twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకులు ఫెయిల్ ( 'ఆటోనగర్‌ సూర్య' రివ్యూ )

    By Srikanya
    |

    Rating:
    1.5/5
    ....సూర్య ప్రకాష్ జోశ్యుల

    'ప్రస్దానం' చిత్రంతో మేధావి వర్ద దర్శకుడుగా పేరు తెచ్చుకుని,కేవలం క్లాస్ ప్రేక్షకులకు చేరువైన దేవకట్టా ...మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఆటోనగర్ సూర్యతో దిగినట్లు అనిపిస్తుంది. అయితే మాస్ అయినా క్లాస్ అయినా సినిమా సజావుగా, విసిగించకుండా సాగితేనే విజయం సాధిస్తుందనే విషయం మర్చిపోయినట్లున్నారు. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా, సెకండాఫ్ కి వచ్చేసరికి ఎనభైల్లో ఆగిపోయినట్లుగా విలన్ వికట్టాహాసాలు, అర్దంపర్దం లేని బ్రహ్మానందం కామెడీ, శివ చిత్రానికి పేలవమైన అనుకరణ సన్నివేశాలు, అవసరం లేని మితిమీరిన హింస తో నింపేసాడు. ముఖ్యంగా హీరోకి లక్ష్యం ఏంటో...దాన్ని తీర్చుకోవటానికి ఏం చేస్తున్నాడో స్పష్టంగా ఎస్టాబ్లిష్ చెయ్యిలేకపోయారు. మెయిన్ విలన్ సైతం... క్లైమాక్స్ వరకూ హీరోకు ఎదురుపడకపోవటం, ఎదురుపడ్డాక చిన్న పైట్ తో చంపేయటం అనే వీక్ క్లైమాక్స్ విపరీతమైన అసహనానికి గురి చేస్తుంది. నాగచైతన్య తన పాత్రలో జీవించాలని ప్రయత్నించాడు కానీ అతనికి ఈ చిత్రం మరో బెజవాడ చిత్రం అవుతుందేమో అనిపిస్తుంది.

    చిన్నప్పడే తల్లి తండ్రులని కోల్పోతాడు సూర్య(నాగ చైతన్య). తర్వాత అతన్ని ఆటోనగర్ లోని మెకానిక్ చేరదీయటంతో అక్కడ పెరుగుతాడు. అయితే అనుకోని పరిస్ధితుల్లో అక్కడున్న పరిస్ధితులకి ఎదురుతిరిగి మర్డర్ కేసులో ఇరుక్కుని చిన్నవయస్సులోనే జైలుకు వెళతాడు. జైలర్(తణికెళ్ళ)సాయింతో జైలులో చదువుకుని విడుదలై ఆటోనగర్ కి వచ్చిన సూర్య తన తెలివి ఉపయోగించి బ్యాటరీతో కారు తయారు చేయాలనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆటోనగర్ ని ఇంద్ర(జయప్రకాష్ రెడ్డి), అజయ్ కలిసి గూండాయిజం చేస్తూంటారు. ఆటోనగర్ లో ఏం చేయాలన్నా వారి అనుమతి కావాలి. అలాంటి పరిస్ధితుల్లో ...సూర్య ఏం చేసాడు....అసలు ఇంద్ర వెనక మేయర్(మధు)కి సూర్యకి పర్శనల్ కక్ష ఏమిటి... సిరి(సమంత)కి సూర్య కు ఉన్న లవ్ స్టోరీ ఏమిటి.... అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    మొదట డైలాగ్స్ రాసుకుని తర్వాత కథ రాసినట్లున్న ఈ చిత్రం కథ,కథనమే సమస్యగా మారింది. హీరో క్యారక్టరే ఎలివేషన్ మీద పెట్టిన దృష్టి, కథలో అతని జర్నీ మీద పెట్టలేదు. ముఖ్యంగా ఇద్దరు విలన్స్ లేకుండా ఉంటే బాగుండేది లేదా... మెయిన్ విలన్ తో హీరోకి మొదటి నుంచీ ఇంట్రాక్షన్ పెడితే, అతని పాత్ర ప్యాసివ్ కాకుండా ఉండేది. అలా చేయకపోవటంతో చివరి దాకా మెయిన్ విలన్ సీన్ లోకి రాకుండా కేవలం డైలాగులే చెప్తూ కాలం గడుపుతూంటాడు. అలాగే హీరో సైతం అసలు మెయిన్ విలన్ ఎవరు..వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు అనే విషయం పట్టించుకోకుండా రియాక్ట్ అవుతూంటాడు. దాంతో చూస్తున్నంతసేపు హీరో యాక్షన్ లో ఉన్నట్లే ఉంటుంది కానీ కథ ఎక్కడికీ కదిలినట్లు ఉండదు. అలాగే... హీరో ఇంకా విలన్ కొడుకుని కిడ్నాప్ చేసి లెటర్స్ పంపటం వంటి సన్నివేసాలు, శివ చిత్రం ప్యారెడీ పెట్టకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే కథ ఎనభైల్లో జరిగినా చూసేవారు 2014 లో ఉన్నారు కదా.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    డైలాగ్స్ సూపర్బ్

    డైలాగ్స్ సూపర్బ్

    మనిషి ఎలా ఉండాలో నిర్ణయించేది కాదు వ్యవస్ధ, మనిషే వ్యవస్ధ, ప్రపంచంలో ఎక్కువ భయపడేది ఎవరో తెలుసా, భయపెట్టేవాడు...ఎందుకంటే వాడికి తెలిసిన ఒక ఒక ఎమోషన్ భయం వంటి సూపర్బ్ డైలాగులు ఉన్నాయి. డైలాగులు పెద్దవిగా ఉన్నా ఈ సినిమాకు ఉన్న ఏకైక ప్లస్ అవే. అయితే నాగచైతన్య పాత్రకు ఆ డైలాగులకు సంభంధం ఉంటా..అలాంటి మాటలు...అలాంటి వాతావరణంలో పెరిగినవాడు మాట్లాడతాడా అంటే సమాదానం చెప్పలేం కానీ..డైలాగులు అయితే బాగున్నాయి.

    స్లో నేరేషన్

    స్లో నేరేషన్

    సినిమా చాలా స్లోగా,డల్ గా నడుస్తూండటంతో హీరోగా నాగచైతన్య ఏమన్నా జోష్ ప్రదర్శిద్దామన్నా దానికి అవకాసం లేకుండా పోయింది. ఎక్కడా ఉత్సాహమనేది కనపడదు. హీరో,హీరోయిన్స్ ఇద్దరూ ఏదో కోల్పోయినట్లు కనపడతారు.

    ఫలించని కామెడీ

    ఫలించని కామెడీ

    బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో సినిమా హిట్ కు మేజర్ షేర్ గా నిలుస్తున్న సంగతి నిజమే. అంతమాత్రాన అతని పాత్రను కథకు సంభంధం లేకుండా పెడితే పండుతుందా. పాట కూడా బ్రహ్మానందం మీద పెట్టారు. అదీ విఫలమైంది.

    లెంగ్త్ సమస్య

    లెంగ్త్ సమస్య

    ఈ సినిమాకి పెద్ద మైనస్ రన్ టైం 2 గంటల 39 నిమిషాలు. ఓ అరగంట కట్ చేసినా సినిమాకు ఏమీ నష్టం రాదు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాకు పాటలు బాగా అడ్డంగా మారాయి. హీరోయిన్ ని కేవలం పాటలకే వాడారు.

    కమర్షియల్ విలువలు

    కమర్షియల్ విలువలు

    ఈ సినిమాని కమర్షియల్ గా హిట్ కొట్టాలని తాపత్రయంలో ఐటం సాంగ్ ని సైతం ఇరికించారు. అయితే అదీ దారుణంగా విఫలమైందనే చెప్పాలి. ఐటం సాంగ్ మొదలు కాగానే చాలా మంది లేచి వెళ్లిపోవటం కనిపించింది.

    దర్శకుడుగా

    దర్శకుడుగా

    సినిమా నిజానికి డబ్బైలో మొదలై, ఎనభై,తొంబైల్లోకి నడుస్తుంది. అయితే దర్శకుడుగా దేవకట్టా ఆ కాలం వాతావరణం ప్రతిబింబించటం అనేది ఎలా ఉన్నా...టేకింగ్ మాత్రం ఆ కాలం దర్శకులను గుర్తు చేసింది. అలాగే విలన్స్ పెద్దగా నవ్వటం వంటివి ఈ మధ్యకాలంలో ఎవరూ వాడటం లేదు...అది గమనించినట్లు లేదు.

    టెక్నకల్ గా...

    టెక్నకల్ గా...

    సాంకేతింకగా ఉన్నతంగా ఏమీ లేదు. కెమెరా వర్క్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ చేసినట్లు అయితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎడిటర్ కి ధాంక్స్ చెప్పుకునేవారు.

    ప్రతి ఫ్రేమ్ లోనూ

    ప్రతి ఫ్రేమ్ లోనూ

    నిర్మాతలు చేత ఎంత ఖర్చు పెట్టించారో కానీ...సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లోనూ జూ.ఆర్టిస్టులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు.

    హిట్ పెయిర్...ఏది

    హిట్ పెయిర్...ఏది

    వీరిద్దరి హెట్ పెయిర్ కాంబినేషన్ మ్యాజిక్ ఈ సారి వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అసలు ఎందుకనో రొమాంటిక్ ఫీల్ రాలేదు. లవ్ సీన్స్ మరీ డ్రై గా ఉన్నాయి. సెకండాఫ్ లో అయితే అసలు హీరోయిన్ కనపడలేదు. కనపడిందంటే ఖచ్చితంగా పాట ఉందనే అర్దం.

    నటీనటులు

    నటీనటులు

    ప్రస్దానంలో తన డైలాగులతో అదరకొట్టిన సాయికుమార్ ఇందులో చాలా డల్ గా కనిపిస్తారు. అలాగే విలన్ గా చేసిన మధు...ఏదో డ్రామాల్లో ఉన్నట్లు,లుక్,డైలాగ్ డెలవరీ ఉంది. ముఖ్యంగా అజయ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. జయప్రకాష్ రెడ్డి ఎప్పటిలాగే చేసాడు.

    నాగచైతన్య

    నాగచైతన్య

    హీరోగా నాగచైతన్య...మాస్ పాత్రలకు సూట్ కావటం లేదు. అతని వయస్సు, బాడీ లాంగ్వేజ్ సహకరించటం లేదు అది గమనించుకుని పాత్రలు ఎంపిక చేసుకుంటే ఏమి మాయ చేసావో వంటి డీసెంట్ హిట్ లు వస్తాయి.

    ఎవరెవరు

    ఎవరెవరు

    పతాకం: మ్యాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌
    చిత్రం: ఆటోనగర్‌ సూర్య
    నటీనటులు: నాగచైతన్య, సమంత, సాయికుమార్‌, కిమాయా, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, దువ్వాసి మోహన్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తదితరులు
    ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్,
    కూర్పు: గౌతంరాజు,
    ఫైట్స్: రామ్-లక్ష్మణ్,
    కళ: రవీందర్,
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.
    నిర్మాత: కె.అచ్చిరెడ్డి
    సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.
    విడుదల తేదీ: 27, జూన్ 2014.

    ఫైనల్ గా హీరో తన తల్లి తండ్ర్లులను చంపిన విలన్ పై పగ తీర్చుకోవటం అనే రొటీన్ కార్యక్రమానికి ఇంత హింస, గజిబిజి చూసేవారికి పెట్టడం అవసరమా అనిపిస్తుంది. బి,సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ చిత్రం అక్కడైనా ఆడుతుందా అంటే సందేహమే.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Autonagar Surya is a action drama movie directed by Deva Katta released today with divide talk. Naga Chaitanya and Samantha playing the main lead roles along with Sai Kumar in pivotial roles. The film was produced by K. Atchi Reddy on Max India Productions banner. Anoop Rubens scored music for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X