»   » 'మలర్ ' మిస్సైంది కానీ...మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది (చైతూ ‘ప్రేమమ్’రివ్యూ )

'మలర్ ' మిస్సైంది కానీ...మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది (చైతూ ‘ప్రేమమ్’రివ్యూ )

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

--- సూర్య ప్రకాష్ జోశ్యుల

నిజానికి మళయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్'రీమేక్ చేయాలనుకోవటం అతి పెద్ద సాహసం. ఎందుకంటే అందరూ ఒరిజనల్ తో పోల్చి చూడటానికి ఆసక్తి చూపెడతారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ని ప్రేమమ్ మళయాళ అభిమానులు చీల్చి చెండాడేసారు. ఓ రేంజిలో సోషల్ మీడియాలో ట్రోల్ చేసేసారు.


అయితే ఓ విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. రీమేక్ చేసేటప్పుడు..ఒరిజనల్ లోని సీన్స్ ను యధాతథంగా ట్రాన్సలేట్ చేయటం జరుగుతూంటుంది, కానీ ఫీల్ ని యధాతధంగా మక్కీకి మక్కీ దించటం కష్టం కావటంతో అది ట్రాన్సఫర్ కాదు. ఈ విషయాన్ని దర్శకుడు చందు మొండేటి కూడా గమనించినట్లున్నాడు. దాంతో సినిమాలోని సోల్ ను తీసుకుని, తనదైన శైలిలో నేటివిటిని,ఫన్ ని, ఫ్యాన్ ఎలిమెంట్స్ ని అద్దుతూ రీరైట్ చేసి సినిమా చేసాడు. ఆ విషయంలో చందు వందకు వెయ్యి మార్కులు వేయించుకున్నట్లే.


అయితే మళయాళంలో ఉన్న మ్యాజిక్ 'మలర్' పాత్ర. దాన్ని మాత్రం తెలుగులోకి అంతే సమర్దవంతంగా పట్టుకుని రాలేకపోయారు(ఒరిజనల్ చూడనివారికి ఆ తేడా తెలిసే అవకాసం లేదు. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోనక్కర్లేదు) చైతూ కూడా తన నిజ జీవితంలో ప్రేమ ఫేజ్ లో ఉండటం వలనో ఏమో కానీ ఎప్పుడూ లేనంత బాగా సీన్స్ పండించారు.


మరి ఇంతలా తెలుగులోకి సైతం రీమేక్ చేసేటంత విషయం ఈ సినిమాలో ఏముంది. ఆ కథేంటి...ఒరిజనల్ కి, ఇక్కడ తెలుగు వెర్షన్ కు వచ్చిన మార్పులు ఏమిటి, తెలుగు ఆడియన్స్ కు ఏ మేరకు కనెక్ట్ అవుతుందనే విషయాలు చూద్దాం.


2000 లో ఫస్ట్ లవ్ స్టోరీ

2000 లో ఫస్ట్ లవ్ స్టోరీ

విక్రమ్‌ అలియాస్‌ విక్కీ (నాగచైతన్య) టీనేజ్‌ లో(16 సంవత్సరాల ) 2000 సంవత్సరం నుంచి ఈ కథ మొదలవుతుంది. మీసాలు కూడా సరిగ్గా రాని ఆ వయస్సులో తన ఫ్రెండ్స్ ని వేసుకుని తన నేటివ్ ప్లేసులో తిరుగుతూ .. సుమ (అనుపమ పరమేశ్వరన్‌) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకొంటాడు. ప్రేమలేఖ కూడా రాస్తాడు. సుమ మాత్రం తాను మరో అబ్బాయిని ప్రేమించానని.. పెళ్లి చేసుకోబోతున్నానని చెబుతుంది. దాంతో మన వాడు హర్ట్.


ఈసారి శృతి హాసన్ తో

ఈసారి శృతి హాసన్ తో

తొలిసారి ఫ్లాఫ్ అయ్యాం కదా అని ఆగుతామా అన్నట్లుగా మరో లవ్ స్టోరీని ఇంజినీరింగ్ కాలేజీలో మొదలెడుతాడు విక్కీ. 2005లో ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు లెక్చరర్‌ సితార (శ్రుతిహాసన్‌)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఆమె కూడా విక్కీని ఇష్టపడుతుంది. కానీ మళ్లీ ట్విస్ట్.


ఇంకో అడ్డంకి, మళ్లీ ఫెయిల్

ఇంకో అడ్డంకి, మళ్లీ ఫెయిల్

ఇక ఆమెతోనే తన జీవితం అనుకున్న విక్కీకి ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. ఆమె కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఓ నిజం తెలిసి విక్కీ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆమెను ఇంటికెళ్లి కలుస్తాడు. ఆ తర్వాత ఆమెపై ఆశలు వదిలేసుకుంటాడు. మరో ఎపిసోడ్ ముగుస్తుంది.


లైఫ్ లో సెటిలైన విక్కీ, లవ్ లో

లైఫ్ లో సెటిలైన విక్కీ, లవ్ లో

ఆ తర్వాత కాస్త జీవితంలో సెటిలై 2016 నాటికి వృత్తిలో స్థిరపడ్డాక విక్కీని సింధు (మడోనా సెబాస్టియన్‌) వచ్చి పరిచయం చేసుకొంటుంది. మొదట ఆమెను గుర్తు పట్టక పోయినా తర్వాత ఆమెను గుర్తు పడతాడు. ఆమెతో విక్కీకి ఉన్న సంబంధం ఏంటి? తన జీవితంలోకి వచ్చిన ఈ అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలనుకొన్న విక్కీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.


మామయ్య,నాన్న కూడా సినిమాలో

మామయ్య,నాన్న కూడా సినిమాలో

ఇక ఈ సినిమాలో నాగార్జున వాయిస్ ఓవర్ చెప్పటమే కాకుండా ఓ పాత్రను కూడా పోషించాడు. అలాగే వెంకటేష్ సైతం ఓ పాత్రలో వచ్చి దడదడాలించాడు. వీళ్లద్దరి పాత్రలు ఏమిటి, శృతికి ఎదురైన ట్విస్ట్ ఏమిటి, చివరకు విక్కీ లవ్ స్టోరీ ఏ ముగింపుకు వచ్చింది వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు ఖచ్చితంగా వెళ్లి చూడాల్సిందే.


స్క్రిప్టు ఎలా ఉందంటే

స్క్రిప్టు ఎలా ఉందంటే

మళయాళ ప్రేమమ్ చిత్రం ...తమిళంలో చేరన్ చేసిన నా ఆటోగ్రాఫ్ కు మళయాళి వెర్షన్ అని అర్దమవుతూనే ఉంటుంది. కానీ దర్శకుడు సీరియస్ గా జరిగే నా ఆటోగ్రాఫ్ ని లైటర్ వీన్ సీన్స్ తో మార్చి ఘన విజయం సాధించాడు. తెలుగుకి వచ్చేసరికి ఆ ఒరిజనల్ కు మరింత వన్ని చేర్చేలా స్క్రిప్టు చేసారు. అయితే ఫన్ చేయాలని ఉద్దేశ్యంతో చేసిన కొన్ని సీన్స్ ఫీల్ మిస్సయ్యాయి. ముఖ్యంగా కాలేజీ సీన్స్ లో ఫీల్ రాలేదు.


నిజానికి మొదటి ఎపిసోడ్స్ లో

నిజానికి మొదటి ఎపిసోడ్స్ లో

మళయాళి వెర్షన్ చూస్తే అందులో హీరో నివిన్ పోలి...మూడు పాత్రలోనూ ఫెరఫెక్ట్ గా మాచ్ అయ్యారు. అయితే మన నాగచైతన్య దగ్గరకి వచ్చేసరికి, మొదటి రెండు ఎపిసోడ్స్ అంటే 16 కుర్రాడిగా, కాలేజీ కుర్రాడిగానూ కనిపించటం కన్నా పెద్దయ్యాక 30 సంవత్సరాల వయస్సు అర్బన్ లుక్ కే ఫెరఫెక్ట్ గా మాచ్ అయ్యారు. అయితే అలాగని మరీ అంత ఆడ్ గా ఆ రెండు ఎపిసోడ్స్ లోడనుకోండి. క్యారక్టర్ కు కావాల్సినంత ఫెరఫెక్ట్ గా లేడంతే.


దర్శకుడే ప్రాణం పోసాడు

దర్శకుడే ప్రాణం పోసాడు

ఈ రీమేక్ సినిమాపై మొదటి నుంచి అంత సదభిప్రాయం లేదు. ఎందుకంటే ఆ ఫీల్ ని, సీన్స్ ని రీక్రియేట్ చేయలేరు అని అంతా అనేసారు.అయితే దర్శకుడు దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఒరిజనల్ ప్లేవర్ ని పోనివ్వకుండా నేటివైజ్ చేసాడు. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కలపటంలో సక్సెస్ అయ్యాడు. చైతూ ఎంట్రికీ నాగార్జున...పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వెయ్యిటం, చైన్ ఫైట్ వంటివి హైలెట్ గా నిలిచాయి.


అదే పెద్ద ప్లస్

అదే పెద్ద ప్లస్

ఈ సినిమాకు పెద్ద ప్లస్ ఏమిటీ అంటే స్లోగా నడిచినా ఎక్కడా బోర్ అన్న ఫీల్ రాకపోవటం, ఫీల్ కోసం దర్శకుడు కొన్ని లాగ్ లు వదిలినా భరించగలిగేలా ఉన్నాయి. కామెడీని కూడా అక్కడక్కడా ఇమిడ్చుకుంటూ వచ్చాడు. సెకండాఫ్ లో శ్రీనివాస రెడ్డి కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది.


అతిధి పాత్రల కిక్

అతిధి పాత్రల కిక్

మొదటి భాగంలో హీరో మేనమామగా వెంకటేష్ అతిధి పాత్ర, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే హీరో తండ్రిగా నాగార్జున అతిధి పాత్ర ఫెరఫెక్ట్ గా సూట్ అయ్యాయి. ఏదో కావాలని పెట్టినట్లు కాకుండా ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ పాత్ర వచ్చినప్పుడు విజిల్స్ ఓ రేంజిలో పడ్డాయి, అక్కడక్కడా హుషారెత్తించే డైలాగులు బాగా కనెక్టయ్యాయి.


ముగ్గురు హీరోయిన్స్ మూడు రకాలుగా

ముగ్గురు హీరోయిన్స్ మూడు రకాలుగా

హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ల నటన ఆసక్తికరంగా బాగుంది. శృతి హాసన్ ని ఒరిజనల్ లోని పాత్రతో పోల్చి చూడకపోతే బాగుందనిపిస్తుంది. శృతి తన శక్తి మేరకు బాగానే చేసింది. ముఖ్యంగా డాన్స్ చేసి చూపించేటప్పుడు శృతి చాలా బాగా చేసింది. అనుపమ పరమేశ్వరన్‌ పక్కింటి అమ్మాయిని గుర్తుకు తెస్తుంది. మడోనా సెబాస్టియన్‌ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది.


అదే ఈ సినిమా గొప్పతనం

అదే ఈ సినిమా గొప్పతనం

ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చు కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం కాదని చెప్పే ఈ కథ కేవలం తెరపై విక్కీ ప్రేమకథే కాదు.. ప్రతి ఒక్కరి ,మనందరి ప్రేమకథ కనిపిస్తుంది. ప్రేమలో గెలవడం.. ఓడిపోవడం కంటే అందులో పడడమే కీలకమైన విషయం అని.. ప్రేమలో గెలిస్తే అమ్మాయి మన పక్కన ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన పాయింటే ఈ సినిమాకు హైలెట్, అదే ఈ సినిమాకు ప్రాణం పోసింది.


మాటలు ముత్యాలే

మాటలు ముత్యాలే

టెక్నికల్ గా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. కార్తీక్‌ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక గోపీసుందర్‌.. రాజేశ్‌ మురుగేశన్‌ సంగీతం చిత్రానికి ప్రాణం పోసిందనే చెప్పాలి. అలాగే. చందు మొండేటిలో మంచి దర్శకుడు మాత్రమే కాదు ..అంతకు మంచి రచయిత కూడా ఉన్నాడన్న విషయాన్ని ఈ సినిమా చెప్పేస్తుంది. చాలా చోట్ల పంచ్‌లు బాగా పేలటం కలిసొచ్చే అంశం.


చూడకపోతే హ్యాపీనే

చూడకపోతే హ్యాపీనే

ఇక ఈ సినిమా రీమేక్ కావటం, సూపర్ హిట్ మళయాళి చిత్రం అదీ యూత్ కు కనెక్ట్ అయ్యేది కావటంతో చాలా మంది ఇప్పటికి, అర్బన్ యూత్ చూసేసారు. వారందరికీ అసలు కథ, అందులోని పాత్రల నడవడిక పూర్తిగా తెలిసిపోవడంతో కంపారజన్ వద్దన్నా వచ్చేస్తోంది. అలాగే లెక్చరర్ పాత్రలో శృతి హాసన్ ని మళయాళంలో మలర్ పాత్ర అంత గొప్పగా డిజైన్ చేయకపోవటంతో ఆ లవ్ ట్రాక్ లో కాస్త బోర్ కొట్టింది.


సినిమాకు పనిచేసిన టీమ్

సినిమాకు పనిచేసిన టీమ్

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్, చైతన్యకృష్ణ, జోష్ రవి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, జీవా.నాగార్జున - వెంకటేష్‌ (అతిథి పాత్రల్లో), వైవాహర్ష తదితరులు
కథ: ఆల్ఫోన్స్‌ పుథరెన్‌
సంగీతం: గోపీసుందర్‌, రాజేశ్‌ మురుగేశన్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణం: ఎస్‌.రాధాకృష్ణ, పి.డి.వి.ప్రసాద్‌, ఎస్‌, నాగవంశీ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.
విడుదల తేదీ: 7-10-2016ఫైనల్ గా ఈ చిత్రం మళయాళం ఒరిజనల్ దూరంగా వెళ్లి ఇక్కడ నేటివిటి రాసుకున్న సీన్స్ తో తెరకెక్కింది. కాబట్టి ఒరిజనల్ చూసినవాళ్లు కూడా ఈ అందమైన రీమేక్ ని తప్పకుండా చూడవ్చచు. ఓ క్లాస్ సినిమాని... మాస్ ఏంగిల్ లో ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టి వెళ్లి ఆ ప్రేమానుభూతులను అనుభవించండి..మీ జీవితంలోని ఆ క్షణాలను నెమరువేసుకోండి.

English summary
'Premam' is an official remake of 2015 Classic 'Premam' from Malayalam. The movie features Nagachaitanya, Shrutihaasan, Madonna Sebastian and Anupama Parameswaran in titular roles. let's see how the movie has fared and is different from the original.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X