరి కాంబినేషన్ కి తగినట్లుగా సినిమా స్క్రిప్టు జతకూడలేదు. ఫస్టాఫ్ ఫరవాలేదనుకున్నా..సెకండాఫ్ కి నమ్ముకున్న కామెడీ కుదరలేదు. I Do (2006) ఆధారంగా వచ్చిన ఈ చిత్రం టార్గెట్ చేసిన ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకర్షించం కష్టమే అనిపిస్తోంది.

  అమెరికాలో పుట్టిన పెరిగిన చందు (నాగార్జున) ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తూంటాడు . ప్రేమ , అనుభంధాలకు విలువ ఇవ్వని ప్లే బోయ్ చందు పై బిజినెస్ పరంగా ఓ కేసు పడి...అందులోంచి బయిటపడటానికి డబ్బు అవసరమై, ఇండియాలో ఉన్న తన కుటుంబ ఆస్ధిని తెచ్చుకోవటానికి వస్తాడు. ఈ ట్రిప్ లో అతనికి బంధాలు,అనుబంధాలకు ప్రాణమిస్తూ 'మేకే ఎ విష్ పౌండేషన్' లో పనిచేస్తూండే సంధ్య (నయనతార) తారసపడుతుంది. ఇంటికి వెళ్లిన చందు..అనుకోని పరిస్దితుల్లో తన తాత,అత్తయ్యలకు సంధ్యను...తన భార్యగా పరిచయం చేయాల్సి వస్తుంది. అందుకు ఆమెను ఒప్పించిన చందు అక్కడితో ఆ రిలేషన్ పూర్తై పోతుందనుకుంటాడు. కానీ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అప్పుడేం జరిగింది..చందు ఒరిజనల్ క్యారెక్టర్ తెలుసుకున్న సంధ్య అతనితో జీవితం పంచుకోవటానికి ఒప్పుకుందా వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

  క్లాసిక్ నేరేషన్ లో చెప్పిన ఈ చిత్రం కథని...ఫీల్ గుడ్ సినిమాలా ప్యామీలీ ఎంటర్టైనర్ గా మార్చాలన్న దర్శకుడు తాపత్రయం ప్రతీ చోటా కనపడుతుంది. అయితే దర్శకుడు ప్రస్తుతం కామెడీ ట్రెండ్ నడుస్తోంది,లేకపోతే చూడరు అనుకున్నాడో ఏమోకానీ...కథమీద కన్నా కామెడీ క్యారెక్టర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. అయితే ఆ పాత్రలు ఊహించినంత కిక్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా కథలో కామెడీ సిట్యువేషన్స్ పెద్దగా లేకపోవటంతో... అవి కావాలని పెట్టిన పాత్రలుగానే మిగిలిపోయాయి. సంతోషం సినిమాలా పూర్తిగా ఫీల్ గుడ్ తరహాలో దశరథ్ తీసి ఉంటే ఓ వర్గం అయినా పూర్తిగా సంతృప్తి చెందేది.

  ఇక ఫ్రెంచి చిత్రం I Do (2006) కథ ఫస్టాఫ్ వరకూ మాత్రమే సరిపోయింది. ఒరిజనల్ కథలో క్లైమాక్స్ మన ఇంటర్ వెల్ కి వచ్చింది. అక్కడనుంచి లింక్ అప్ అయ్యేలా... సెకండ్ హాఫ్ లో కథ కంటిన్యుటీ కుదరలేదు. ముఖ్యంగా ఇంటర్ వెల్ కే హీరో పాత్రలో మార్పు రావటం జరిగింది. దాంతో సెకండ్ హాఫ్ లో హీరో వైపు నుంచి ఇంటర్నెల్ కాంప్లిక్ట్ లేకుండా పోయింది. క్యారెక్టర్ డ్రైవన్ సినిమాగా మొదలైన ఈ చిత్రం ఇంటర్ వెల్ దాకా సాగి... సెకండ్ హాఫ్ లో రొమాంటిక్ కామెడీగా బలవతంగా మార్చి నట్లు అయ్యింది. ఇది కథన లోపమే.

  మిగాతా రివ్యూ..స్లైడ్ షోలో....

  ముఖ్యంగా సినిమాలో సగం , బ్లూ మ్యాట్ ,గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ సీన్స్ ఎక్కవైపోయాయి. అవీ ప్రేక్షకుడుకి తెలిసిపోయాలా చేయటం కాస్త ఇబ్బందికరమే.

  ఈ సినిమాలో నాగార్జున మాత్రం మరింత యంగ్ గా మారి అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన గెటప్,లుక్స్, ఎమోషన్స్ పండించే సీన్స్ అదుర్స్. ముఖ్యంగా సాంగ్ సీక్వెస్ లో కొన్ని స్టెప్స్ నాగ్ మాత్రమే వేయగలరనిపించారు.

  నయనతార నటన గురించి ప్రత్యేకంగ చెప్పేదేముంది. బాస్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఆమె మెచ్యూరిటీతో తన క్యారెక్టర్ ని పండించే ప్రయత్నం చేసింది. కాకపోతే ఆమె పాత్రకు దర్శకుడు డెప్త్ ని అద్దలేకపోయాడు.

  సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. గోపీమోహన్,కోన వెంకట్ చేత ప్రత్యేకంగా రాయించారు. ఎమ్ ఎస్ నారాయణ, బ్రహ్మానందం చిత్రంలో పెద్ద క్యారెక్టర్స్ చేసారు. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అలాగే..వేణుమాధవ్, శ్రీనివాస రెడ్డి,ధర్మవరపు, వెన్నెల కిషోర్ వంటి కమిడియన్ లు ఉన్నా వారి ట్యాలెంట్ ని వాడుకోలేదు.

  పాటలు విషయానికి వస్తే ఐ హేట్ లవ్ స్టోరీస్ పాట చాలా బాగుంది. మొత్త మీద మూడు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది.

  కెమెరా వర్క్ అసలు బాగోలేదు. సినిమాని అదే దెబ్బతీసింది. ఇలాంటి సినిమాలకు రావాల్సిన రిచ్ లుక్ రాలేదు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో మరింతగా బాగా షార్ప్ చెయ్యాల్సింది. అక్కడ మరీ టీవీ సీరియల్ గా సాగుతూపోయింది.

  అలాగే కామెడీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమ్యూజ్ మెంట్ వద్ద వచ్చే కామెడీని భరించంట కష్టం. అలాగే బ్రహ్మానందంని నాగార్జున ..మన్మధుడు తరహాలో ఇరికించాలనే ప్రయత్నం సీన్స్ కూడా ఎక్కడా నవ్వు రాకుండా జాగ్రత్తపడి తీసినట్లుంది.

  సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. హీరో,హీరోయిన్స్ కెమిస్ట్రీ కూడా అదే రేంజిలో ఉండి ఉంటే బావుండేది.

  సినిమాలో దశరథ్ కొన్ని చోట్ల ఎమోషన్ సీన్స్ బాగానే పండించాడు. కానీ... ఎక్కువ ఏదో చెప్పాలని తాపత్రయంలో డైలాగులును సాగతీసి,చెప్పిందే చెప్పిస్తూ..ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు.

  సంస్థ: కామాక్షి మూవీస్‌
  నటీనటులు: నాగార్జున, నయనతార, మీరాచోప్రా, కె.విశ్వనాథ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, అలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, నాగినీడు, భరత్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు
  ఫోటోగ్రఫీ: అనిల్ బండారి,
  సంగీతం: థమన్,
  ఆర్ట్: ఎస్. రవీందర్,
  ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
  కో-డైరెక్టర్: కె. సదాశివరావు,
  స్క్రీన్ ప్లే: హరి కృష్ణ,
  అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్,
  కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి,
  నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి,
  కథ-దర్శకత్వం: దశరథ్.
  విడుదల: 03-05-2013.

  ఏదైమైనా 'గ్రీకువీరుడు' ని ఈ వేసవిలో,ముఖ్యంగా...టిక్కెట్ థరలు బాగా పెంచేసిన ఈ నేపధ్యంలో ఎంతవరకూ వర్కవుట్ అవుతుందీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ సహనం రేంజిని బట్టి..అలాగే .. ఫ్యామిలీలో నాగ్ ఫ్యాన్స్ ఉంటే...అసభ్యత,శృంగారం,హింస లేదు కాబట్టి ఓ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు... అలా కాకపోతే చక్కగా టీవీ లో వచ్చినప్పుడు చూసి సరిపెట్టుకోవచ్చు.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Nag's Greeku Veerudu released today with divide talk. The first half has all the masala elements to lure the masses. But the second half is dull. The pace of the movie slows down in this portion, which has several lope-holes, silly and mindless scenes. The climax of the film is average and it lacks freshness.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X