»   » భక్తులకు పండగయా!!(‘ఓం నమో వేంకటేశాయ’ రివ్యూ)

భక్తులకు పండగయా!!(‘ఓం నమో వేంకటేశాయ’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఎన్ని చిత్రాలు వచ్చినా మొదట గుర్తు వచ్చే చిత్రం 'అన్నమయ్య' . వరస కమర్షియల్ సినిమాలు చేస్తున్న దర్శకేంద్రుడు అప్పట్లో హఠాత్తుగా రూటు మార్చి భక్తిరస చిత్రం అందించి అద్బుతం అనిపించుకున్నారు. ఆ తర్వాత భక్త రామదాసు వచ్చినా, శిర్డీ సాయిబాబా అన్నా ఆ స్దాయి అప్లాజ్ రాలేదు.

అయితే మళ్లీ ఇంతకాలానికి వెంకటేశ్వరస్వామి భక్తుడు కథతో 'ఓం నమో వేంకటేశాయ' కాంబినేషన్ రిపీట్ అవుతోందనగానే 'అన్నమయ్య' స్దాయిలో ఉండే సినిమా వస్తుందని ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ ఎక్సపెక్టేషన్స్ ని 'ఓం నమో వేంకటేశాయ' అందుకుందా అంటే కొంతవరకూ మాత్రమే అని చెప్పాలి. అయితే సినిమాలో మనకు ఆసక్తి కలిగించే అనేక స్వామివారికి సంభందించిన అనేక విశేషాలు,తిరుమలలో నిత్యం ఆచరించే ఆచారాలు గుది గుచ్చి అందించటం మాత్రం అద్వితీయం అనిపిస్తుంది.


భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. అయితే కథ జనాలకి పెద్దగా తెలిసింది కాకపోవటం కలిసి వచ్చింది. దాంతో ఫ్రెష్ గా ఓ కొత్త సినిమా చూస్తున్న ఇంపార్ట్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టులా నిలిచింది. ముఖ్యంగా నాగార్జున ఫెరఫార్మెన్స్ ఆయన అభిమానులను మాత్రమే సినీ లవర్స్ చేత కూడా శభాష్ అనిపిస్తుంది. ఇంతకీ ఈ చిత్రం కథ ఏమిటి... హైలెట్స్,మైనస్ లు క్రింద రివ్యూలో చూద్దాం...


 ఆ వయస్సులోనే తపస్సు

ఆ వయస్సులోనే తపస్సు


ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతుంది. 16 శతాబ్దానికి చెందిన రామ్ (నాగార్జున) చిన్నతనం నుంచీ దేవుడిని చూడాలనే కోరికతో జ్వలిస్తూంటాడు. దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ చిన్నతనంలోనే ఇంట్లోంచి బయిటకు వచ్చి...తిరుమలలోని గురువు పద్మానంద స్వామి (సాయికుమార్) నడుపుతున్న వేద పాఠశాలలో చేరుతాడు. అక్కడే విద్య అభ్యసిస్తూ..ఆయన చెప్పిన మాటతో తపస్సుకు సైతం పూనుకుంటాడు.


 గుర్తించలేపోతాడు

గుర్తించలేపోతాడు


రామ్ చేసే తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ దేవుడ్ని అప్పుడు గుర్తించలేకపోతాడు. తర్వాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్న కొంతమంది వలన దేవుడిని చేరుకోలేకపోతాడు. కృష్ణమ్మ తో ..

కృష్ణమ్మ తో ..


ఆ క్రమంలోనే మరో వెంకటేశ్వర సామి భక్తురాలు కృష్ణమ్మ (అనుష్క) ను కలుస్తాడు. ఆమెతో కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని, క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తూంటాడు. అతని భక్తికి ముగ్దుడైన వెంకటేశ్వర స్వామి మరోసారి అతనికి దగ్గరై అత్యంత ఆప్తుడిగా మారిపోతాడు.


 స్వామీ పరీక్ష

స్వామీ పరీక్ష


తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి విధులు నిర్వర్తించటం లేదని రామ ప్రశ్నిస్తాడు. దాంతో గోవిందరాజులు... రామపై ఎందుకు కక్ష కడతాడు. మరో ప్రక్క రామను పరీక్షించాలని స్వామి నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో రామ జీవితంలో రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. నగలు ఓడిన స్వామివారు

నగలు ఓడిన స్వామివారు


రామ యొక్క భక్తి శ్రద్దలు చూసిన స్వామివారు...మొదట ఆయన కలలోనూ ఆ తర్వాత నిజ జీవితంలోనూ కనపడతారు. అంతేకాకుండా రామతో పాచికలు ఆడతారు. అలా రామా వద్ద స్వామి వారు పాచికల పందెంలో తన నగలు మొత్తం ఓడుతారు. అదే సమయంలో స్వామి వారి నగల దొంగతనం గుడిలో జరుగుతుంది. దేవాలయ అధికారులు దృష్టి, అనుమానం రామ వారిపై పడుతుంది.


 ఖైదు చేయమని రాజాజ్ఞ

ఖైదు చేయమని రాజాజ్ఞ


ఆ క్రమంలో రామా నివాసం ఉంటున్న ఆశ్రమం పై ఆ నగల కోసం దాడి చేస్తారు. అక్కడ ఆ ఆశ్రమంలో రామ వద్ద స్వామి వారి నగలు దొరుకుతాయి. దాంతో అప్పటి రాజు...రామాని ..ఖైదు చేయమని ఆజ్ఞాపిస్తాడు. హాధీరాం బాబాగా ఎలా ...

హాధీరాం బాబాగా ఎలా ...


ఈ స్వామి భక్తుడు కథలో భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) పాత్రేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? అసలు ...రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. తప్పనిపిస్తుంది

తప్పనిపిస్తుంది


ఈ సినిమాలో నాగార్జున ను చూస్తూంటే ఇంత మంచి నటుడు ఇన్నాళ్లూ గ్లామర్ తోనే నెట్టుకురావాలనుకోవటం తప్పనిపిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున ఆ పాత్రలో లీనమై కథలో కీలకమై నిలిచిన ఎమోషన్స్... అమాయకత్వం, ఆవేశం, కరుణ, భక్తి ఇలా అన్ని రసాలను అద్భుతంగా పలికించి హాథీరాం పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తేల్చేసారు

తేల్చేసారు


ఈ సినిమాకు ప్లస్ అవుతుందనుకున్న కృష్ణమ్మ (అనుష్క) ఎపిసోడ్ మైనస్ గా నిలిచింది అని చెప్పాలి. అలాగే జగపతి బాబు పాత్ర కూడా ఎక్సపెక్ట్ చేసినంత లేదు. ఆ ఎపిసోడ్ సినిమా మైనస్ లలో ప్రధానంగా నిలిచింది. అలాగే తొలిసగంలో లో రావు రమేష్ పాత్ర రొటీన్ గా అనిపించింది. ఇక ప్రభాకర్ ధరించిన మాంత్రికుడి పాత్ర హడవిడిగా తేల్చేసారు.అన్నమయ్య గుర్తుకు ..

అన్నమయ్య గుర్తుకు ..


ఫస్టాఫ్ సోసో అనిపించినా...సెంకండాఫ్ లో స్వామి వారి నిత్య కల్యాణం, నవనీత సేవ, శేషవస్త్రం విశిష్టత తదితర విషయాలన్నింటినీ కథతో ముడిపెడుతూ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. అన్నమయ్య లోని క్లైమాక్స్ మనకు తెలియకుండానే గుర్తుకు వస్తుంది.


 డాక్యుమెంటరీ కాలేదు

డాక్యుమెంటరీ కాలేదు


నిజానికి ఇదొక డివోషనల్ ఫిల్మ్ అయినా స్వామివారి భక్తులకు తెలియని ఎన్నో విషయాలను తెరపై చూపించి జనరంజకం చేసారు రాఘవేంద్రరావు. హథీరాంబాబా కథను ఒక డాక్యుమెంటరీలా కాకుండా ఆద్యంతం అలరించేలా చెప్పిన విధానమే ఈ సినిమా ప్లస్.


 ఇప్పుడే జరుగుతోందేమో..

ఇప్పుడే జరుగుతోందేమో..


అయితే కథ , కథనం 16 శతాబ్దంలో జరుగుతున్నా ఆ ఫీల్ మనకు ఎక్కడా రాదు. ఈ కాలంలోనే జరుగుతోందేమో అనిపిస్తుంది. ఆ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. రీసెర్చ్ తో పాటు ఆ కాలం నాటి వాతావరణం క్రియేట్ చేయటానికి కష్టపడితే ప్రేక్షకుడు మరింతగా తాద్యాత్మం చెందే అవకాసం ఉండేది.


 బాగా స్లోగా...

బాగా స్లోగా...


సినిమాలో అన్నమయ్య, శ్రీరామదాసులలో వచ్చిన ఎమోషనల్ డెప్త్ ఈ సినిమా లో తీసుకురాలేకపోయారు. దాంతో కొన్ని సార్లు బాగా స్లోగా సినిమా జరుగుతున్నట్లు మనకు సంభంధం లేని విషయమేదో తెరపై చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే దేవుడు, భక్తుడు పాచికలు ఆడే సన్నివేశాలు కాస్త తగ్గిస్తే బాగుండేదేమో.టెక్నికల్ గా ...

టెక్నికల్ గా ...


ఇక సాంకేతికంగా ఉన్నతంగా ఉండేలా మంచి టెక్నీషియన్స్ ని ఎన్నుకోవటంలోనే దర్శక,నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫి ఈ సినిమాకు ప్రాణమై నిలిచింది. ఆ కాలం నాటి తిరుమల గిరులు ఎలా ఉండేవో.. ఎంత పచ్చదనం ఉండేదో కళ్లకు కట్టినట్టుగా చూపించటానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. కిరణ్‌కుమార్‌ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. గౌతమ్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ఏ. మహేష్ రెడ్డి నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.


 దేవుడి ఆదరణను

దేవుడి ఆదరణను


అలాగే ఈ సినిమాకి కీలకమైన ఎమోషన్స్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద కనపడుతుంది. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు మరోసారి తనదైన మేజిక్‌ను ప్రదర్శించారు. భక్తుడి భక్తి భావాన్ని, దేవుడి ఆదరణను, వాటి రెండింటి మధ్య సంబంధాన్ని చాలా బాగా తెరపై ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం. కె.కె. భారవి అందించిన కథ కాస్త కల్పితమే అయినా కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్పింది. కీరవాణి లేకపోతే

కీరవాణి లేకపోతే


ఈ సినిమాకు కీరవాణి సంగీతం లేకపోతే అనే విషయం ఊహించలేము అన్నట్లుగా సంగీతం ఇచ్చారు. చాలా వరకూ కథ పాటల రూపంలోనే చెప్పటంతో సంగీతం బాగా ప్లస్ అయ్యింది. అదే సమయంలో కీరవాణి అందించిన పాటలు కీలక పాత్ర పోషించాయి. నేపథ్య సంగీతం కథను మన హృదయాలను తట్టిలేపేలా చేసిందిఎవరెవరు

ఎవరెవరు


ఇదే ఈ సినిమా టీమ్
బ్యానర్: ఎ.ఎం.ఆర్‌. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
నటీనటులు: నాగార్జున.. సౌరభ్‌జైన్‌.. అనుష్క.. ప్రగ్యాజైస్వాల్‌.. జగపతిబాబు.. విమలారామన్‌.. అస్మిత.. రావు రమేష్‌.. వెన్నెల కిషోర్‌.. ప్రభాకర్‌.. రఘుబాబు తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి
కథ, మాటలు: జె.కె.భారవి
నిర్మాత: మహేశ్‌రెడ్డి
దర్శకత్వం: రాఘవేంద్రరావు
విడుదల తేదీ: 10-02-2017ఫైనల్ గా ఇది రాఘవేంద్రరావు మార్క్ కమర్షియల్ భక్తి రస చిత్రం. స్వామి వారి భక్తులే కాక సినిమా భక్తులు కూడా చూడదగ్గ పురాణ కాలక్షేపమే...భక్తి వైరాగ్య సమ్మేళనమే.

English summary
Nagarjuna's matches up the expectations of his fans with his devotional 'Om Namo Venkatesaya' which hit the theatres on today. Om Namo Venkatesaya is a decent one time watch for devotional movie lovers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu